త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajpal Yadav | రాజ్‌పాల్‌ యాద‌వ్ ఆస్తి 80 కోట్లు – సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో నిజ‌మెంత‌?

చెక్ బౌన్స్ కేసులో బాలీవుడ్ క‌మెడియ‌న్ రాజ్‌పాల్ యాద‌వ్ ఇటీవ‌ల జైలు పాల‌య్యారు. అత‌డికి సాయం చేసేందుకు స‌ల్మాన్ ఖాన్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌తోపాటు ప‌లువురు బాలీవుడ్ స్టార్స్ ముందుకొచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. రాజ్‌పాల్ యాద‌వ్‌కు 80 కోట్ల ఆస్తి ఉన్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది.

N

Entertainment | Published On Feb 13, 2026, 8.10 pm IST

Rajpal Yadav  | రాజ్‌పాల్‌ యాద‌వ్ ఆస్తి 80 కోట్లు – సోష‌ల్ మీడియా ప్ర‌చారంలో నిజ‌మెంత‌?
Advertisement

Rajpal Yadav |  బాలీవుడ్ టాప్ క‌మెడియ‌న్ రాజ్‌పాల్ యాద‌వ్ ప్ర‌స్తుతం తీహార్ జైలులో శిక్ష‌ను అనుభ‌విస్తున్నారు. 2018 నాటి చెక్‌బౌన్స్ కేసులో అత‌డికి కోర్టు ఆరు నెల‌ల జైలు శిక్ష‌ను విధించింది. తాను హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందించిన అతా ప‌తా ల‌ప‌తా సినిమా కోసం రాజ్‌పాల్ యాద‌వ్ ఓ ఫైనాన్షియ‌ర్ ద‌గ్గ‌ర నుండి ఐదు కోట్ల అప్పు తీసుకున్నారు. డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ రాజ్‌పాల్ యాద‌వ్ భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. అప్పు విష‌యంలో రాజ్‌పాల్ యాద‌వ్ ఇచ్చిన చెక్‌లు బౌన్స్ కావ‌డంతో ఫైనాన్షియ‌ర్ కోర్టును ఆశ్ర‌యించారు. క‌మెడియ‌న్‌కు కోర్టు ఆరు నెల‌ల శిక్ష‌ను విధించింది. ఫైనాన్షియ‌ర్ ద‌గ్గ‌ర తీసుకున్న అప్పు తొమ్మిది కోట్లు కావ‌డంతో దానిని తీర్చేందుకు రాజ్‌పాల్ యాద‌వ్ చేసిన ప్ర‌య‌త్నాలేవి ఫ‌లించ‌లేదు. దాంతో తీహార్ జైలులో లొంగిపోయారు. త‌న‌కు ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని, ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎవ‌రూ స్నేహితులు లేరంటూ జైలుకు వెళ్లేముందు రాజ్‌పాల్ యాద‌వ్ చేసిన కామెంట్లు వైర‌ల్ అయ్యాయి.

స‌ల్మాన్ ఖాన్‌, సోనూ సూద్‌...

రాజ్‌పాల్ యాద‌వ్‌కు సాయం చేసేందుకు స‌ల్మాన్ ఖాన్‌, సోనూసూద్‌, అజ‌య్ దేవ్‌గ‌ణ్‌, వ‌రుణ్ ధావ‌న్‌తో పాటు ప‌లువురు స్టార్స్‌ ముందుకొచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు రాజ్‌పాల్ యాద‌వ్ మొత్తం ఆస్తుల విలువ ఎన‌భై కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వినిపిస్తున్నాయి. అంత ఆస్తి ఉండి తొమ్మిది కోట్లు చెల్లించ‌లేక అత‌డు జైలుకు ఎందుకు వెళ్లాడ‌న్న‌ది ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఆస్తి జ‌ప్తు....

మ‌ధ్య‌ప్ర‌దేశ్ , ఉత్త‌ర ప్ర‌దేశ్‌తో పాటు ముంబాయిలో రాజ్‌పాల్ యాద‌వ్‌కు ఇళ్లులు, పొలాలు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సొంత ఊరు రాటిఖేడాలో ఇళ్లుతో పాటు ఐదెక‌రాల పొలం ఉంద‌ని అంటున్నారు. వీటి విలువ కోటికిపైనే ఉండొచ్చ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని ష‌హ‌జాన్‌పూర్‌లో రాజ్‌పాల్ యాద‌వ్‌కు ఖ‌రీదైన ఇళ్లు ఉండేద‌ట‌. కానీ 11 కోట్ల అప్పు చెల్లించ‌ని కార‌ణంగా బ్యాంకు ఆ ఇంటిని జ‌ప్తు చేసిన‌ట్లు స‌మాచారం.

మూడు కోట్ల రెమ్యూన‌రేష‌న్‌...

ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రాజ్‌పాల్ యాద‌వ్ కోటి నుంచి మూడు కోట్ల మ‌ధ్య రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాల్లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఒక్కో యాడ్ కోసం కోటి, స్టేజ్ షోస్, ఈవెంట్స్ కోసం 15 నుంచి 30 ల‌క్ష‌ల వ‌ర‌కు రాజ్‌పాల్ యాద‌వ్ రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రిస్తున్నాడ‌ని అంటున్నారు. ప్ర‌తి ఏటా సినిమాల ద్వారా రాజ్‌పాల్ యాద‌వ్ ఏడు నుంచి ప‌ది కోట్ల మ‌ధ్య సంపాదిస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. బీఎమ్‌డ‌బ్ల్యూ 5 సిరీస్‌, ఆడీ 8తో పాటు ఖ‌రీదైన ప‌ది వ‌ర‌కు కార్లు ఉన్నాయ‌ట‌.  అత‌డి మొత్తం ఆస్తుల విలువ 80 కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని అంటున్నారు.
రాజ్‌పాల్ యాద‌వ్ ఆస్తుల‌కు సంబంధించి జ‌రుగుతోన్న ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. రాజ్‌పాట్‌కు ఆస్తులు భారీగా ఉన్న‌ది నిజ‌మేన‌ని కొంత మంది చెబుతుండ‌గా...మ‌రికొంద‌రు నెటిజ‌న్లు మాత్రం అవ‌న్నీ పుకార్లు అని అంటున్నారు.

 

Advertisement
Advertisement