త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ల‌యాళం మూవీ – హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న 367వ మూవీని శ‌నివారం అఫీషియ‌ల్‌గా అనౌన్స్‌చేశారు. ర‌ష్యా ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు నేష‌న‌ల్‌ అవార్డ్ విన్న‌ర్ విష్ణు మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతోనే మ‌ల‌యాళంలోకి భాగ్య‌శ్రీ ఎంట్రీ ఇస్తోంది.

N

Entertainment | Published On Sep 5, 2026, 3.06 pm IST

Bhagyashri Borse | ర‌ష్యా, ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ల‌యాళం మూవీ – హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే
Advertisement

Bhagyashri Borse |లెనిన్ బ్యూటీ భాగ్య‌శ్రీ బోర్సే ల‌క్కీ ఛాన్స్ కొట్టేసింది. మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి ఓ సినిమా చేయ‌బోతుంది. వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాతోనే భాగ్య‌శ్రీ బోర్సే మాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది.
మోహ‌న్‌లాల్ హీరోగా మ‌ల‌యాళంలో స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీని శ‌నివారం అనౌన్స్ చేశారు. ఆప‌రేష‌న్ గంగా పేరుతో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్ర‌హీత‌ విష్ణు మోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ట్విస్ట్‌లు, ట‌ర్న్‌లు...

ర‌ష్యా - ఉక్రెయిన్ వార్ నేప‌థ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ వెల్ల‌డించారు. ట్విస్ట్‌లు, ట‌ర్న్‌ల‌తో స‌ర్‌ప్రైజింగ్‌గా ఆమె పాత్ర సాగుతుంద‌ని స‌మాచారం. గ‌త సినిమాల‌కు పూర్తి భిన్నంగా భాగ్య‌శ్రీ లుక్ ఉంటుంద‌ని అంటున్నారు. మోహ‌న్‌లాల్‌తో ఈ హీరోయిన్ కాంబినేష‌న్‌లో వ‌చ్చే సీన్లు అదిరిపోతాయ‌ని అంటున్నారు.

ఆప‌రేష‌న్ గంగా...

ర‌ష్యా తో యుద్దం కార‌ణంగా చాలా మంది భార‌తీయ విద్యార్థులు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు భార‌త ప్ర‌భుత్వం ఆప‌రేష‌న్ గంగా పేరుతో ఓ సీక్రెట్ మిష‌న్‌ను చేప‌ట్టింది. ఈ ర‌హ‌స్య ఆప‌రేష‌న్ బ్యాక్‌డ్రాప్‌లోనే ఈ మూవీ సాగ‌నుంది. మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న 367వ మూవీ ఇది.
ఈ మ‌ల‌యాళం మూవీలో ఆర్జున్ రాంపాల్‌, పార్తిబ‌న్‌తో పాటు వివిధ భాష‌ల‌కు చెందిన సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. త్వ‌ర‌లో ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లుకాబోతుంది. పుష్ప‌, పుష్ప 2 సినిమాటోగ్రాఫ‌ర్ మిరాస్లో క్రుబా బోజేక్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఈ మ‌ల‌యాళం మూవీని తెలుగు, హిందీ, త‌మిళం, క‌న్న‌డ భాష‌ల్లో రిలీజ్ చేయ‌బోతున్నారు.

లెనిన్‌తో ఫ‌స్ట్ హిట్‌...

ఇటీవ‌లే లెనిన్ మూవీతో కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందుకుంది భాగ్య‌శ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ సినిమా థియేట‌ర్ల‌లో వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. లెనిన్ కంటే ముందు తెలుగులో మిస్ట‌ర్ బ‌చ్చ‌న్‌, ఆంధ్రా కింగ్ తాలూకా, కింగ్డ‌మ్ సినిమాలు చేసింది. ప్ర‌స్తుతం త‌మిళంలో శివ‌కార్తికేయ‌న్‌తో సియోన్ సినిమా చేస్తోంది.

 

Advertisement
Advertisement