త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg Boss Ayesha | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్‌

బిగ్‌బాస్ బ్యూటీ అయేషా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. సుడిగాలి సుధీర్‌తో సినిమా చేయ‌బోతుంది. సుధీర్ హీరోగా సుధీర్ జోక‌ర్ పేరుతో కొత్త మూవీని సోమ‌వారం అనౌన్స్ చేశారు. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు.

N

Entertainment | Published On May 18, 2026, 7.03 pm IST

Bigg Boss Ayesha | హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న బిగ్‌బాస్ బ్యూటీ – సుడిగాలి సుధీర్‌తో రొమాన్స్‌
Advertisement

Bigg Boss Ayesha | జ‌బ‌ర్ధ‌స్థ్ కామెడీ షోతో కెరీర్‌ను మొద‌లుపెట్టి ఆపై యాంక‌ర్‌గా మారాడు సుడిగాలి సుధీర్‌. తెలుగులో ప‌లు పాపుల‌ర్ షోస్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించాడు. జ‌బ‌ర్ధ‌స్థ్‌తో పాటు టీవీ ఫోస్‌తో వ‌చ్చిన‌ క్రేజ్ ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్‌, గాలోడు, కాలింగ్ స‌హ‌స్ర‌తో పాటు మ‌రికొన్ని సినిమాల‌తో క‌థానాయ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు. కాలింగ్ స‌హ‌స్ర త‌ర్వాత సినిమాల‌కు కొంత గ్యాప్ ఇచ్చిన సుధీర్ మ‌ళ్లీ స్పీడు పెంచాడు. కొత్త మూవీని సోమ‌వారం అనౌన్స్ చేశాడు. క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సుధీర్ జోక‌ర్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇందులో సుడిగాలి సుధీర్‌కు జోడీగా బిగ్‌బాస్ ఫేమ్ ఆయేషా న‌టిస్తోంది. ఈ మూవీతోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వ‌బోతుంది.

త‌మిళ న‌టి...

సోమ‌వారం సుధీర్ జోక‌ర్ మూవీ ఫ‌స్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో చేతిలో ప్లేయింగ్ కార్డ్స్‌తో సుధీర్ క‌నిపిస్తున్నాడు. అత‌డితో పాటు మ్యాడ్ విష్ణు, అజ‌య్ ఘోష్‌, ముర‌ళీ శ‌ర్మ తో పాటు అయేషా క‌నిపిస్తోంది. పీఎస్ సునీల్ పుప్పాల దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో త‌మిళ న‌టి అభిరామి కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తామ‌ని మేక‌ర్స్ పేర్కొన్నారు.

హైలెస్సో...

హైలెస్సో పేరుతో మ‌రో మూవీ కూడా చేస్తోన్నాడు సుధీర్‌. మైథ‌లాజిక‌ల్ క‌న్సెప్ట్‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోన్న‌ట్లు స‌మాచారం. ఆహా ఓటీటీలో టెలికాస్ట్ అవుతోన్న కామెడీ గేమ్ షో స‌ర్కార్‌కు హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

సీరియ‌ల్స్‌తో...

తెలుగులో సావిత్ర‌మ్మ గారి అబ్బాయి, ఊర్వ‌శివో రాక్ష‌సివో సీరియ‌ల్స్‌లో లీడ్ రోల్స్ చేసింది ఆయేషా. బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్న‌ది. వైల్డ్ కార్డ్‌తో ఈ షోలోకి ఎంట్రీ ఇచ్చింది.

 

Advertisement
Advertisement