త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jennifer Lopez | మాజీ భార్యకు 550 కోట్ల ఆస్తి గిఫ్ట్‌గా ఇచ్చిన హాలీవుడ్ హీరో

హాలీవుడ్ హీరో బెన్ అఫ్లెక్ మాజీ భార్య జెన్నిఫ‌ర్ లోపెజ్‌కు 550 కోట్ల విలువైన ఓ ఇంటిని ఫ్రీగా ఇచ్చేశాడ‌ట‌. 2023లో పెళ్లి చేసుకున్న బెన్ అఫ్లెక్‌, జెన్నిఫ‌ర్ లోపెజ్ గ‌త ఏడాది విడిపోయారు. ప్ర‌స్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో ఉంది.

N

Entertainment | Published On Apr 11, 2026, 3.18 pm IST

Jennifer Lopez | మాజీ భార్యకు 550 కోట్ల ఆస్తి గిఫ్ట్‌గా ఇచ్చిన హాలీవుడ్ హీరో
Advertisement

Jennifer Lopez |  హాలీవుడ్ హీరో బెన్ అఫ్లెక్‌, సింగ‌ర్ క‌మ్ హీరోయిన్ జెన్నిఫ‌ర్ లోపెజ్ విడిపోనున్న‌ట్లుగా గ‌త ఏడాది ప్ర‌క‌టించారు. వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ రోజే విడాకుల‌కు అప్ల‌య్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించి అభిమానుల‌కు పెద్ద షాకిచ్చారు. 2002లో బెన్ అఫ్లెక్‌, జెన్సీఫ‌ర్ లోపెజ్‌ పెళ్లి చేసుకున్నారు. రెండేళ్ల‌లోనే మ‌న‌స్ప‌ర్థ‌ల కార‌ణంగా విడిపోయారు. 2021లో వీరిద్ద‌రి మ‌ధ్య మ‌ళ్లీ ప్రేమ చిగురించింది. విభేదాల‌ను ప‌క్క‌న‌పెట్టి తాము మ‌రోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన‌ట్లు ప్ర‌క‌టించారు. మూడేళ్ల పాటు వీరి కాపురం స‌జావుగా సాగింది. అభిప్రాయ‌భేదాల కార‌ణంగా గ‌త ఏడాది ఆరంభంలో తాము విడిపోతున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. బెన్ అఫ్లెక్ నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది జెన్నిఫ‌ర్ లోపెజ్‌.

550 కోట్లు...

గ‌త ఏడాది కాలంగా బెన్ అఫ్లెక్‌, జెన్నిఫ‌ర్ లోపెజ్‌ విడాకుల కేసు సాగుతూనే ఉంది. తాజాగా మాజీ భార్య‌కు 558 కోట్ల (60 మిలియ‌న్ డాల‌ర్లు) విలువైన ఇంటిని ఫ్రీగా ఇచ్చేశాడ‌ట బెన్ అఫ్లెక్‌. 2023లో పెళ్లైన ఏడాదే అమెరికాలోని బెవ‌ర్లీ హిల్స్ ఏరియాలో ఖ‌రీదైన ఇంటిని బెన్ అఫ్లెక్ కొనుగోలు చేశాడు. విడాకుల‌కు ముందు ఈ ఇంటిలోనే అఫ్లెక్‌, లోపెజ్ క‌లిసి ఉన్నారు. విడిపోయిన త‌ర్వాత ఇంటిని ఖాళీ చేశారు. తాజాగా విడాకుల కేసు కొనసాగుతుండగానే ఈ ఇంటికి సంబంధించిన హ‌క్కుల‌న్నీ మాజీ భార్య పేరిట ఉచితంగా బ‌దిలీ చేశాడ‌ట భరణంగా ఈ ఇంటినే కాకుండా మ‌రికొన్ని ఆస్తుల‌ను కూడా జెన్సీఫ‌ర్ లోపెజ్‌కు బెన్ అఫ్లెక్ ఇవ్వ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. వాటి విలువ వెయ్యి కోట్ల వ‌ర‌కు కోట్ల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంటున్నారు. మొత్తంగా ఈ విడాకుల ద్వారా జెన్నిఫ‌ర్ లోపెజ్‌కు ప‌దిహేను వంద‌ల కోట్ల‌కుపైనే భ‌ర‌ణంగా ద‌క్క‌నుంద‌ని వార్త‌లొస్తున్నాయి. ఇటీవ‌లే త‌న ఏఐ కంపెనీని నెట్‌ఫ్లిక్స్‌కు బెన్ అఫ్లెక్స్ అమ్మేశాడ‌ట‌. ఈ కంపెనీ అమ్మ‌కం ద్వారా 5585 కోట్లు ద‌క్కిన‌ట్లు స‌మాచారం. అందుకే ఈ ఇంటిని మాజీ భార్య‌కు ఉచితంగా ఇచ్చేశాడ‌ని అంటున్నారు.

హాలీవుడ్‌లో ఈ జంట‌ను బెన్నిఫ‌ర్‌గా అభిమానులు పిలుస్తుంటారు. బెన్ అఫ్లెక్, జెన్నిఫ‌ర్ లోఫెజ్ క‌లిసి గిగ్లీ, జెర్సీ గ‌ర్ల్‌, ది గ్రేటెస్ట్ ల‌వ్‌స్టోరీ నెవ‌ర్ టోల్డ్‌తో పాటు మ‌రికొన్ని సినిమాలు చేశారు.

 

Advertisement
Advertisement