త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Comedy OTT | స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌

బిగ్‌బాస్ ఫేమ్ మ‌హేష్ విట్టా హీరోగా న‌టించిన క్రైమ్ కామెడీ మూవీ ఉత్తుత్త హీరోలు ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందిన ఈ సినిమాకు మ‌హేష్ విట్టా ప్రొడ్యూస‌ర్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడు.

N

Entertainment | Published On May 21, 2026, 3.42 pm IST

Comedy OTT | స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన తెలుగు క్రైమ్ కామెడీ మూవీ – హీరోగా బిగ్‌బాస్ కంటెస్టెంట్‌
Advertisement

Comedy OTT |  టాలీవుడ్ క‌మెడియ‌న్‌, బిగ్‌బాస్ ఫేమ్ మ‌హేష్ విట్టా హీరోగా న‌టించిన ఉత్తుత్త హీరోలు సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ కామెడీగా తెర‌కెక్కిన ఈ సినిమాలో హీరోగా న‌టిస్తూనే నిర్మాత‌గా కూడా మ‌హేష్ విట్టా వ్య‌వ‌హ‌రించారు. త‌ను కొణిదెల హీరోయిన్‌గా న‌టించింది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో రిలీజైన ఉత్తుత్త హీరోలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి.

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో...

రాయ‌ల‌సీమ బ్యాక్‌డ్రాప్‌లో ద‌ర్శ‌కుడు హ‌ర్ష కొడాలి ఉత్తుత హీరోల‌ను తెర‌కెక్కించారు. ఈ సినిమా ద్వారా ప‌లువురు కొత్త న‌టీన‌టులు తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మ‌య్యారు. జాన్ కే జోసెఫ్ మ్యూజిక్ అందించాడు.
ప్రొద్దుటూరుకు చెందిన చందుకు చిన్న‌ప్ప‌టి నుంచి సినిమాలంటే పిచ్చి. ఎప్ప‌టికైనా హీరోగా మారాల‌ని క‌ల‌లుకంటాడు. కానీ ఎవ‌రూ అవ‌కాశాలు ఇవ్వ‌క‌పోవ‌డంతో త‌న స్నేహితుల‌తో క‌లిసి తానే సొంతంగా ఓ సినిమాను నిర్మించాల‌ని అనుకుంటాడు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా వారి సినిమా మ‌ధ్య‌లోనే ఆగిపోతుంది. డ‌బ్బు కోసం ఓ కిడ్నాప్ చేయాల‌ని అనుకుంటారు. కానీ వారి ప్లాన్ ఫెయిల‌వ్వ‌డ‌మే కాకుండా రామిరెడ్డి అనే ఫ్యాక్ష‌న్ లీడ‌ర్‌కు చందు అండ్ గ్యాంగ్ టార్గెట్‌గా మారుతారు? ఫ్యాక్ష‌నిస్ట్‌ల బారి నుంచి త‌మ ప్రాణాలు కాపాడుకోవ‌డానికి చందు, అత‌డి స్నేహితులు ఏం చేశారు? తమ సినిమాను పూర్తిచేశారా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

బిగ్‌బాస్‌లో రెండుసార్లు...

నిను వీడ‌ని నీడ‌ను నేనే, కృష్ణార్జున యుద్దం, జాంబీ రెడ్డి, బింబి సార, మా నాన్న సూప‌ర్ హీరోతో పాటు ప‌లు తెలుగు సినిమాల్లో క‌మెడియ‌న్‌గా క‌నిపించాడు మ‌హేష్ విట్టా. తెలుగు బిగ్‌బాస్ షోలో రెండు సార్లు కంటెస్టెంట్‌గా పాల్గొన్నాడు. బిగ్‌బాస్ సీజ‌న్ 3లో ఎనిమిదో ప్లేస్‌లో నిలిచాడు. ఆ త‌ర్వాత బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన టైటిల్ మాత్రం గెల‌వ‌లేక‌పోయాడు.

 

Advertisement
Advertisement