త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Anil Ravipudi | రామాయ‌ణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా – జ‌న‌నాయ‌గ‌న్ మేక‌ర్స్‌తో డీల్‌

టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ఓ మైథాల‌జీ మూవీ చేయ‌బోతున్నారు. రామాయ‌ణం ఆధారంగా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాను టాక్సిక్‌, జ‌న‌నాయ‌గ‌న్ సినిమాల‌ను నిర్మించిన కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ రూపొందించ‌బోతుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్న‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Aug 17, 2026, 11.57 am IST

Anil Ravipudi | రామాయ‌ణం ఆధారంగా అనిల్ రావిపూడి సినిమా – జ‌న‌నాయ‌గ‌న్ మేక‌ర్స్‌తో డీల్‌
Advertisement

Anil Ravipudi | పౌరాణిక క‌థ‌ల‌తో సినిమాల‌ను తెర‌కెక్కించే ట్రెండ్ టాలీవుడ్‌లో పెరిగిపోతుంది. టాప్ హీరోలు, ద‌ర్శ‌కులు సైతం మైథాల‌జీ బ్యాక్‌డ్రాప్‌ల‌తో సినిమాలు చేసేందుకు ఆస‌క్తిని చూపుతున్నారు. ఈ ట్రెండ్‌లోకి టాలీవుడ్ స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి అడుగుపెట్టాడు. రామాయ‌ణం ఆధారంగా ఓ సినిమా చేయ‌బోతున్నాడు. అయితే రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలా కాకుండా యానిమేష‌న్‌లో అనిల్ రావిపూడి ఈ సినిమా చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

టాప్ స్టార్స్ వాయిస్ ఓవ‌ర్‌...

ఈ యానిమేష‌న్ మూవీని టాక్సిక్‌, మెగా 158 సినిమాల నిర్మాత వెంక‌ట‌నారాయ‌ణ త‌న కేవీఎన్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్న‌ట్లు స‌మాచారం. టాలీవుడ్‌లోని ప‌లువురు టాప్ స్టార్స్ వాయిస్ ఓవ‌ర్ అందించ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

స్క్రిప్ట్ వ‌ర్క్ కంప్లీట్‌....

ఈ రామాయ‌ణ మూవీకి సంబంధించి ఇప్ప‌టికే స్క్రిప్ట్ వ‌ర్క్‌ను మొత్తాన్ని అనిల్ రావిపూడి కంప్లీట్ చేసిన‌ట్లు తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఇందులోని డైలాగ్స్‌, పాత్ర‌ల తాలూకు ఎక్స్‌ప్రెష‌న్స్, సీన్స్ అన్నింటిని డీటైల్‌గా అనిల్ రావిపూడి రెడీ చేసిన‌ట్లు చెబుతున్నారు. తానే స్వ‌యంగా న‌టించి వాట‌న్నింటిని రికార్డ్ చేసిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. వాటి ఆధారంగానే వీఎఫ్ఎక్స్ ప‌నులు చేయాల‌ని మేక‌ర్స్ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం .

ఐదు భాష‌ల్లో రిలీజ్‌...

ఈ యానిమేష‌న్ మూవీని కూడా పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో ఐదు భాష‌ల్లో రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్లు టాక్‌. వ‌చ్చే ఈ ఏడాది ఈ మైథాల‌జీ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు చెబుతున్నారు.

మ‌ల్టీస్టార‌ర్ మూవీ...

ప్ర‌స్తుతం తెలుగులో వెంక‌టేష్‌, క‌ళ్యాణ్ రామ్‌ల‌తో ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో కీర్తి సురేష్, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. ఇటీవ‌లే ఈ సినిమా నుంచి వెంక‌టేష్ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

 

Advertisement
Advertisement