త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sanchita Ugale | ఆత్మ‌హ‌త్య చేసుకున్న తొమ్మిది రోజుల త‌ర్వాత బాలీవుడ్ న‌టి అంత్య‌క్రియ‌లు

ఆత్మ‌హ‌త్య చేసుకున్న తొమ్మిది రోజుల త‌ర్వాత బాలీవుడ్ న‌టి సంచితా ఉగాలే అంత్య‌క్రియ‌లు జ‌రిగాయి. అహ‌ల్య‌న‌గ‌ర్ జిల్లాలో అకోలాకు స‌మీపంలోని సొంత ఊరిలో సంచిత అంతిమ సంస్కారాల‌ను కుటుంబ‌స‌భ్యులు పూర్తిచేసిన‌ట్లు స‌మాచారం.

N

Entertainment | Published On Jun 26, 2026, 4.56 pm IST

Sanchita Ugale | ఆత్మ‌హ‌త్య చేసుకున్న తొమ్మిది రోజుల త‌ర్వాత బాలీవుడ్ న‌టి అంత్య‌క్రియ‌లు
Advertisement

Sanchita Ugale |  సీరియ‌ల్ న‌టి సంచితా ఉగాలే సూసైడ్‌ ఘ‌ట‌న బాలీవుడ్ వ‌ర్గాల్లో మిస్ట‌రీగా మారింది. జూన్ 14న ముంబై న‌ల‌సోపారాలోని త‌న నివాసంలో ఉరివేసుకొని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది సంచితా ఉగాలే. సాజ‌న్ ఘ‌ర్ సీరియ‌ల్‌లో సంచితతో క‌లిసి న‌టించిన ఉజ్వ‌ల్ శ‌ర్మ వేధింపుల వ‌ల్లే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తోన్నాయి. కాగా సంచితా ఉగాలే చ‌నిపోయిన తొమ్మిది రోజుల త‌ర్వాత ఆమె ఆంత్య‌క్రియ‌ల‌ను కుటుంబ‌స‌భ్యులు నిర్వ‌హించారు. అహ‌ల్య‌న‌గ‌ర్ జిల్లాలోని అకోలాకు స‌మీపంలో ఉన్న డోంగ‌ర్‌గావ్‌కు ఈ బాలీవుడ్ న‌టి భౌతిక కాయాన్ని త‌ర‌లించిన కుటుంబ‌స‌భ్యులు సొంత ఊరిలో ఆమె అంతిమ సంస్కారాల‌తో పాటు ద‌శ‌క‌ర్మ‌ల‌ను పూర్తిచేశార‌ట‌. సంచితా మ‌ర‌ణంపై కుటుంబ‌స‌భ్యులు అనుమానాలు వ్య‌క్తం చేయ‌డంతోనే అంత్య‌క్రియ‌లు ఆల‌స్య‌మైన‌ట్లు స‌మాచారం.

అప్పు తీసుకొని....

సంచితా ఉగాలే మ‌ర‌ణంపై ప్ర‌స్తుతం పోలీసులు ఇన్వేస్టిగేష‌న్ జ‌రుగుతోంది. ఉజ్వ‌ల్ శ‌ర్మ‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు స‌మాచారం. సాజ‌న్ ఘ‌ర్ సీరియ‌ల్‌లో న‌టిస్తోన్న స‌మ‌యంలోనే సంచిత నుంచి ఉజ్వ‌ల్ పెద్ద మొత్తంలో డ‌బ్బుల‌ను అప్పుగా తీసుకున్నాడ‌ట‌. ఆ అప్పును తిరిగి అడ‌గ‌టంతో బెదిరింపుల‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా షూటింగ్ సెట్స్‌లో సంచిత‌ను చాలా సార్లు అవ‌మానించాడంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. వాటికి తోడు గ‌త కొద్ది రోజులుగా మాన‌సిక ఒత్తిడితో సంచిత బాధ‌ప‌డుతోన్న‌ట్లు తోటిన‌టులు చెప్పారు. వీటివ‌ల్లే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు చెబుతోన్నారు.

ఛావా మూవీలో...

హిందీలో కుంకుమ్ భాగ్య‌, వాగ్తే కీ దునియా, దిల్‌వాలీ దుల్మా లే జాయేగీ, సాజ‌న్ ఘ‌ర్‌తో పాటు ప‌లు టీవీ సీరియ‌ల్స్ చేసింది. విక్కీ కౌశ‌ల్‌, ర‌ష్మిక మంద‌న్న హీరోహీరోయిన్లుగా న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ ఛావాలో ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించింది.

 

Advertisement
Advertisement