Cyber Fraud | సైబర్ వలలో చిక్కిన సినీనటి అనిత.. ఎన్ని లక్షలు పోగొట్టుకున్నారంటే !
Cyber Fraud | సీనియర్ సినీ నటి గోగినేని అనిత (Actress Anitha) సైబర్ (Cyber Fraud) నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.14 లక్షలు పోగొట్టుకుంది.
Cyber Fraud | సీనియర్ సినీ నటి గోగినేని అనిత (Actress Anitha) సైబర్ (Cyber Fraud) నేరగాళ్ల వలలో చిక్కుకుని రూ.4.14 లక్షలు పోగొట్టుకుంది. మాదాపూర్ (Madapur)లోని కావూరి హిల్స్‌లో నివాసం ఉండే అనిత అమెరికాలోని వాషింగ్టన్‌లో ఉండే తన కుమారుడి జన్మదిన వేడుకలకు హాజరు కావాలని భావించింది. దీనికోసం ఆమె ఆన్‌లైన్‌లో ట్రావెల్ ఏజెంట్ కోసం ఇంటర్నెట్‌లో వెతికింది. ఈ క్రమంలో లో ఫ్లై టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థకు సంబంధించిన ఏజెంట్ రాజేశ్ ఫోన్ నెంబర్ తీసుకుని అతడిని ఫోన్‌లో సంప్రదించింది.
బిజినెస్ క్లాస్ టికెట్ ధర రూ.4,14,180 అని చెప్పిన అతడు టికెట్ బుక్ చేయాలంటే డెబిట్ కార్డు వివరాలు చెప్పాలని కోరాడు. తన డెబిట్ కార్డు వివరాలు అతడికి అందజేసింది. తన టికెట్ బుకింగ్ కోసమేనని నమ్మిన బాధితురాలు ఓటీపీ సైతం అతడికి చెప్పింది. దీంతో అకౌంట్ నుంచి రూ.4.14 లక్షలు క్లియర్ ట్రిప్ పేరుతో కట్ అయ్యాయి. కానీ, ఆ తరువాత టికెట్ల బుకింగ్‌కు సంబంధించి ఎలాంటి మెసేజ్ రాకపోవడంతో అప్రమత్తమైన అనిత వెంటనే బ్యాంకు కస్టమర్ కేర్‌ను సంప్రదించి, ఫిర్యాదు చేశారు. దాంతో పాటు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
నవంబర్ 21, 2026

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
నవంబర్ 21, 2026

MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు
- ●Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక
- ●Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్
- ●Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్
- ●IRCTC Tour | చలికాలంలో రూ.14 వేలకే ఊటీ టూర్.. హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ
- ●MLA Sudarshan Reddy | వచ్చే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Damodar Raja Narasimha | ఐవీఎఫ్ ద్వారా ట్రిప్లెట్స్ జననం.. గాంధీ వైద్యులకు మంత్రి దామోదర అభినందనలు

Rashmika Mandanna | గర్ల్‌ఫ్రెండ్ కాంబో రిపీట్ - దర్శకుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న రష్మిక

Ponnam Prabhakar | వేగంగా తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ: పొన్నం ప్రభాకర్

Kavya Maran | సన్ గ్రూప్ ఉద్యోగులకు గోల్డ్ రింగ్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన కావ్య మారన్



