Ananya Panday | అనన్య పాండే రొమాంటిక్ మూవీలో ఘాటు లిప్‌లాక్‌లు – అభ్యంతరం చెప్పిన సెన్సార్
అనన్యా పాండే హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ చాంద్ మేరా దిల్‌కు రిలీజ్ ముందే సెన్సార్ బోర్డ్ పెద్ద షాకిచ్చింది. ఈ సినిమాలోని లిప్‌లాక్ సీన్లు అన్నింటిని కట్ చేసేసిందట. ఒక నిమిషం ముప్ఫై ఆరు సెకండ్ల నిడివితో కూడిన లాంగెస్ట్ లిప్‌లాక్ సీన్‌ను కూడా సెన్సార్ బోర్డ్ డిలీట్ చేసినట్లు చెబుతున్నారు.
Entertainment | Published On May 18, 2026, 4.24 pm IST
Ananya Panday | జయాపజయాలకు అతీతంగా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఫుల్ బిజీగా ఉంది అనన్యా పాండే. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్, పతి పత్నీ ఓర్ వో బ్లాక్‌బస్టర్స్‌తో అనన్య పాండే కెరీర్ ఆరంభమైంది. ఈ సినిమాల్లో తన గ్లామర్, యాక్టింగ్‌తో మెప్పించిన ఈ బ్యూటీ బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా మారడం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కథల ఎంపికలో తప్పటడుగులు వేయడంతో ఎంత త్వరగా ఫేమస్ అయ్యిందో అంతే ఫాస్ట్‌గా ఆమె కెరీర్ డౌన్ అవుతూ వచ్చింది. గత ఏడాది అనన్య పాండే హీరోయిన్‌గా నటించిన అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2తో పాటు తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ భారీ అంచనాల నడుమ రిలీజై బోల్తా కొట్టాయి. ఈ డిజాస్టర్లతో సంబంధం లేకుండా ఆఫర్లు మాత్రం అనన్యకు భారీగానే వస్తున్నాయి.
లిప్‌లాక్......
ప్రస్తుతం చాంద్ మేరా దిల్ సినిమా చేస్తోంది అనన్య పాండే . రొమాంటిక్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కిల్ ఫేమ్ లక్ష్య హీరోగా నటిస్తోన్నాడు. వివేక్ సోనీ దర్శకత్వం వహించాడు. మే 22న ఈ బాలీవుడ్ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఇందులో హీరోహీరోయిన్ల ప్రేమకథను దర్శకుడు చాలా బోల్డ్‌గా చూపించాడట. లిప్‌లాక్‌లు చాలానే ఉంటాయట. కొన్ని ముద్దు సీన్లను ఇటీవల రిలీజైన టీజర్, ట్రైలర్‌లలో చూపించారు. అవన్నీ జెన్‌జీ ఆడియెన్స్ అట్రాక్ట్ చేస్తాయని మేకర్స్ భారీగా ఆశలు పెట్టుకున్నారు.
సెన్సార్ బోర్డ్ షాక్...
కానీ వారికి సెన్సార్ బోర్డ్ పెద్ద షాకిచ్చింది. ఈ లిప్‌లాక్ సీన్లు అన్నింటిని కట్ చేసేసిందట. ఒక్క నిమిషం ముప్పై ఆరు సెకండ్ల నిడివితో కూడిన లాంగెస్ట్ లిప్‌లాక్ సీన్‌ను డిలీట్ చేసేసిందట. మరో పది సెకండ్ల ముద్దు సీన్‌కు కూడా కత్తెర వేసేసిందట. అంతే కాకుండా సినిమాలోని హీరోహీరోయిన్ల మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్లను కూడా తొలగించినట్లు చెబుతున్నారు. సెన్సార్ తీరుపై మేకర్స్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి లిప్‌లాక్‌లే కీలకమని, వాటిని తీసేస్తే సినిమాలోని సోల్ మిస్సవుతుందని సెన్సార్ బోర్డ్‌ను కన్వీన్స్ చేసే ప్రయత్నం చేశారట. టీమ్ వాదనలతో సెన్సార్ బోర్డు ఏకీభవించలేదని ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్‌గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్
- ●Telangana Cabinet | సెప్టెంబర్ 6న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..? మంత్రిగా రాజగోపాల్ రెడ్డి..!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా

Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్





