త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bhagyashri Borse | ఒక్క హిట్టుతోనే రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన భాగ్య‌శ్రీ – ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు

లెనిన్‌తో కెరీర్‌లో ఫ‌స్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకుంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ విజ‌యంతో త‌న రెమ్యూన‌రేష‌న్‌ను డ‌బుల్ చేసిన‌ట్లు స‌మాచారం. లెనిన్‌కు ముందు ఒక్కో సినిమాకు కోటిన్న‌ర వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకున్న ఇప్పుడు మూడు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తోన్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Jul 18, 2026, 3.35 pm IST

Bhagyashri Borse | ఒక్క హిట్టుతోనే రెమ్యూన‌రేష‌న్ పెంచేసిన భాగ్య‌శ్రీ  – ట్రోల్ చేస్తోన్న నెటిజ‌న్లు
Advertisement

Bhagyashri Borse |  లెనిన్‌తో కెరీర్‌లో తొలి స‌క్సెస్‌ను అందుకుంది భాగ్య‌శ్రీ బోర్సే. ఈ సినిమాలో భార‌తి అనే ప‌ల్లెటూరి అమ్మాయిగా నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. అందం, తెగువ క‌ల‌బోసిన క్యారెక్ట‌ర్‌లో భాగ్య‌శ్రీ బోర్సే చూపించిన మెచ్యూరిటీ, వేరియేష‌న్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అఖిల్ అక్కినేని హీరోగా న‌టించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల వ‌సూళ్ల‌కు చేరువ‌లో ఉంది. ఫ‌స్ట్ వీకెండ్‌లోనే నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. లెనిన్ స‌క్సెస్‌తో భాగ్య‌శ్రీ బోర్సే ఫుల్ ఖుషీలో ఉంది. ఈ మూవీ స‌క్సెస్ మీట్‌లో ఎమోష‌న‌ల్ అయ్యింది. భాగ్య‌శ్రీపై ఉన్న ఐరెన్ లెగ్ అనే ముద్ర కూడా తొలిపోయింది.

ఆఫ‌ర్లు క్యూ...

లెనిన్ విజ‌యంతో ఈ అమ్మ‌డికి ఆఫ‌ర్లు కూ క‌డుతున్నాయ‌ట‌. ప్ర‌స్తుతం శివ‌కార్తికేయ‌న్‌తో త‌మిళంలో సియోన్ సినిమా చేస్తోంది భాగ్య‌శ్రీ బోర్సే. ఇటీవ‌లే శ‌ర్వానంద్, శ్రీనువైట్ల మూవీలో ఆఫ‌ర్ అందుకున్న‌ట్లు స‌మాచారం. వీటితో పాటు మ‌రో రెండు సినిమాల‌కు ఈ ముద్దుగుమ్మ ఓకే చెప్పిన‌ట్లు వార్త‌లొస్తున్నాయి. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునే ప‌నిలో ప‌డింది భాగ్య‌శ్రీ బోర్సే.

రెమ్యూన‌రేష‌న్ డ‌బుల్‌...

లెనిన్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో త‌న రెమ్యూన‌రేష‌న్‌ను పెంచేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. లెనిన్‌కు ముందు సినిమాకు కోటి నుంచి కోటిన్న‌ర వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ తీసుకుంటూ వ‌చ్చింది. కొత్త‌గా అంగీక‌రిస్తోన్న సినిమాల‌కు మాత్రం రెండున్న‌ర కోట్ల నుంచి మూడు కోట్ల వ‌ర‌కు డిమాండ్ చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. తెలుగుతో పాటు త‌మిళంలో ఈ అమ్మ‌డికి ఉన్న స్టార్‌డ‌మ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లుగా కూడా రెడీగా ఉన్న‌ట్లు టాక్‌. మ‌రోవైపు ఒక్క‌ హిట్టుతోనే రెమ్యూన‌రేష‌న్ పెంచ‌డంపై విమ‌ర్శ‌లు కూడా వ‌స్తున్నాయి.
మ‌హారాష్ట్ర‌లో పుట్టిన ఈ బ్యూటీ ర‌వితేజ మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ త‌ర్వాత విజ‌య్ దేవ‌ర‌కొండ కింగ్డ‌మ్‌, రామ్ పోతినేని ఆంధ్రా కింగ్ తాలూకాతో పాటు కాంతా సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. టాలీవుడ్ హీరో రామ్ పోతినేనితో భాగ్య‌శ్రీ బోర్సే ప్రేమ‌లో ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

 

Advertisement
Advertisement