త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Rohini | ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన బిగ్‌బాస్ రోహిణి – ట్విస్ట్ మామూలుగా లేదుగా…

బిగ్‌బాస్ రోహిణి త‌న ప్రియుడిని ప‌రిచ‌యం చేసింది. ఫైన‌ల్లీ త‌న‌కు కాబోయే వాడిని క‌లుసుకున్నానంటూ పోస్ట్ పెట్టింది. రోహిణి పోస్ట్ వైర‌ల్ అవుతోంది.

N

Entertainment | Published On Jan 11, 2026, 2.50 pm IST

Bigg Boss Rohini | ప్రియుడిని ప‌రిచ‌యం చేసిన బిగ్‌బాస్ రోహిణి – ట్విస్ట్ మామూలుగా లేదుగా…
Advertisement

Bigg Boss Rohini | జ‌బ‌ర్ధ‌స్థ్‌తో కెరీర్‌ను మొద‌లుపెట్టింటి రోహిణి. బిగ్‌బాస్ ద్వారా పాపుల‌ర్ అయ్యింది . బిగ్‌బాస్ సీజ‌న్ 8లోకి వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చిన రోహిణి ఒకానొక ద‌శ‌లో విన్న‌ర్ అవుతుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. త‌న కామెడీ టైమింగ్‌, ఆట‌తీరుతో ఆక‌ట్టుకున్న రోహిణి వంద రోజుల వ‌ర‌కు హౌజ్‌లో కొన‌సాగింది. ఫైన‌ల్ ముగింట ఎలిమినేట్ అయ్యి డిస‌పాయింట్ చేసింది. బిగ్‌బాస్‌తో వ‌చ్చిన పాపులారిటీతో ప్ర‌స్తుతం సినిమాల‌తో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌ల‌లో న‌టిస్తోంది.

ప్రియుడితో ఫొటో...

తాజాగా రోహిణి త‌న ప్రియుడిని అభిమానుల‌కు ప‌రిచ‌యం చేసింది రోహిణి. హ్యాండ్‌స‌మ్ యువ‌కుడితో క‌లిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌చేసింది. ఫైన‌ల్లీ నా వాడిని క‌లుసుకున్నాను అంటూ అంటూ పోస్ట్ పెట్ట‌డంతో అంతా నిజ‌మే అనుకున్నారు. రోహిణి షేర్ చేసిన ఫొటోలో ఉన్న‌ది ఆమె బాయ్‌ఫ్రెండ్ అనుకున్నారు. కానీ థాంక్యూ చాట్‌జీపీటీ నాకు మంచి హ్యాండ్‌స‌మ్ కుర్రాడిని ఇచ్చావు అంటూ ఫొటోను ఉద్దేశించి పేర్కొని ట్విస్ట్ ఇచ్చింది. త‌న‌కు కాబోయే భ‌ర్త‌లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో ఉండాలో చెబుతూ చాట్ జీపీటీలో ఓ యువ‌కుడి ఫోటో క్రియేట్ చేసింది రోహిణి. అత‌డితో క‌లిసి దిగిన ఫొటోనే అభిమానుల‌కు పంచుకొని షాకిచ్చింది. అంతా ఉట్టిదే అని చెప్పింది.

నిజ‌మే అనుకున్నాం...

అక్క.... ఒక్క క్ష‌ణం నిజ‌మే అనుకున్నాను అంటూ రోహిణి పోస్ట్‌ను ఉద్దేశించి అరియానా కామెంట్ పెట్టింది. అలాంటి ఒక హ్యాండ్‌స‌మ్ హ‌జ్బెండ్ ప్రాప్తిర‌స్తు అంటూ సింగ‌ర్ స‌మీరా భ‌ర‌ద్వాజ్ పేర్కొన్న‌ది. సురేఖ‌వాణితో పాటు మ‌రికొంద‌రు యాక్ట‌ర్లు కూడా రోహిణి ఫొటోపై రియాక్ట్ అయ్యారు. ఫ్యాన్స్ కూడా బావ బాగున్నాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగులో హ‌నుమాన్‌, మ‌త్తువ‌ద‌లా, శ్రీనివాస క‌ళ్యాణం, బంగార్రాజుతో పాటు ప‌లు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించింది. సేవ్ ది టైగ‌ర్స్ వెబ్‌సిరీస్‌లో ఫుల్ లెంగ్త్ రోల్ చేసింది. ప్ర‌స్తుతం ప‌లు సినిమాలు, టీవీ షోస్‌తో బిజీగా ఉంది.

Advertisement

తాజావార్తలు

Advertisement