Bellamkonda Sreenivas | ప్రియురాలిని పెళ్లాడిన టాలీవుడ్ హీరో
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ప్రియురాలు కావ్య రెడ్డి మెడలో మూడముళ్లు వేశారు. శ్రీనివాస్, కావ్యరెడ్డిల వివాహం తిరుమలలో బుధవారం రాత్రి జరిగింది.
Entertainment | Published On Apr 30, 2026, 10.42 am IST
Bellamkonda Sreenivas | టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఇంటివాడయ్యారు. ప్రియురాలు కావ్య రెడ్డితో శ్రీనివాస్ పెళ్లి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ జంట వివాహ వేడుకలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తో పాటు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు పాల్గొన్నారు.
మే 1న హైదరాబాద్‌లో శ్రీనివాస్, కావ్యరెడ్డి వెడ్డింగ్ రిసెప్షన్ జరుగనుంది. ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు హాజరుకాబోతున్నారు.
రెండేళ్లుగా ప్రేమలో...
గత రెండేళ్లుగా శ్రీనివాస్, కావ్య రెడ్డి ప్రేమలో ఉన్నట్లు సమాచారం. కావ్య రెడ్డి తండ్రితో పాటు తాతయ్య న్యాయవాదులుగా స్థిరపడినట్లు తెలిసింది. పెద్దల అంగీకారంతోఈ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు.
కిష్కిందపురి....
గత ఏడాది కిష్కిందపురి మూవీతో హీరోగా బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నాడు శ్రీనివాస్. హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఇరవై కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకుంది. ప్రస్తుతం టైసన్ నాయుడు, హైందవతో పాటు మరో సినిమా చేస్తున్నాడు.
తిరుమలలో అంగరంగ వైభవంగా జరిగిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి#BellamkondaSreenivas @BSaiSreenivas
నూతన వధూవరుల కు శుభాకాంక్షలు 🎉 pic.twitter.com/3FObYdND0q
— H A N U (@HanuNews) April 30, 2026
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



