త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bigg boss Finale Trp Rating | టీఆర్‌పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్ సీజ‌న్ 9 గ్రాండ్ ఫినాలే – గ‌త సీజ‌న్ కంటే ఎక్కువే కానీ…

బిగ్‌బాస్ సీజ‌న్ 9 గ్రాండ్ ఫినాలే టీఆర్‌పీ రేటింగ్‌లో కుమ్మేసింది. 13.06 టీఆర్‌పీని సొంతం చేసుకుంది. అర్బ‌న్ ఏరియాలో ఈ ఫైన‌ల్ ఎపిసోడ్‌కు 16.14 రేటింగ్ వ‌చ్చింది.

N

Entertainment | Published On Jan 2, 2026, 4.39 pm IST

Bigg boss Finale Trp Rating | టీఆర్‌పీలో దుమ్మురేపిన బిగ్‌బాస్ సీజ‌న్ 9 గ్రాండ్ ఫినాలే – గ‌త సీజ‌న్ కంటే ఎక్కువే కానీ…
Advertisement

Bigg boss Finale Trp Rating |  బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 9 ఇటీవ‌లే ముగిసింది. 105 రోజుల పాటు ర‌స‌వ‌త్త‌రంగా సాగిన ఈ రియాలిటీ షోలో కామ‌న్ మ్యాన్ క‌ళ్యాణ్ ప‌డాల విన్న‌ర్‌గా నిలిచాడు. త‌నూజ ర‌న్న‌ర‌ప్‌తో స‌రిపెట్టుకుంది. విన్న‌ర్‌గా నిలిచిన క‌ళ్యాణ్‌కు 35 ల‌క్ష‌ల ప్రైజ్‌మ‌నీతో పాటు ఓ కారు ద‌క్కాయి. ఇమాన్యుయేల్ థ‌ర్డ్ ర‌న్న‌ర‌ప్‌గా నిలిచాడు. డీమోన్ ప‌వ‌న్ 15 ల‌క్ష‌ల క్యాష్‌తో సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.

టీఆర్‌పీలో కుమ్మేసిందిగా...

కాగా బిగ్‌బాస్ సీజ‌న్ 9 గ్రాండ్ ఫినాలే టీఆర్‌పీలో అద‌ర‌గొట్టింది. 13.06 రేటింగ్‌ను సొంతం చేసుకుంది. అర్బ‌న్ ఏరియాలో గ్రాండ్ ఫినాలేను ఎక్కువ మంది వీక్షించారు. ఏకంగా 16.14 టీఆర్‌పీతో రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్‌బాస్ గ‌త సీజ‌న్‌తో పోలిస్తే ఈ సారి రేటింగ్స్ బాగానే వ‌చ్చాయి. 10.50 టీఆర్‌పీతో బిగ్‌బాస్ 8 నిరాశ‌ప‌రిచింది. ఈ ఫెయిల్యూర్‌తో బిగ్‌బాస్ టాస్క్‌ల‌తో పాటు కంటెస్టెంట్ సెలెక్ష‌న్‌లో చాలా మార్పులు చేశారు. అవ‌న్నీ వ‌ర్క‌వుట్ అయిన‌ట్లే క‌నిపిస్తున్నాయి. టీఆర్‌పీ రేటింగ్ ప‌రంగా చూసుకుంటే అర్బ‌న్ ఏరియాలో బిగ్‌బాస్ క్రేజ్ బాగున్నా రూర‌ల్ ఆడియెన్స్‌ను మాత్రం ఆక‌ట్టుకోలేక‌పోయిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

అగ్ని ప‌రీక్ష‌...

బిగ్‌బాస్ సీజ‌న్ 9లో ఆరుగురు కామ‌న్ మ్యాన్స్‌కు కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్ ద‌క్కింది. వారి సెల‌క్ష‌న్ కోసం బిగ్‌బాస్ అగ్ని ప‌రీక్ష పేరుతో స్పెష‌ల్ షోను నిర్వ‌హించారు. అందులో విజేత‌గా నిలిచిన ఆరుగురు బిగ్‌బాస్ సీజ‌న్ 9లోకి కంటెస్టెంట్స్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెలిబ్రిటీల ఎంపిక విష‌యంలో డిఫ‌రెంట్‌గా అడుగులు వేశారు. లైమ్‌లైట్‌లో ఎక్కువ‌గా లేని సినిమా, టీవీ ఆర్టిస్టుల‌ను సెలెక్ట్ చేశారు. ఆరంభంలో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. కామ‌న్ మ్యాన్స్ , సెలిబ్రిటీల మ‌ధ్య గొడ‌వ‌లు, టాస్క్‌ల‌తో ఈ షోపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేయ‌డంలో కొంత వ‌ర‌కు స‌క్సెస్ అయ్యారు.
ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన తొమ్మిది సీజ‌న్స్‌లో ఏడో సీజ‌న్ గ్రాండ్ ఫినాలే హ‌య్యెస్ట్ రేటింగ్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. బిగ్‌బాస్ సీజ‌న్ 7 ఫైన‌ల్‌కు 21. 7 రేటింగ్ వ‌చ్చింది. ఈ రికార్డ్ ఇప్ప‌టివ‌ర‌కు బ్రేక్ కాలేదు.
బిగ్‌బాస్ 9 స‌క్సెస్‌తో...ప‌దో సీజ‌న్‌పై మంచి బ‌జ్ క్రియేట్ అయ్యింది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సీజ‌న్ 10 ప్రారంభం కానున్న‌ట్లు స‌మాచారం.

ALSO READ Bigg Boss Shanmukh | ప్రియురాలిని ప‌రిచ‌యం చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ – ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైర‌ల్‌
Advertisement

తాజావార్తలు

Advertisement