Bigg Boss Shanmukh | ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ – ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్
లీలా వినోదం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్ జస్వంత్. డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ప్రస్తుతం ప్రేమకు నమస్కారం పేరుతో ఓ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Jan 2, 2026, 2.37 pm IST
Bigg Boss Shanmukh | బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ షణ్ముఖ్ జస్వంత్ తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం అతడు పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూట్యూబర్‌గా షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ మొదలైంది. చిన్న చిన్న వీడియోలు, రీల్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఈ వీడియోల ద్వారా వచ్చిన గుర్తింపుతో కొన్ని వెబ్‌సిరీస్‌లలో నటించాడు. ది సాఫ్ట్‌వేర్ డెవలపర్, వైవా, ది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ లాంటి యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
వెబ్‌సిరీస్‌లతో పాటు కొన్ని ఇండిపెండెంట్ వీడియో సాంగ్స్ కూడా చేశాడు షణ్ముఖ్. ఈ వీడియో సాంగ్స్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ దీప్తి సునయన కలిసి నటించాడు. ఆ టైమ్‌లోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తాము రిలేషన్‌లో ఉన్నట్లు షణ్ముఖ్‌తో పాటు దీప్తి ప్రకటించింది. మనస్ఫర్థల కారణంగా కొద్ది రోజులకే వీరి ప్రేమాయణానికి పుల్‌స్టాప్ పడింది.
బిగ్‌బాస్‌లో...
యూట్యూబ్ ద్వారా వచ్చిన నేమ్, ఫేమ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చాడు షణ్ముఖ్. ఈ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఒకానొక టైమ్‌లో షణ్ముఖ్ విన్నర్ అంటూ ప్రచారం జరిగింది. కానీ రన్నరప్‌తోనే సరిపెట్టుకున్నాడు. బిగ్‌బాస్ సీజన్ 5లో షణ్ముఖ్, సిరి హనుమంతు మధ్య లవ్‌స్టోరీ నడిచినట్లు జోరుగా ప్రచారం జరిగింది. బిగ్‌బాస్ హౌజ్‌లో వీరిద్దరు చాలా క్లోజ్‌గా మూవ్ కావడంతో ఫ్యాన్స్ కూడా వీరి ప్రేమాయణం నిజమేనని అనుకున్నారు. బిగ్‌బాస్ కోసమే నడిపించిన ప్రేమకథగా సిరి, షణ్ముఖ్ తేల్చేశారు.
గాడ్స్ ప్లాన్...
దీప్తి సునయనకు బ్రేకప్ చెప్పిన తర్వాత చాలా రోజులుగా సింగిల్‌గా ఉన్న షణ్ముఖ్ జస్వంత్ మళ్లీ ప్రేమలో పడ్డాడు. తన ప్రియురాలిని అభిమానులకు పరిచయం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఓ ఫొటోను గురువారం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఆమె ముఖం కనిపించకుండా కొన్ని ఫొటోలను పోస్ట్ చేశాడు.ప్రియురాలి పేరు కూడా పూర్తిగా చెప్పకుండా వి అని మాత్రమే పేర్కొన్నాడు. గాడ్స్ ప్లాన్ అంటూ తెలిపాడు. షణ్ముఖ్ జస్వంత్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు. పెళ్లి ఎప్పుడూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
సంబంధిత వార్తలు

Bigg Boss Shanmukh | ప్రియురాలితో ఏడడుగులు వేసిన తెలుగు బిగ్‌బాస్ రన్నరప్ – పెళ్లి ఫొటోలు వైరల్
జూన్ 22, 2026

WhatsApp Plus Price | వాట్సప్, ఇన్‌స్టా, ఫేస్బుక్ ఇక ఫ్రీ కాదు.. జుకర్‌బర్గ్ మాస్టర్ ప్లాన్ ఇదే!
జూన్ 17, 2026

Social Media | సోషల్ మీడియా కంటెంట్‌తో 12 ఏళ్ల బాలిక కథ విషాదాంతం.. మెటా, టిక్‌టాక్‌పై కుటుంబాల న్యాయ పోరాటం..
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి
- ●India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం
- ●Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..
- ●Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?
- ●Train Ticket | రైళ్లలో ఇక టిక్కెట్ లేకుండా ప్రయాణిస్తే రెట్టింపు జరిమానా.. జూలై 1 నుంచి కొత్త రూల్స్..
- ●Uttar Pradesh | పోర్న్ వీడియోలు చూసి.. 9 నెలల పసికందుపై అత్యాచారం

Ukrainian Drones | రష్యాపై మరోసారి డ్రోన్ల దాడి

India-America Defense | భారత్‌కు రక్షణ సహకారం.. రూ.4,500 కోట్ల సైనిక ప్యాకేజీకి అమెరికా ఆమోదం

Ai Plus Nova | ఏఐ ప్లస్ నోవా 2 నియో, నోవా 2 ప్రో 5జీ ఫోన్లు లాంచ్.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ..

Ramchandar Rao | బీజేపీలోకి మెగాస్టార్ చిరంజీవి?



