Bigg Boss 10 Telugu | ఆటలో సవాల్ కాదు … ఆటే సవాల్ …బిగ్‌బాస్ సీజన్ 10 వచ్చేస్తోంది ..లాంఛింగ్ ఎప్పుడంటే?
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. నెక్స్ట్ సీజన్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను నాగార్జున అభిమానులతో పంచుకున్నారు. ఆటలో సవాల్ కాదు...ఆటే సవాల్ అంటూ నాగార్జున షేర్ చేసిన ఈ వీడియో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jun 7, 2026, 11.53 am IST
Bigg Boss 10 Telugu | తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షోస్‌లో ఒకటిగా బిగ్‌బాస్ కొనసాగుతోంది. బిగ్‌బాస్‌లో ఇప్పటివరకు తొమ్మిది సీజన్లు వచ్చాయి. తాజాగా పదో సీజన్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. మరోసారి ఈ షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఆటలో సవాల్ కాదు.... ఆటే సవాల్ అంటూ ఈ పదో సీజన్‌కు సంబంధించిన స్పెషల్ వీడియోను నాగార్జున ఆదివారం అభిమానులతో పంచుకున్నారు. బిగ్‌బాస్ ఎన్నో యుద్దాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు...ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం...ఆ మహా సామ్రాజ్యం గురించి రూల్ చేసే నేను కాదు లవ్ చేసే ఫ్యాన్స్ చెబుతారు అంటూ ఈ వీడియోలో నాగార్జున చెప్పడం ఆసక్తిని పంచింది. బిగ్‌బాస్‌పై వచ్చిన పాట అభిమానులను ఆకట్టుకుంటోంది. బిగ్‌బాస్ ప్రస్థానంలో కొత్త ఛాప్టర్ మొదలుకాబోతుంది...బిగ్‌బాస్ దశావతారం అంటూ సీజన్ 10ను ప్రకటించారు నాగార్జున.
జూలైలో...
బిగ్‌బాస్ రియాలిటీ షోను సెప్టెంబర్‌లో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ సారి మూడు నెలలు ముందుగానే బిగ్‌బాస్ సందడి మొదలుకాబోతుంది. జూలై బిగ్‌బాస్ సీజన్ 10 లాంఛ్ కాబోతుంది. జూలై 18న ప్రారంభమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. బిగ్‌బాస్ తెలుగు తొలి మూడు సీజన్లు జూలైలోనే లాంఛ్ అయ్యాయి. మళ్లీ పదో సీజన్‌తో జూలై ట్రెండ్‌ను కంటిన్యూ చేయబోతున్నట్లు సమాచారం.
కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలిబ్రిటీలు...
ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు తుది దశకు చేరుకుందట. ఈ సారి కూడా కామన్ మ్యాన్స్‌తో పాటు కొందరు సినిమా, సోషల్ మీడియా సెలిబ్రిటీలు కంటెస్టెంట్స్‌గా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం.బిగ్‌బాస్ సీజన్ 9లో కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచారు.
సంబంధిత వార్తలు

Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల – రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
ఆగస్టు 20, 2026

Shrasti Verma | బీజేపీలో చేరిన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ
ఆగస్టు 17, 2026

Bigg Boss | బిగ్‌బాస్‌తో సంపాదించింది ఏం లేదు – ప్రైజ్‌మనీ మొత్తం కట్ చేశారు – పల్లవి ప్రశాంత్ కామెంట్స్
ఆగస్టు 17, 2026
తాజావార్తలు
- ●Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
- ●Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్
- ●Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..
- ●BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్
- ●Talasani Srinivas Yadav | ముఖ్యమంత్రి నోటి దురద తగ్గించుకో : మాజీమంత్రి తలసాని
- ●Mahesh Goud | పార్టీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా క్రమశిక్షణ చర్యలు తప్పవు: పీసీసీ చీఫ్

Sushmita Konidela | ప్రకాష్‌రాజ్‌తో చిరంజీవి కూతురు తెలుగువెబ్సిరీస్ - సుకుమార్ శిష్యుడు డైరెక్టర్ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Bihar Government | ఆ వీడియోలు తీస్తే రూ.లక్ష ప్రైజ్‌మనీ.. ఇన్‌ఫ్ల్యూయెన్సర్లకు బీహార్ ప్రభుత్వం బంపర్ ఆఫర్

Meta | మెటా పాలసీలపై ఓవర్‌సైట్ బోర్డు కీలక సూచనలు.. కొత్త మార్గదర్శకాలు జారీ..

BRSV | పాలిటెక్నిక్ కోర్సులను రద్దు చేసేందుకు ప్రభుత్వం కుట్ర : గెల్లు శ్రీనివాస్ యాదవ్



