Madhusudhana Chary | బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న పొన్నం ప్రభాకర్: మధుసూదనా చారి
Madhusudhana Chary | బీసీ బిడ్డ అయిన మంత్రి పొన్న ప్రభాకర్ (Ponnam Prabhakar) బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాడని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి (Madhusudhana Chary) అన్నారు. బీసీల ఆత్మ గౌరవ భవనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు.
Madhusudhana Chary | త్రినేత్ర న్యూస్: బీసీ బిడ్డ అయిన మంత్రి పొన్న ప్రభాకర్ (Ponnam Prabhakar) బీసీల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నాడని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనా చారి (Madhusudhana Chary) అన్నారు. బీసీల ఆత్మ గౌరవ భవనాలపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. బీసీల ఆత్మగౌరవం కాపాడాలని కేసీఆర్ ఆత్మగౌరవ స్థలాలు ఇచ్చారని, కాంగ్రెస్ (Congress) పార్టీ బీసీల ద్రోహి పార్టీలా మారిందని విమర్శించారు. మూడేండ్లుగా రాష్ట్రంలో సర్వ భ్రష్ట ప్రభుత్వం నడుస్తున్నదని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యే వివేకానందతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నీళ్లను ఒడిసిపట్టలేక రాష్ట్రంలో కరవు తెచ్చారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణకు అలానే అన్యాయం జరిగిందని చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాలనలో అన్యాయం జరుగుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బొగ్గు ఉన్నప్పటికీ కరెంట్ ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వంలో సంక్షేమ పాలన అందించామని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి పాలన మొత్తం సర్వ భ్రష్ట పాలనే అని ధ్వజమెత్తారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను అణచివేస్తున్నదని చెప్పారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నమే: గంగుల కమలాకర్
బీసీలకు కడుపునిండా అన్నం పెట్టిన నాయకుడు కేసీఆర్ (KCR) అని మాజీ మంత్రి గంగుల కమలాకర్ (Gangula Kamalakar) అన్నారు. 2011, 2012లో నాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి.. బీసీలు సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు భవనాలు అడిగితే వెకిలిగా నవ్వారని చెప్పారు. 2018లో జీవో 189 బీసీల ఆత్మ గౌరవం కాపాడేందుకు తెచ్చామన్నారు. ఆత్మగౌరవ భవనాలకు కేసీఆర్ రూ.97.5 కోట్లు ఇచ్చారని తెలిపారు. కోకాపేటలో బీసీ ఆత్మ గౌరవ భవనం ఇచ్చారని గుర్తుచేశారు. ఆయా సంఘాలకు బీఆర్ఎస్ (BRS) సర్కార్ ప్రభుత్వ భూములు ఇచ్చిందన్నారు. ప్రతి కులానికి ఒక ట్రస్ట్ ఉండాలని కేసీఆర్ చెప్పారని.. బీసీలపై ఆధిపత్యం, అజమాయిషీ ఉండకుండా భవనాలు ఇచ్చారని వెల్లడించారు. గత నెల 29న కాంగ్రెస్ ప్రభుత్వం చీకటి జీవో ఇచ్చిందన్నారు. జీవో నంబర్ 14తో ఆత్మ గౌరవ భవనాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమైందని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేసే ప్రయత్నమే ఆ జీవో అని విమర్శించారు. బీసీలు బానిసలుగా బతికేలా జీవో 14 (GO 14) తెచ్చారని చెప్పారు. బీసీల ఆత్మ గౌరవంపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తున్నదని మండిపడ్డారు. జీవో 14ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. త్వరలోనే ఛలో కోకాపేట్ కార్యక్రమానికి పిలుపునిస్తామన్నారు.
కత్తి రేవంత్ రెడ్డి అయితే కోసేది పొన్నం: శ్రవణ్
భారతదేశ అస్తిత్వం కాపాడాలని మారోజు వీరన్న మంచి పుస్తకం రాశారు, బీసీలు ఆత్మ గౌరవంతో బతకాలని కేసీఆర్ ఆలోచన చేశారని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రావణ్ (Dasoju Sravan Kumar) అన్నారు. రూ.4 వేల కోట్ల విలువైన భూములను బీసీలకు ఇచ్చారని చెప్పారు. ఆ భూములను కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీల గొంతు కోసేందుకు సిద్ధమైందన్నారు. కత్తి రేవంత్ రెడ్డి అయితే కోసేది మాత్రం పొన్నం ప్రభాకర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు అసమర్ధులని సన్యాసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడని మండిపడ్డారు. 60 శాతం బీసీల పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. బీసీ ఐఏఎస్, ఐపీఎస్‌లు జీవో 14 చదివితే బీసీలకు జరిగే అన్యాయం తెలుస్తుందన్నారు.
సెలెక్షన్ కమిటీలో బీసీ కమిషన్ చైర్మన్ లేడని చెప్పారు. కామారెడ్డి డిక్లరేషన్ ఏమైందంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ ఇచ్చిన ఆత్మ గౌరవ భవనాలపై కమిటీల పెత్తనం ఏంటని నిలదీశారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో (Kamareddy Declaration) ఈ అంశమే లేదని గుర్తుచేశారు. తడిగుడ్డతో బీసీల గొంతు కోసేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమయ్యాడని విమర్శించారు. రాజకీయ సమావేశాలకు వీల్లేదని జీవో 14 తెచ్చారని, రాజ్యాంగం పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తలా తోక లేని తుగ్లక్ పాలనలో అడ్డమైన జీవోలు తెస్తున్నారని మండిపడ్డారు. జీవో 14ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో రద్దుకోసం మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైట్ చెయ్యాలన్నారు. బీఆర్ఎస్ బీసీ బిడ్డలు ఆయనకు అండగా ఉంటారని చెప్పారు. కమ్యూనిటీ హాళ్లపై ప్రభుత్వ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి దొర పాలన అహంకారంతోనే జీవో 14 తెచ్చారని ధ్వజమెత్తారు. జీవో 14 రద్దు అయ్యేంత వరకు బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. బీసీ హక్కులను కాలరాసే జీవో 14 ప్రతులను ఆయన చించివేశారు.
రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతుల్లోకి రాష్ట్రం: వివేకానంద
అన్ని వర్గాల ప్రజలు ఆత్మ గౌరవంతో బ్రతకాలని కేసీఆర్ బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు ఇచ్చారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద (KP Vivekanand) అన్నారు. ఎవరూ ఊహించని విధంగా అనేక కులాల వారికి ప్రోత్సాహకాలు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దన్నారు. బీసీలకు అవమానకరంగా ఈ ప్రభుత్వం జీవో 14 తెచ్చిందని చెప్పారు. ఆ జీవో రద్దు చేసేవరకు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్నారు. భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ రేవంత్ రెడ్డి వాలి పోతున్నాడని మండిపడ్డారు. పొద్దున లేస్తే భూములపైనే రేవంత్ రెడ్డి కన్ను అని ధ్వజమెత్తారు. బీసీలకు కేటాయిస్తామన్న నిధులు ఎక్కడ అని ప్రశ్నించారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఈ ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. విలువైన బీసీ ఆత్మ గౌరవ భవనాలపై రేవంత్ రెడ్డి కన్ను పడిందని విమర్శించారు. వాటిని అమ్మేయాలనే జీవో 14 తెచ్చారన్నారు. భూములు అమ్ముతూ ఢిల్లీకి మూటలు మోస్తున్నాడని చెప్పారు. రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతుల్లోకి పోయిందన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ గ్రాండ్ ప్లాన్
నవంబర్ 5, 2026

