త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

chiranjeevi – venkatesh | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కంటే ముందు చిరు, వెంకీ కాంబోలో రెండు సినిమాలు రావాల్సింది..కానీ..

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు కంటే ముందు చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు రావాల్సింది. అనౌన్స్‌మెంట్ వ‌ర‌కు వ‌చ్చి ఆగిపోయిన ఈ సినిమాలు ఏవంటే.

N

Entertainment | Published On Jan 3, 2026, 3.58 pm IST

chiranjeevi – venkatesh | మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్ కంటే ముందు చిరు, వెంకీ కాంబోలో రెండు సినిమాలు రావాల్సింది..కానీ..
Advertisement

chiranjeevi - venkatesh |  చిరంజీవి హీరోగా న‌టించిన మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు సంక్రాంతికి థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌బోతుంది. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ ఫ‌న్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీలో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. చిరంజీవికి జోడీగా న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల‌కు సంబంధించి తెలుగు ఆడియెన్స్‌లో మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారుపైనే ఎక్కువ‌గా బ‌జ్ నెల‌కొంది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన పాట‌లు, పోస్ట‌ర్ల‌కు మంచి రెస్పాన్స్ వ‌స్తోంది.
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న ఫ‌స్ట్ మూవీ ఇదే కావ‌డం కూడా సినిమాపై అంచ‌నాలు పెర‌గ‌డానికి కార‌ణ‌మైంది. ఇందులో వెంక‌టేష్ స్పెష‌ల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నారు. సెకండాఫ్‌లో వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ ఎంట్రీ ఇస్తుంద‌ని, దాదాపు ఇర‌వై నిమిషాల పాటు ఆయ‌న సినిమాలో క‌నిపిస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇటీవ‌లే చిరంజీవి, వెంక‌టేష్‌ల‌పై మెగా విక్ట‌రీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఇద్ద‌రు హీరోలు పోటీప‌డి డ్యాన్స్‌తో అద‌ర‌గొట్టారు.

మ‌ల్టీస్టార‌ర్ మూవీ...

మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు కంటే ముందు చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో రెండు సినిమాలు రావాల్సింది. ఓ సినిమా అనౌన్స్‌మెంట్ త‌ర్వాత ఆగిపోయింది. మ‌రో మూవీకి క‌థ సిద్ధ‌మైన త‌ర్వాత పుల్‌స్టాప్ ప‌డింది.చిరంజీవి, వెంక‌టేష్ హీరోలుగా ప్రొడ్యూస‌ర్ రామానాయుడు ఓ మ‌ల్టీస్టార‌ర్ సినిమా చేయాల‌ని అనుకున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్‌లో వందో సినిమాగా ఈ మ‌ల్టీస్టార‌ర్‌ను రూపొందించ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ద‌ర్శ‌కుడిగా ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ‌ను ఖ‌రారు చేశారు. ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీ కోసం దాదాపు ఆరేడు నెల‌లు పాటు స్టోరీ డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. స‌త్యానంద్‌, ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్‌తో పాటు ప‌లువురు రైట‌ర్లు రంగంలోకి దిగారు. కొన్ని క‌థ‌లు సిద్ధం చేశారు. కానీ ఇవేవీ రామానాయుడితో పాటు చిరంజీవి, వెంక‌టేష్‌కు న‌చ్చ‌లేద‌ట‌. ఇద్ద‌రు హీరోల ఇమేజ్‌కు స‌రిపోయే క‌థ కుద‌ర‌క‌పోవ‌డంతో ఈ మ‌ల్టీస్టార‌ర్ మూవీకి అనౌన్స్‌మెంట్‌తోనే ప్యాక‌ప్ ప‌డింది.

త్రిదేవ్ ...

హిందీలో విజ‌య‌వంత‌మైన త్రిదేవ్ మూవీని తెలుగులో చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున‌ల‌తో రీమేక్ చేయాల‌ని ఓ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ అనుకున్నారు. తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేశారు. కానీ ముగ్గురు హీరోల డేట్స్ దొర‌క్క‌పోవ‌డంతో సినిమా ఆల‌స్య‌మైంది. ఆ త‌ర్వాత పూర్తిగా ప‌క్క‌న‌పెట్టారు.
అలా రెండు సార్లు చిరంజీవి, వెంక‌టేష్ కాంబినేష‌న్‌లో సినిమా ఆగిపోయింది. చివ‌ర‌కు మ‌న‌శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారు మూవీతో ఫ‌స్ట్ టైమ్ ఈ కాంబో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా జ‌న‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement