OTT | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ – స్ట్రీమింగ్ డేట్, ప్లాట్‌ఫామ్ ఫిక్స్
బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి హీరోగా నటించిన తెలుగు మూవీ సుమతీ శతకం ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. మార్చి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. శైలీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీకి ఎమ్ఎమ్‌నాయుడు దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Mar 17, 2026, 2.53 pm IST
OTT | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 7తో ఫేమస్ అయ్యాడు అమర్‌దీప్ చౌదరి. ఈ సీజన్‌లో ఫైనల్ చేరుకున్న అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. బిగ్‌బాస్ నుంచి వచ్చిన ఫేమ్‌తో ఇటీవలే హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు. సుమతీ శతకం అనే సినిమా చేశాడు. శౌలీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు ఎమ్ఎమ్‌నాయుడు దర్శకత్వం వహించాడు. ఫిబ్రవరి ఫస్ట్‌వీక్‌లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అమర్‌దీప్ క్రేజ్ కారణంగా ఓ మోస్తారు ఓపెనింగ్స్‌ను దక్కించుకున్నది. కమర్షియల్ హిట్‌గా మాత్రం నిలవలేకపోయింది.
ఈటీవీ విన్ ఓటీటీలో...
తాజాగా సుమతీ శతకం మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ మంగళవారం కన్ఫామ్ అయ్యాయి. మార్చి 19 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.
సుమతీ శతకం మూవీలో బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ టేస్టీ తేజ, మహేష్ విట్టా కీలక పాత్రల్లో కనిపించారు. విలేజ్ లవ్‌స్టోరీగా దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించారు. సుభాష్ ఆనంద్ మ్యూజిక్ అందించారు.
కృష్ణ పెళ్లి కల
వైకుంఠపురానికి చెందిన కృష్ణ (అమర్‌దీప్ చౌదరి) కిరాణాషాప్ నడుపుతుంటాడు. తన పెళ్లిని ఊరి గుడిలో గొప్పగా జరుపుకోవాలని కలలు కంటుంటాడు. సుమతీ (శైలీ చౌదరి)అనే అంగన్వాడీ టీచర్‌తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు కృష్ణ. ఆమెకు తన మనసులోని మాటను చెప్పాలని చూస్తాడు. కానీ సుమతీకి అమ్మవారు ఆవహిస్తుంది. దాంతో ఊరి జనాలు ఆమెను దేవతగా భావిస్తుంటారు. ఆ సమస్య కృష్ణ, సుమతీ పెళ్లికి ఎలా అడ్డంకిగా మారింది? ఊరి గుడి విషయంలో జరిగిన ఓ గొడవ కారణంగా కృష్ణ జీవితం ఎలా చిక్కుల్లో పడింది అన్నదే ఈ మూవీ కథ.
బిగ్‌బాస్ కంటే ముందు తెలుగులో పలు సీరియల్స్‌లో లీడ్ యాక్టర్‌గా కనిపించాడు అమర్‌దీప్ చౌదరి. జానకి కలగనలేదు, సిరి సిరి మువ్వలుతో పాటు మరికొన్ని సీరియల్స్ నటుడిగా అతడికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం హీరోగా మూడు సినిమాలు చేస్తున్నాడు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Samantha | అందుకే రిస్క్ తీసుకున్నా – ప్రొడ్యూసర్‌గా మారడంపై సమంత కామెంట్స్
మే 19, 2026

Ram Charan | బుచ్చిబాబు ఇచ్చిన గిఫ్ట్ – చేతి గాయంపై రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
మే 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



