త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telugu OTT | స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ

రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ హీరోగా న‌టించిన సైక‌లాజిక్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ్లైట్ మ‌హా స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాకు ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

N

Entertainment | Published On Oct 22, 2026, 7.57 pm IST

Telugu OTT | స‌డెన్‌గా ఓటీటీలోకి వ‌చ్చిన రాజు వెడ్స్ రాంబాయి హీరో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ
Advertisement

Telugu OTT | రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ ఉద్దేమారి హీరోగా న‌టించిన తెలుగు సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఫ్లైట్ మ‌హా సైలెంట్‌గా ఓటీటీలోకి వ‌చ్చింది. గురువారం నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. సునీల్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ మూవీకి ఆర్‌జీవీ మ‌ర్డ‌ర్ మూవీ ఫేమ్ ఆనంద్ చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు.

స్లీప్ వాకింగ్‌...

స్లీప్ వాకింగ్ అనే కాన్సెప్ట్‌తో ద‌ర్శ‌కుడు ఆనంద్ చంద్ర ఈ మూవీని రూపొందించారు. మహా (అఖిల్ ఉద్దేమారి) ఒక స్కెచ్ ఆర్టిస్ట్. చిన్న‌త‌నం నుంచి నిద్ర‌లో న‌డిచే అల‌వాటుతో ఇబ్బందులు ప‌డుతుంటాడు. దానికి తోడు క‌ల‌లో వాసుదేవ్ అత‌డిని చాలా ఏళ్లుగా వెంటాడుతూనే ఉంటాడు. అస‌లు వాసుదేవ్ ఎవ‌రు? స్లీప్ వాకింగ్ స‌మ‌స్య కార‌ణంగా మ‌హా ఎలాంటి ఇబ్బందులు ప‌డ్డాడు? అత‌డి లైఫ్‌లోకి వ‌చ్చిన అమీనా, డాక్ట‌ర్ గుప్తా ఎవ‌ర‌న్న‌దే ఈ మూవీ క‌థ‌.

క్రేజీ క‌ళ్యాణం...

గంట యాభై తొమ్మిది నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ మూవీ రిలీజైంది. వ‌సంత్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు. స‌రైన ప్ర‌మోష‌న్స్ లేక‌పోవ‌డంతో ఈ సినిమా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోలేక‌పోయింది. రాజు వెడ్స్ రాంబాయి కంటే ముందు అఖిల్ అంగీక‌రించిన సినిమా ఇది. రాజు వెడ్స్ రాంబాయి హిట్‌తో అఖిల్‌కు హీరోగా ఆఫ‌ర్లు బాగానే వ‌స్తున్నాయి. ఇటీవ‌లే క్రేజీ క‌ళ్యాణంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

 

Advertisement
Advertisement