త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ల‌యాళం మూవీ – హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే

భాగ్య‌శ్రీ బోర్సే మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అగ్ర హీరో మోహ‌న్‌లాల్‌తో సినిమా చేస్తోంది. ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధ స‌మ‌యంలో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ గంగా ఆధారంగా ఈ సినిమా రూపొంద‌నుందంట‌.

N

Entertainment | Published On Jun 22, 2026, 4.23 pm IST

Bhagyashri Borse | ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో మ‌ల‌యాళం మూవీ – హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే
Advertisement

Bhagyashri Borse | అదృష్టం అంటే భాగ్య‌శ్రీ బోర్సేదేన‌ని సినీ వ‌ర్గాలు అంటున్నాయి. ఈ ఔరంగ‌బాద్ బ్యూటీ ద‌క్షిణాది సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టి రెండేళ్లు దాటిపోయింది. ఇప్ప‌టివ‌ర‌కు నాలుగు సినిమాలు చేసింది. స్టార్ హీరోల‌తో జోడీ క‌ట్టినా విజ‌యాలు మాత్రం ద‌క్క‌లేదు. అయినా అవ‌కాశాల రేసులో ఈ ముద్దుగుమ్మ దూసుకుపోతుంది. తాజాగా మ‌ల‌యాళంలోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. అగ్ర హీరో మోహ‌న్‌లాల్‌తో సినిమా చేసే ఛాన్స్ ద‌క్కించుకుంది.

స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్‌...

మోహ‌న్‌లాల్ హీరోగా విష్ణుమోహ‌న్ ద‌ర్శ‌క‌త్వం మ‌ల‌యాళంలో ఓ స‌ర్వైవ‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ తెర‌కెక్కుతోంది. ర‌ష్యా - ఉక్రెయిన్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే ఈ సినిమాలో భాగ్య‌శ్రీ బోర్సే హీరోయిన్‌గా న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. మోహ‌న్‌లాల్ థ్రిల్ల‌ర్ సినిమాతోనే భాగ్య‌శ్రీ మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో తొలి అడుగు వేయ‌బోతుంది. క‌థ న‌చ్చ‌డంతో రెమ్యూన‌రేష‌న్ కూడా త‌గ్గించుకొని ఈ సినిమాలో భాగం కావాల‌ని భాగ్య‌శ్రీ నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం.

ఆప‌రేష‌న్ గంగా...

ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దం కార‌ణంగా ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భార‌తీయ పౌరుల‌ను ర‌క్షించేందుకు ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్ ఆప‌రేష‌న్ గంగా పేరుతో ఓ సీక్రెట్ మిష‌న్ చేప‌ట్టింది. ఆప‌రేష‌న్ గంగా నిర్వ‌హ‌ణ‌లో ఇండియ‌న్ గ‌వ‌ర్న‌మెంట్‌కు ఎలాంటి స‌వాళ్లు ఎదుర‌య్యాయి? ఈ మిష‌న్‌ స‌క్సెస్ వెనుక ఎవ‌రున్నారు అనే అంశాల‌తో ఈ మ‌ల‌యాళం మూవీ రూపొంద‌నుంద‌ట‌. ఇందులో మోహ‌న్‌లాల్‌తో పాటు భాగ్య‌శ్రీ బోర్సే పాత్ర‌లు రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు భిన్నంగా ఉంటాయ‌ని అంటున్నారు.

367వ మూవీ...

మోహ‌న్‌లాల్ హీరోగా న‌టిస్తోన్న 367వ మూవీ ఇది. ప్ర‌స్తుతం ఈ మ‌ల‌యాళం థ్రిల్ల‌ర్ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంద‌ట‌. త్వ‌ర‌లోనే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో భాగ్య‌శ్రీ బోర్సే భాగం కానున్న‌ట్లు చెబుతోన్నారు.
ప్ర‌స్తుతం తెలుగులో లెనిన్ సినిమా చేస్తోంది ఈ మ‌హారాష్ట్ర సుంద‌రి. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ మూవీ జూలై 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. లెనిన్ ప్ర‌మోష‌న్స్‌లో భాగ్య‌శ్రీ ఫుల్ బిజీగా ఉంది. త‌మిళ మూవీ సియోన్‌లో శివ‌కార్తికేయ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా న‌టిస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే.

 

Advertisement
Advertisement