త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ntr Dragon | ఎన్టీఆర్ డ్రాగ‌న్‌లో విల‌న్‌గా బాలీవుడ్ హీరో – ప్ర‌శాంత్ నీల్ ప్లానింగ్ వేరే లెవెల్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ , ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న‌ డ్రాగ‌న్ మూవీలో విల‌న్‌గా బాలీవుడ్ హీరో పేరు తెర‌పైకి వ‌చ్చింది. ఈ యాక్ష‌న్ సినిమాలో విల‌న్‌గా మ‌ల‌యాళం హీరో టోవినో థామ‌స్ ప్లేస్‌లో షాహిద్ క‌పూర్‌ను మేక‌ర్స్ అప్రోచ్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Apr 11, 2026, 7.12 pm IST

Ntr Dragon | ఎన్టీఆర్ డ్రాగ‌న్‌లో విల‌న్‌గా బాలీవుడ్ హీరో – ప్ర‌శాంత్ నీల్ ప్లానింగ్ వేరే లెవెల్
Advertisement

Ntr Dragon |  యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న డ్రాగ‌న్ సినిమాపై సోష‌ల్ మీడియాలో మ‌రో కొత్త రూమ‌ర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విల‌న్‌గా బాలీవుడ్ హీరో న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డ్రాగ‌న్‌లో విల‌న్‌గా మ‌ల‌యాళ హీరో టోవినో థామ‌స్‌ను తీసుకోవాల‌ని ప్లాన్ చేశారు ప్ర‌శాంత్ నీల్‌. ఎన్టీఆర్‌కు ధీటుగా టోవినో థామ‌స్ రోల్ ప‌వ‌ర్‌ఫుల్‌గా ఉంటుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే డేట్ ఇష్యూస్ కార‌ణంగా తాను డ్రాగ‌న్ సినిమా చేయ‌డం లేదంటూ ఇటీవ‌ల ప‌ళ్లిచ‌ట్టంబి ప్ర‌మోష‌న్స్‌లో టోవినో థామ‌స్ ప్ర‌క‌టించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. టోవినో థామ‌స్ ప్లేస్‌లో విల‌న్‌గా డ్రాగ‌న్‌లో న‌టించే యాక్ట‌ర్ ఎవ‌ర‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

బాలీవుడ్ హీరో...

తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ క‌పూర్ పేరు తెర‌పైకి వ‌చ్చింది. డ్రాగ‌న్‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించ‌డానికి షాహిద్ గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్, కేజీఎఫ్ 2 సినిమాల‌తో డైరెక్ట‌ర్‌ ప్ర‌శాంత్ నీల్ పేరు బాలీవుడ్‌లోనూ మారుమోగింది. య‌శ్‌తో పాటు ఈ సినిమాలో విల‌న్‌గా క‌నిపించిన యాక్ట‌ర్ల‌కు మంచి పేరు వ‌చ్చింది. డ్రాగ‌న్‌లో హీరోకు స‌మానంగా విల‌న్ పాత్ర‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ట‌. ఎలివేష‌న్లు కూడా భారీగానే ప్లాన్ చేశార‌ట‌. ప్ర‌శాంత్ నీల్ టేకింగ్‌, మేకింగ్‌పై ఉన్న న‌మ్మ‌కంతోనే షాహిద్ క‌పూర్ డ్రాగ‌న్‌లో న‌టించ‌డానికి అంగీక‌రించార‌ని అంటున్నారు. డ్రాగ‌న్‌తోనే టాలీవుడ్‌లోకి షాహిద్ క‌పూర్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడ‌ని చెబుతున్నారు.

అవ‌న్నీ రూమ‌ర్లే...

డ్రాగ‌న్ షూటింగ్‌కు గ‌త రెండు నెల‌లుగా మేక‌ర్స్ బ్రేక్ ఇచ్చారు. ఫిబ్ర‌వ‌రిలో పూర్త‌యిన జోర్డాన్ షెడ్యూల్ త‌ర్వాత డ్రాగ‌న్ షూటింగ్ తిరిగి మొద‌లుకాలేదు. మార్చి నెలాఖ‌రున ప్లాన్ చేసిన షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యిందంటూ ప్ర‌చారం జ‌రిగింది. ఈ రూమ‌ర్ల‌ను మేక‌ర్స్ ఖండించారు. తాము ప్లాన్ చేసిన ప్ర‌కార‌మే డ్రాగ‌న్ షూటింగ్ అంత స‌వ్యంగా జ‌రుగుతుంద‌ని, పుకార్ల‌ను న‌మ్మ‌ద్దంటూ వెల్ల‌డించారు.
డ్రాగ‌న్ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా రుక్మిణి వ‌సంత్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ న‌టుడు అనిల్ క‌పూర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న ఈ సినిమాకు ర‌వి బ‌స్రూర్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 

Advertisement
Advertisement