Vanajeevi Ramaiah | వనజీవి రామయ్య బయోపిక్ – టైటిల్ రోల్‌లో బ్రహ్మాజీ
పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవితం వెండితెరపైకి రాబోతుంది. వనజీవి రామయ్య పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో టైటిల్ పాత్రలో బ్రహ్మాజీ నటించాడు.
Entertainment | Published On Mar 17, 2026, 9.05 pm IST
Vanajeevi Ramaiah | పద్మశ్రీ అవార్డు గ్రహీత, కోటి మొక్కల రామయ్యగా ప్రసిద్ధి చెందిన వనజీవి దరిపల్లి రామయ్య జీవిత కథ వెండితెరపైకి రాబోతుంది. ఈ మహనీయుడి జీవితం ఆధారంగా ‘వనజీవి రామయ్య’ పేరుతో ఓ మూవీ రూపొందుతోంది. టైటిల్ పాత్రలో బ్రహ్మాజీ నటిస్తోన్న ఈ సినిమాకు వేముగంటి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రాబోతుంది. ఈ బయోపిక్ మూవీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ఓ పురస్కారాన్ని దక్కించుకుంది.
స్పెషల్ ప్రివ్యూ...
ఇటీవల హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో వనజీవి రామయ్య ప్రివ్యూ ప్రదర్శించారు. వనజీవి రామయ్య సినిమాను భారతీయ భాషలన్నింటిలో విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దర్శకుడు వేముగంటి మాట్లాడుతూ, “కోటి మొక్కలు నాటి ప్రకృతికి సేవ చేసిన రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. రామయ్య చేసిన సేవలను స్ఫూర్తిదాయకంగా ఈ సినిమాలో చూపించాం. రామయ్య పాత్రలో బ్రహ్మాజీ ఒదిగిపోయారు” అని తెలిపారు. ప్రకృతి ప్రేమికుడు రామయ్యకు ఘనమైన నివాళిగా ఈ సినిమా ఉంటుందని నిర్మాతలు పేర్కొన్నారు.
దరిపల్లి రామయ్య...
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన దరిపల్లి రామయ్య పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. “వృక్షో రక్షతి రక్షితః” అనే నినాదాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఊరూరూ తిరిగిన ఆయన, శుభకార్యాల్లో మొక్కలను బహుమతులుగా ఇవ్వడం ద్వారా సరికొత్త ఆచారాన్ని నెలకొల్పారు. చెట్ల గింజలను సేకరించి అటవీ ప్రాంతాల్లో చల్లడం ఆయన నిత్యకృత్యంగా ఉండేది.
ప్రకృతిని ప్రేమించిన ఆ మహానుభావుడు గత ఏడాది ఏప్రిల్‌లో ప్రకృతి ఒడిలో కలిసిపోయినప్పటికీ, ఆయన చూపించిన మార్గం తరతరాలకు మార్గదర్శకంగా నిలుస్తోంది. ఈ బయోపిక్ ద్వారా ఆయన సేవలు, స్ఫూర్తి మరింత విస్తృతంగా ప్రజలకు చేరవ కానున్నాయి.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



