Kangana Ranaut | కంగనా రనౌత్ మూవీకి ఓ టికెట్ కొంటే మరోటి ఫ్రీ – బీజేపీ ఎంపీ మూవీని పట్టించుకోని ఆడియెన్స్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన భారత భాత్య విధాత మూవీకి తొలిరోజే ఆడియెన్స్ షాకిచ్చారు. శుక్రవారం రిలీజైన ఈ మూవీ మొదటిరోజు కేవలం కోటి రూపాయల కలెక్షన్స్ మాత్రమే రాబట్టింది. ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి ఓ టికెట్ కొంటె మరో టికెట్ ఫ్రీ అంటూ రెండో రోజే మేకర్స్ ఆఫర్ ప్రకటించారు.
Kangana Ranaut | బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటించిన దేశభక్తి మూవీ భారత భాగ్య విధాతకు తొలిరోజే బాక్సాఫీస్ వద్ద షాక్ తగిలింది. నేషనల్ వైడ్‌గా ఆడియెన్స్ ఈ మూవీని పట్టించుకోలేదు. 26 / 11 ఉగ్రదాడుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు మనోజ్ తపాడియా దర్శకత్వం వహించాడు. భారత బాగ్య విధాతలో హీరోయిన్‌గా నటిస్తూనే ఈ సినిమాను కంగనా రనౌత్ నిర్మించింది. ఉగ్రదాడుల నుంచి ఎంతో మంది ప్రాణాలను కాపాడిన నర్స్ అంజనీ కుల్తే జీవితం ఆధారంగా ఈ హిందీ సినిమా రూపొందింది.
కోటి మాత్రమే...
రిలీజ్‌కు ముందు ఈ బాలీవుడ్ మూవీపై మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. కంగనా కూడా ప్రమోషన్స్ కోసం చాలానే కష్టపడింది. తన కెరీర్‌లోనే బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా భారత భాగ్య విధాత నిలుస్తుందంటూ చెప్పింది. కానీ జూన్ 12న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాను ఆడియెన్స్ పెద్దగా పట్టించుకోలేదు. తొలిరోజు అతి కష్టంగా ఇండియా వైడ్‌గా కోటి రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. శుక్రవారం రోజు ఈ మూవీకి కేవలం 11 పర్సెంట్ మాత్రమే ఆక్యుపెన్సీ నమోదు అయ్యింది.
ఫ్రీ టికెట్స్...
ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పించడానికి రెండో రోజు నుంచే ఇండియా వైడ్‌గా భారత భాగ్య విధాత సినిమాకు ఓ టికెట్ కొంటె మరో టికెట్ ఫ్రీగా ఇవ్వబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఫ్రీ ఆఫర్ పెట్టిన కూడా థియేటర్లు ఖాళీగానే దర్శనమిస్తోన్నాయట.
విమర్శలు...
దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ దేశభక్తి మూవీ కంగనాకు భారీగానే నష్టాలను మిగిల్చే అవకాశం ఉందని అంటున్నారు. కంగనా యాక్టింగ్ బాగున్నా ప్రొడక్షన్ వాల్యూస్ నాసిరకంగా ఉన్నాయని, కాన్సెప్ట్‌లో సరైన ఎమోషన్ లేదంటూ విమర్శలు వస్తున్నాయి.
భారత భాగ్య విధాత సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు. గిరిజా ఓక్, స్మిత తాంబే కీలక పాత్రల్లో కనిపించారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Mouni Roy | నా గర్ల్‌ఫ్రెండ్స్ చాలా బెస్ట్ – లెస్బియన్ రూమర్లపై బాలీవుడ్ హీరోయిన్ ఫన్నీ రియాక్షన్
జూన్ 14, 2026

Rashmika Mandanna | రష్మికను చుట్టుముట్టిన అభిమానులు – రక్షణగా నిలిచిన కృతి సనన్ – వీడియో వైరల్
జూన్ 14, 2026

Fifa World Cup 2026 | ఎవరీ రజిత్ దేవ్? ఫిఫా వరల్డ్ కప్ 2026 అఫీషియల్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించిన ఫస్ట్ ఇండియన్‌గా రికార్డ్!
జూన్ 13, 2026
తాజావార్తలు
- ●Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం
- ●DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్
- ●CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి
- ●Tollywood Heroine | ఎన్టీఆర్ సింహాద్రి హీరోయిన్ - ఇప్పుడు ఎలా ఉందో చూశారా?
- ●Malisetti Dancing Daffodils | ఘట్కేసర్లో ఆకాశహర్మ్యం: 72 అంతస్తులతో హైదరాబాద్‌కే ల్యాండ్‌మార్క్‌గా 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్'!

Pub Fire Accident | పబ్‌లో ఘోర అగ్ని ప్రమాదం: ఇద్దరు సజీవదహనం

DRDO Missile Test 2026 | భారత అమ్ములపొదిలో మరో బ్రహ్మాస్త్రం: LRLACM క్షిపణి ప్రయోగం సూపర్ సక్సెస్

CM Revanth Reddy | ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికతో ప్రజలకు మరింత చేరువగా ప్రభుత్వం : సీఎం రేవంత్‌రెడ్డి

Dasoju Sravan | రేవంత్ ఎల్ అండ్ టీ కంపెనీకి అల్లుడా? రూ.15 వేల కోట్లకే ఆస్తులు దక్కించుకోడానికి



