Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ 9 తెలుగు – రెమ్యూనరేషన్‌లో విన్నర్ కళ్యాణ్‌ను దాటేసిన కంటెస్టెంట్ వీళ్లే!
Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో రెమ్యూనరేషన్ పరంగా సంజనా(Sanjana), భరణి టాప్‌లో ఉన్నారు. బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల (Kalyan Padala) ప్రైజ్‌మనీతో సమానంగా వీరు రెమ్యూనరేషన్ దక్కించుకున్నారు.
Entertainment | Published On Dec 22, 2025, 11.04 am IST
Bigg Boss 9 Telugu | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 ముగిసింది. పదిహేను వారాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడింది. కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల (Kalyan Padala) బిగ్‌బాస్ టైటిల్ గెలిచాడు. తనూజ రన్నరప్ గా నిలిచింది. డీమోన్ పవన్ సెకండ్ రన్నరప్‌గా హౌజ్ నుంచి బయటకు అడుగుపెట్టాడు.
బిగ్‌బాస్ సీజన్ 9 టైటిల్ గెలిచిన కళ్యాణ్ పడాలకు భారీగానే డబ్బు దక్కింది. 35 లక్షల ప్రైజ్‌మనీతో పాటు ఓ కారు, మరో ఐదు లక్షల విలువైన గిఫ్ట్ అందుకున్నాడు. కళ్యాణ్‌కు యాభై లక్షల ప్రైజ్‌మనీ దక్కాల్సింది. కానీ డీమోన్ పవన్ పదిహేను లక్షలు తీసుకొని ఎలిమినేట్ కావడంతో కళ్యాణ్ ప్రైజ్‌మనీ 35 లక్షలకు తగ్గింది.
వారానికి డెబ్బై వేల చొప్పన పదిహేను వారాలు హౌజ్‌లో కొనసాగినందుకు కళ్యాణ్‌మరో పది లక్షల వరకు రెమ్యూనరేషన్ (Remuneration) అందుకున్నాడట. మొత్తంగా విన్నర్ హోదాలో కళ్యాణ్‌కు యాభై లక్షలకుపైనే గిట్టుబాటు అయ్యిందని అంటున్నారు.
రన్నరప్ గా నిలిచిన తనూజకు (Tahnuja) ప్రైజ్‌మనీ ఏం దక్కలేదు. టైటిల్ కోసం చివరి వరకు పోరాడింది. కానీ లక్ కలిసిరాకపోవడంతో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రైజ్‌మనీ దక్కకపోయినా రెమ్యూనరేషన్ పరంగా కళ్యాణ్‌తో సమానంగానే తనూజ సంపాదించిందట. వారానికి రెండున్నర లక్షల రెమ్యూనరేషన్‌తో తనూజ బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టినట్లు సమాచారం. పదిహేను వారాలకు గాను తనూజకు 37. 50 లక్షలు దక్కాయట.
బిగ్‌బాస్ సీజన్ 9లో రెమ్యూనరేషన్ పరంగా సంజనా, భరణి టాప్‌లో ఉన్నట్లు సమాచారం. బిగ్‌బాస్ ద్వారా వీరిద్దరు తలో 42 లక్షలు సొంతం చేసుకున్నట్లు సమాచారం. రోజుకు నలభై వేల రెమ్యూనరషన్‌తో సంజనా బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెబుతున్నారు. భరణి సంజన తర్వాత జబర్ధస్థ్ ఇమాన్యుయేల్ 40 లక్షలతో రెమ్యూనరేషన్ పరంగా మూడో ప్లేస్‌లో ఉన్నట్లు టాక్. విన్నర్ కళ్యాణ్‌తో పాటు సెకండ్ రన్నరప్ డీమోన్ పవన్ కామన్ మ్యాన్స్ కోటాలో హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో వారికి పెద్దగా రెమ్యూనరేషన్ దక్కలేదు.
సంబంధిత వార్తలు

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల – రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
ఆగస్టు 13, 2026

Bigg Boss Agnipariksha | బిగ్‌బాస్ అగ్నిపరీక్ష లాంఛింగ్ డేట్ చెప్పేసిన కళ్యాణ్ పడాల – వీడియోతో సర్ప్రైజ్
ఆగస్టు 3, 2026

Bigg Boss Thanuja | ఓటీటీలోకి బిగ్‌బాస్ రన్నరప్ తనూజ ఎంట్రీ – తెలుగు వెబ్‌సిరీస్ ఫస్ట్ లుక్ రిలీజ్
జులై 31, 2026
తాజావార్తలు
- ●Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి
- ●Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?
- ●Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ
- ●Red Fort Attack | ఢిల్లీ పేలుడు వెనుక ఆల్‌ఖైదా హస్తం.. UNSC సంచలన నివేదిక
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Lok Sabha | లోక్‌సభ నిరవధిక వాయిదా.. వందేమాతరంతో ముగింపు.. చరిత్రలో తొలిసారి

Black Magic | మహాదేవ్‌పూర్‌లో క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో ప్రజలు

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడులకు సమయమిదే..?

Bigg Boss Kalyan | హీరోగా మారిన బిగ్‌బాస్ విన్నర్ కళ్యాణ్ పడాల - రియల్ లైఫ్ బ్రేకప్ లవ్‌స్టోరీతో డెబ్యూ మూవీ



