త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vemula Veeresham | లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం.. ఒకరికి ఉద్యోగం

Vemula Veeresham | తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ (Lakshman Goud) కుటుంబానికి రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చార‌ని ప్ర‌భుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు.

S

Telangana | Published On Nov 5, 2026, 7.35 pm IST

Vemula Veeresham | లక్ష్మణ్ గౌడ్ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం.. ఒకరికి ఉద్యోగం
Advertisement
  • పిల్లల చదువుల బాధ్యతపై సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు
  • ప్రభుత్వ విప్ వేముల వీరేశం

Vemula Veeresham | త్రినేత్ర న్యూస్‌: తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ (Lakshman Goud) కుటుంబానికి రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సహాయం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంపై సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చార‌ని ప్ర‌భుత్వ విప్ వేముల వీరేశం (Vemula Veeresham) తెలిపారు. దీంతోపాటు పిల్లల చదువుల బాధ్యతను చూసుకుంటామ‌ని భ‌రోసా ఇచ్చిన‌ట్లు చెప్పారు. సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి ఆదేశాల మేర‌కు గురువారం ల‌క్ష్మ‌ణ్‌గౌడ్ ఇంటికి వెళ్లి త‌క్ష‌ణ ఆర్థిక సాయం కింద రూ.5 ల‌క్ష‌లు అందించిన‌ట్లు పేర్కొన్నారు.

జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన లక్ష్మణ్ గౌడ్ అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర విషాదకరం. ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడం, పిల్లల చదువుల బాధ్యత తీసుకోవడంపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమంలో లక్ష్మణ్ గౌడ్ కీలకంగా పాల్గొన్నాడు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది అని నేత‌లు చెప్పారు.

జనగామ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్, ఎమ్మెల్సీ అండ్‌ మండలి ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ బాధిత‌ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఉన్నారు.

Advertisement
Advertisement