త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 | మెచ్యూరిటీ ఉన్న‌వాళ్లు అలా మాట్లాడ‌రు – అఖండ 2 లాజిక్స్‌పై బోయ‌పాటి శ్రీను కామెంట్స్‌

Akhanda 2 | బాల‌కృష్ణ (Balakrishna) హీరోగా న‌టించిన అఖండ 2 సినిమా ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అఖండ 2 క‌థ‌లో లాజిక్స్ మిస్స‌య్యాయంటూ విమ‌ర్శ‌లు, ట్రోల్స్ వినిపిస్తున్నాయి. ఈ ట్రోల్స్‌పై డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను రియాక్ట్ అయ్యారు.

N

Entertainment | Published On Dec 20, 2025, 12.39 pm IST

Akhanda 2 | మెచ్యూరిటీ ఉన్న‌వాళ్లు అలా మాట్లాడ‌రు – అఖండ 2 లాజిక్స్‌పై బోయ‌పాటి శ్రీను కామెంట్స్‌

బాల‌కృష్ణ

Advertisement

Akhanda 2 | బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అఖండ 2 (Akhanda 2)ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. శివ‌త‌త్వం, స‌నాత‌న ధ‌ర్మం అంశాల‌తో రూపొందిన ఈ ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌నే రాబ‌డుతుంది. ఫ‌స్ట్ వీక్‌లో పూర్త‌య్యేస‌రికి వంద కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. శుక్ర‌వారం నాటితో 102 కోట్ల‌కుపైగా గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను అఖండ 2 రాబ‌ట్టింది. అఖండ, వీర‌సింహారెడ్డి, భ‌గ‌వంత్ కేస‌రి, డాకు మ‌హారాజ్ త‌ర్వాత వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన బాల‌కృష్ణ ఐదో మూవీగా అఖండ 2 రికార్డ్ క్రియేట్ చేసింది.
అఖండ 2 సినిమాలో బాల‌కృష్ణ యాక్టింగ్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అఘోరాగా, ఎమ్మెల్యేగా రెండు క్యారెక్ట‌ర్స్‌లో బాల‌కృష్ణ అద‌ర‌గొట్టాడ‌ని నెటిజ‌న్లు చెబుతోన్నారు. బోయ‌పాటి అందించిన క‌థ‌తో పాటు ఆయ‌న టేకింగ్‌పై మాత్రం దారుణంగా విమ‌ర్శ‌లొస్తున్నాయి. సినిమాలో లాజిక్స్ అస్స‌లు క‌నిపించ‌వ‌ని డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీనును నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ విమ‌ర్శ‌ల‌పై బోయ‌పాటి శ్రీను రియాక్ట్ అయ్యారు. లాజిక్స్ మిస్స‌య్యాయంటూ వ‌స్తున్న ట్రోల్స్‌పై త‌న‌కు ఎలాంటి బాధ లేద‌ని అన్నారు.

లాజిక్‌ల‌తో తీయ‌మంటే కుద‌ర‌దు

"థియేట‌ర్‌కు వ‌చ్చిన ఆడియెన్ హ్యాపీగా ఫీల‌య్యాడా? సినిమాలో విజిల్ మూమెంట్స్ ఉన్నాయా? లేదా ?అన్న‌దే ముఖ్య‌మ‌ని నేను న‌మ్ముతుంటా. సినిమా అన్న‌దే ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ దానిని లాజిక్‌ల‌తో తీయ‌మంటే కుద‌ర‌దు.సినిమాలో లాజిక్‌లు లేవు అనే మాట‌ల‌కు బాధ‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. మెచ్యూరిటీ ఉన్న‌వాళ్లు అలా మాట్లాడ‌రు" అని బోయ‌పాటి శ్రీను అన్నారు. "రియ‌ల్‌ లైఫ్‌లో ఐల‌వ్ యూ అన‌గానే రోడ్ల మీద ఎవ‌రూ పాట‌లు పాడ‌రు. సినిమాల్లో కొడితే ప‌డ‌తారు. బ‌య‌ట మాత్రం అలా జ‌ర‌గ‌దు. సినిమా అన్న‌దే క‌ల్పితం. దానికి లాజిక్‌ల‌తో ప‌ని ఉండ‌ద‌ని" బోయ‌పాటి శ్రీను చెప్పారు. ఆయ‌న కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.
అఖండ 2 మూవీలో సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించ‌గా...బాలీవుడ్ న‌టి హ‌ర్షాలీ మ‌ల్హోత్రా కీల‌క పాత్ర పోషించింది. 14 రీల్స్ ప‌తాకంపై గోపీ ఆచంట‌, రామ్ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీను కాంబోలో వ‌చ్చిన నాలుగో మూవీ ఇది.

Advertisement

తాజావార్తలు

Advertisement