Bellamkonda Srinivas | టాలీవుడ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్ – డెస్టినేషన్ వెడ్డింగ్ కాదు…గుడిలో సింపుల్‌గా …
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ప్రియురాలు కావ్యరెడ్డి మెడలో మూడుముళ్లు వేయబోతున్నాడు. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి పెళ్లి జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Entertainment | Published On Mar 27, 2026, 5.06 pm IST
Bellamkonda Srinivas | టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ప్రియురాలు కావ్య రెడ్డి తో వచ్చే నెలలోనే ఏడడుగులు వేయబోతున్నాడు. ఇటీవలే కాబోయే భార్య కావ్యను అభిమానులకు పరిచయం చేశారు బెల్లంకొండ శ్రీనివాస్. రోకా వేడుకను నిర్వహించారు. ఈ వేడుక తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఏప్రిల్ 29న పెళ్లి...
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య పెళ్లి డేట్‌తో పాటు వేదిక కూడా ఖరారైనట్లు సమాచారం. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో ఈ జంట నిశ్చితార్థం జరుగనుందట. ఏప్రిల్ 29ని పెళ్లి వేడుకకు ముహూర్తంగా ఫిక్స్ చేసినట్లు సమాచారం. మే 1న హైదరాబాద్‌లో సినీ ప్రముఖుల కోసం గ్రాండ్‌గా రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నారట.
సింపుల్‌గా పెళ్లిలో...
సాధారణంగా హీరోహీరోయిన్లు డెస్టినేషన్ వెడ్డింగ్‌కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తున్నారు. లేదంటే ఫారిన్‌లోనూ తమ పెళ్లి వేడుకలను జరుపుకోవడం కామన్. కానీ బెల్లంకొండ శ్రీనివాస్, కావ్య రెడ్డి పెళ్లి మాత్రం తిరుపతిలో సింపుల్‌గా జరుగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. తిరుమలలోనే తమ పెళ్లి వేడుకను జరుపుకోవాలని ఈ జంట నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు.
కావ్య రెడ్డితో బెల్లంకొండ శ్రీనివాస్ చాలా కాలంగా ప్రేమలో ఉన్నట్లుగా సమాచారం. కావ్య తండ్రి లాయర్ అని టాక్ వినిపిస్తోంది.
కాగా గత ఏడాది రిలీజైన కిష్కిందపురి మూవీతో హీరోగా బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. కిష్కిందపురి తర్వాత టైసన్ నాయుడుతో పాటు హైందవ సినిమాలు చేస్తున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