Ponnam Prabhakar | ప్రభుత్వం రూ.88.50 కోట్ల నిధులిచ్చింది.. కార్తీక మాసంలోనే ఆత్మగౌరవ భవనాల పనులు ప్రారంభించండి
నవంబర్ 5, 2026

Revanth Reddy Kodangal Tour | కొడంగల్‌కు రూ.9,100 కోట్ల అభివృద్ధి వరాలు: సీఎం రేవంత్ రెడ్డి 3 రోజుల పర్యటన.. ప్రాజెక్టుల పూర్తి వివరాలివే!
నవంబర్ 5, 2026
తాజావార్తలు
- ●Pending Election Bills | ఇబ్బంది పడుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి
- ●Bigg Boss | హీరోయిన్గా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ - బోల్డ్ రోల్లో
- ●Telangana Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ గ్రాండ్ ప్లాన్
- ●Komatireddy Venkat Reddy | ఎంత కరువొచ్చినా సాగునీరివ్వొచ్చు
- ●Indian Bank | ఇండియన్ బ్యాంక్‌లో 1500 అప్రెంటిస్‌లు.. తెలంగాణలో ఎన్ని ఖాళీలు అంటే?
- ●Yash | ఇన్‌స్టాగ్రామ్‌లో యశ్‌కు కోటిన్నర ఫాలోవర్స్ - అతడు ఫాలో అయ్యిది మాత్రం ఒక్కరినే - ఆ హీరోయిన్ ఎవరంటే?

Pending Election Bills | ఇబ్బంది పడుతున్నాం.. ఎన్నికల పెండింగ్ బిల్లులివ్వండి

Bigg Boss | హీరోయిన్గా బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ - బోల్డ్ రోల్లో

Telangana Global Summit | గ్లోబల్ సమ్మిట్‌కు తెలంగాణ గ్రాండ్ ప్లాన్

Komatireddy Venkat Reddy | ఎంత కరువొచ్చినా సాగునీరివ్వొచ్చు



