Divvela Madhuri | సినిమాల్లోకి దువ్వాడ మాధురి ఎంట్రీ – గైరమ్మత్తగా బిగ్ స్క్రీన్‌పై రచ్చ
బిగ్‌బాస్ సీజన్ 9 ఫేమ్ దివ్వెల మాధురి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. చీన్ టపాక్ డుం డుం మూవీలో గైరమ్మత్త పాత్రలో కనిపించబోతుంది. దివ్వెల మాధురి ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Entertainment | Published On Apr 28, 2026, 10.47 am IST
Divvela Madhuri | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9 కంటెస్టెంట్ దివ్వెల మాధురి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తోంది. నటిగా టాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. వైఎస్సార్‌సీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో దివ్వెల మాధురి బంధం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంశంగా మారింది. వివాదాలతో సంబంధం లేకుండా సోషల్ మీడియాతో ఈ జంట పాపులర్ అయ్యారు.
వైల్డ్ కార్డ్‌తో....
సోషల్ మీడియా క్రేజ్‌తోనే బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది దివ్వెల మాధురి. వైల్డ్ కార్డ్‌తో బిగ్‌బాస్ షోలోకి అడుగుపెట్టిన మాధురి కేవలం రెండు వారాలు మాత్రమే హౌజ్‌లో కొనసాగింది.
తాజాగా మాధురి సినిమాల్లోకి అడుగుపెట్టబోతుంది. చీన్ టపాక్ డుం డుం సినిమాలో దివ్వెల మాధురి కీలక పాత్రలో కనిపించబోతుంది. ఆమె ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గైరమ్మత్త పాత్రలోదివ్వెల మాధురి నటిస్తోన్నట్లు ప్రకటించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తుంటే అగ్రెసివ్ క్యారెక్టర్‌లో దివ్వెల మాధురి కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. సిల్వర్ స్క్రీన్‌పై మాధురి రచ్చ చేయడం ఖాయమని అంటున్నారు.
శ్రీనివాస్ గవిరెడ్డి...
చీన్ టపాక్ డుం డుం సినిమాలో శుభం ఫేమ్ శ్రీనివాస్ గవిరెడ్డి హీరోగా నటిస్తున్నాడు. బ్రిగాడా సాగా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు వైఎన్ లోహిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా అఫీషియల్‌గా లాంఛ్ అయ్యింది. ఈ ఓపెనింగ్ ఈవెంట్‌కు సమంత, గోపిచంద్ మలినేని, వశిష్ట మల్లిడితో పాటు పలువురు సెలిబ్రిటీలు హాజరయ్యారు.
రైటర్‌గా, డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనివాస్ గవిరెడ్డి. సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు, అనుభవించు రాజా సినిమాలకు దర్శకత్వం వహించాడు. యాక్టర్‌గా శుభంతో పాటు మరికొన్ని సినిమాల్లో నటించాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



