Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ 9 తెలుగు గ్రాండ్ ఫినాలే డేట్ ఫిక్స్ – చీఫ్ గెస్ట్‌గా మెగాస్టార్ – విన్నర్ ఎవరంటే?
Entertainment | Published On Dec 18, 2025, 6.12 pm IST
చిరంజీవి, నాగార్జున
Bigg Boss 9 Telugu |బిగ్‌బాస్ 9 తెలుగు (Bigg Boss Telugu)ఎండింగ్‌కు చేరుకుంది. ఫైనల్‌లోకి ఐదుగురు కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. తనూజతో పాటు ఇమ్మాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమోన్ పవన్, కళ్యాణ్ పడాల టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా నిలిచారు. ఈ ఐదుగురిలో విన్నర్‌గా ఎవరు నిలుస్తారు? గ్రాండ్ ఫినాలేకు ముందు ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజ టాప్‌లో ఉన్నట్లు సమాచారం. స్టార్ మా ఓటింగ్‌లో కళ్యాణ్ పడాల ముందున్నట్లు తెలిసింది. మిస్స్‌డ్ కాల్స్‌లో ఓటింగ్‌లో తనూజ దూసుకుపోతున్నట్లు చెబుతున్నారు. ఓవరాల్ ఓటింగ్‌లో కళ్యాణ్ దాటేసి తనూజ టాప్‌లో ఉందట. అయితే ఇద్దరి మధ్య తేడా మాత్రం తక్కువేనని అంటున్నారు. టైటిల్ కోసం ఇద్దరి మధ్య హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. తనూజ, కళ్యాణ్ పడాలలోనే ఒకరు విన్నర్‌గా నిలిచే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇమాన్యుయేల్, సంజనా గల్రానీ, డిమోన్ పవన్ ఫైనాల్‌లో ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు.
చిరంజీవి గెస్ట్...
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న జరుగనుంది. ఇప్పటికే ఫైనల్‌కు సంబంధించిన ఏర్పాట్లు మొదలైనట్లు తెలిసింది. ఈ గ్రాండ్ ఫినాలే ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చీఫ్ గెస్ట్‌గా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ ఫైనల్‌లో మన శంకర వరప్రసాద్‌గారు సినిమాను డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి చిరంజీవి ప్రమోట్ చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరంజీవితో పాటు రవితేజ, నవీన్ పొలిశెట్టి సహా సంక్రాంతికి సినిమాలకు సంబంధించిన మరికొందరు హీరోలు, హీరోయిన్లు బిగ్‌బాస్ ఫినాలేలో సందడి చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. స్పెషల్ పర్ఫార్మెన్స్‌లు ఉంటాయట.బిగ్‌బాస్ విన్నర్‌కు యాభై లక్షల ప్రైజ్‌మనీ దక్కబోతుంది. అలాగో ఓ లగ్జరీ కారును కూడా గిఫ్ట్‌గా ఇవ్వబోతున్నట్లు సమాచారం. కాగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 21న సాయంత్రం ఏడు గంటల నుంచి స్టార్ మాతో పాటు జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిసింది. గ్రాండ్ ఫినాలేలో బిగ్‌బాస్ సీజన్ 10కు సంబంధించిన స్పెషల్ అప్‌డేట్‌ను కూడా అనౌన్స్‌చేస్తారని ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



