Allu Arjun | బాస్ ఈజ్ బ్యాక్ – వింటేజ్ చిరు కనిపించారు – మన శంకర వరప్రసాద్‌కు అల్లు అర్జున్ రివ్యూ
మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి అల్లు అర్జున్ రివ్యూ ఇచ్చారు. ఈ సినిమాలో వింటేజ్ చిరంజీవి కనిపించారని ట్వీట్ చేశారు. వెంకటేష్ యాక్టింగ్‌తో అదరగొట్టాడని బన్నీ పేర్కొన్నారు. ఇది సంక్రాంతి బాస్ బస్టర్ అంటూ బన్నీ మంగళవారం చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jan 20, 2026, 3.47 pm IST
Allu Arjun | చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. సంక్రాంతికి థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ వారం రోజుల్లోనే మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. చిరంజీవి కెరీర్‌లో అత్యధిక వేగంగా ఈ ఘనతను సాధించిన మూవీగా నిలిచింది.
అల్లు అర్జున్ ట్వీట్
తాజాగా మన శంకర వరప్రసాద్‌గారుపై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇటీవలే పుష్ప 2 ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన బన్నీ సోమవారం ఇండియాకు తిరిగి వచ్చారు. హైదరాబాద్ రాగానే మన శంకర వరప్రసాద్‌గారు మూవీని వీక్షించారు. ఈ సినిమాకు రివ్యూ ఇస్తూ మంగళవారం ఓ ట్వీట్ పెట్టారు. మన శంకర వరప్రసాద్‌గారు సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు..సంక్రాంతి "బాస్" బస్టర్ కూడా అంటూ తన ట్వీట్‌లో బన్నీ పేర్కొన్నారు.
బాస్ ఈజ్ బ్యాక్...
"బాస్ ఈజ్ బ్యాక్. వింటేజ్ చిరంజీవిగారు ఈ సినిమాలో కనిపించారు. స్క్రీన్‌పై ఆయన ఫైర్ కనిపించింది. వెంకటేష్ గారు తన యాక్టింగ్‌తో అదరగొట్టేశారు. నయనతార క్యారెక్టర్‌లోని హుందాతనం, క్యాథరిన్ పాత్రలోని కామెడీ టైమింగ్ బాగున్నాయి. మిగిలిన నటీనటులు తమ ఎనర్జిటిక్ పర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. సంక్రాంతి స్టార్ బుల్లిరాజు నవ్వించాడు. హుక్ స్టెప్, మెగా విక్టరీ సాంగ్స్ బాగున్నాయి. సంక్రాంతికి వస్తారు హిట్ కొడతారని ఈ సినిమాతో అనిల్ రావిపూడి మరోసారి నిరూపించారు. ఈ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్న సుస్మిత కొణిదెల, సాహు గారపాటితో మిగిలిన టెక్నీషియన్లకు కంగ్రాట్స్.. ఇది సంక్రాంతి బ్లాక్‌బస్టర్ మాత్రమే కాదు..సంక్రాంతి "బాస్" బస్టర్" కూడా అంటూ తన ట్వీట్‌లో అల్లు అర్జున్ పేర్కొన్నారు. ఆయన ట్వీట్ వైరల్ అవుతోంది. మెగా అభిమానులు ఈ ట్వీట్‌ను తెగ షేర్ చేస్తున్నారు.
మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటించారు. నయనతార హీరోయిగా కనిపించగా...కేథరీన్ ఓ ఇంపార్టెంట్ రోల్ చేసింది. సంక్రాంతి విన్నర్ గా ఈ మూవీ నిలిచింది.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



