త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ కంటే ముందు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేసిన తెలుగు రీమేక్ మూవీస్ ఇవే!

ద‌ళ‌ప‌తి విజ‌య్ చివ‌రి మూవీ జ‌న‌నాయ‌గ‌న్ తెలుగు రీమేక్ అంటూ చాలా కాలంగా పుకార్లు వినిపిస్తున్నాయి. బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి ఆధారంగా జ‌న‌నాయ‌గ‌న్ రూపొందుతోన్న‌ట్లు స‌మాచారం. జ‌న‌నాయ‌గ‌న్ కంటే ముందు విజ‌య్ న‌టించిన తెలుగు రీమేక్ మూవీస్ ఏవంటే?

N

Entertainment | Published On Dec 28, 2025, 5.32 pm IST

Jana Nayagan | జ‌న‌నాయ‌గ‌న్ కంటే ముందు ద‌ళ‌ప‌తి విజ‌య్ చేసిన తెలుగు రీమేక్ మూవీస్ ఇవే!
Advertisement

Jana Nayagan |  ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా న‌టించిన జ‌న‌నాయ‌గ‌న్ మూవీ సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. త‌న కెరీర్‌లో ఇదే చివ‌రి సినిమా అంటూ శ‌నివారం జ‌రిగిన ఆడియో లాంఛ్ ఈవెంట్‌లో విజ‌య్ ప్ర‌క‌టించారు. ద‌ళ‌ప‌తి విజ‌య్ సినీ కెరీర్‌కు ట్రిబ్యూట్‌గా ఉండేలా భారీగా జ‌న‌నాయ‌గ‌న్ సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు మేక‌ర్స్‌. విజ‌య్ చేసిన గొప్ప క్యారెక్ట‌ర్లు, సూప‌ర్ హిట్ సినిమాల విశేషాల‌తో పాటు ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని మ‌లుపుతిప్పిన సంఘ‌ట‌న‌ల‌ను ఆవిష్క‌రిస్తూ ఇర‌వై నిమిషాల స్పెష‌ల్ వీడియోను ఈ సినిమాను యాడ్ చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ వీడియోలో త‌మిళ దిగ్గ‌జ హీరోలు, యాక్ట‌ర్ల‌తో పాటు సెలిబ్రిటీలు క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.జ‌న‌నాయ‌గ‌న్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోండ‌గా ప్రేమ‌లు ఫేమ్ మ‌మితా బైజు కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతుంది. జ‌న‌నాయ‌గ‌న్ మూవీకి హెచ్ వినోథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌...

కాగా జ‌న‌నాయ‌గ‌న్ మూవీ తెలుగులో విజ‌య‌వంత‌మైన బాల‌కృష్ణ భ‌గ‌వంత్ కేస‌రి రీమేక్‌గా రూపొందుతోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ రీమేక్ వార్త‌ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు మేక‌ర్స్ మాత్రం క‌న్ఫామ్ చేయ‌లేదు.భ‌గ‌వంత్ కేస‌రికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన అనిల్ రావిపూడి జ‌న‌నాయ‌గ‌న్ తెర‌కెక్కించాల్సింది. కానీ రీమేక్ సినిమా చేయ‌డం ఇష్టంలేక విజ‌య్ ఆఫ‌ర్‌ను అనిల్ రావిపూడి అంగీక‌రించ‌లేదు.
భ‌గ‌వంత్ కేస‌రి మూల‌క‌థ‌ను తీసుకొని త‌మిళ నేటివిటీతో పాటు విజ‌య్ ఇమేజ్‌కు అనుగుణంగా ప‌లు మార్పులు చేర్పులు చేసి ఈ సినిమాను రూపొందిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా తెలుగు సినిమాను రీమేక్ చేయ‌డం విజ‌య్‌కి ఇదే మొద‌టిసారి కాదు. తెలుగు స్టార్ హీరోలు న‌టించిన ప‌లు సినిమాల‌ను త‌మిళంలోకి రీమేక్ చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌ను అందుకున్నారు.

పెళ్లి సంద‌డి ...

శ్రీకాంత్‌, కే రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ మూవీ పెళ్లి సంద‌డి మూవీని నీనైతాన్ వంథాయ్ పేరుతో విజ‌య్ త‌మిళంలో రీమేక్ చేశారు. విజ‌య్‌ని మాస్ హీరోగా నిల‌బెట్టిన గిల్లీ, పొక్కిరి సినిమాలు కూడా తెలుగు రీమేక్‌లే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ రెంటిండికి మ‌హేష్‌బాబు సినిమాలే స్ఫూర్తి. ఒక్క‌డు సినిమాను గిల్లీ పేరుతో...పొకిరిని...పొక్కిరిగా రీమేక్ చేశారు విజ‌య్‌. అలాగే వెంక‌టేష్ ప‌విత్ర‌బంధంతో పాటు నువ్వు నాకు న‌చ్చావ్ సినిమాలు త‌మిళంలో పున‌ర్నిర్మిత‌మై ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకున్నాయి. ఈ రెండు సినిమాల్లో హీరోగా విజ‌య్ న‌టించాడు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ యూత్‌ఫుల్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌మ్ముడు మూవీని బ‌ద్రి త‌మిళంలో విజ‌య్ తెర‌కెక్కించారు.ఇవే కాకుండా విజ‌య్ హీరోగా న‌టించిన యూత్ (చిరున‌వ్వుతో) , ఆది (అత‌నొక్క‌డే), వేళాయుధం (ఆజాద్‌) సినిమాలు కూడా తెలుగు రీమేక్‌లే కావ‌డం గ‌మ‌నార్హం.

Advertisement

తాజావార్తలు

Advertisement