త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ కామెడీ మూవీ

బాసిల్ జోసెఫ్‌, టోవినో థామ‌స్ హీరోలుగా న‌టించిన మ‌ల‌యాళ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ అతిర‌ధి ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. అతిర‌ధిలో స‌ర్వంమాయ ఫేమ్ రియా శిబు హీరోయిన్‌గా న‌టించింది.

N

Entertainment | Published On Jun 4, 2026, 5.35 pm IST

Malayalam OTT | ఓటీటీలోకి బాసిల్ జోసెఫ్ మ‌ల‌యాళం బ్లాక్‌బ‌స్ట‌ర్ యాక్ష‌న్ కామెడీ మూవీ
Advertisement

Malayalam OTT |  బాసిల్ జోసెఫ్‌, టోవినో థామ‌స్ హీరోలుగా న‌టించిన మ‌ల‌యాళ మూవీ అతిర‌ధి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. కేవ‌లం 30 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ యాక్ష‌న్ కామెడీ మూవీ థియేట‌ర్ల‌లో అర‌వై కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.స‌ర్వం మాయ ఫేమ్ రియా శిబు హీరోయిన్‌గా న‌టించింది.

సోనీలివ్‌...

ఈ మ‌ల‌యాళం సూప‌ర్ హిట్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అతిర‌ధి డిజిట‌ల్ రైట్స్‌ను సోనీలివ్ ద‌క్కించుకుంది. ఈ జూన్ నెల‌లోనే ఈ సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ఓటీటీ ప్లాట్‌ఫామ్ గురువారం అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. మ‌ల‌యాళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు వెల్ల‌డించింది. జూన్ 12 నుంచి అతిర‌థి సోనీలీవ్‌లో స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

బాసిల్ జోసెఫ్ నిర్మాత‌...

అతిరధిలో హీరోగా న‌టిస్తూనే ఈ మ‌ల‌యాళ మూవీని బాసిల్ జోసెఫ్ స్వ‌యంగా నిర్మించారు. ఈ సినిమాకు అరుణ్ అనిరుధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బాసిల్ జోసెఫ్‌, టోవినో థామ‌స్ యాక్టింగ్‌, కామెడీ టైమింగ్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ ఏడాది మ‌ల‌యాళంలో వ‌చ్చిన బెస్ట్ కామెడీ మూవీస్‌లో ఒక‌టిగా అతిర‌ధి నిలిచింది. ఈ సినిమాలో మ‌రో మ‌ల‌యాళ హీరో వినీత్ శ్రీనివాస‌న్ గెస్ట్ రోల్ చేశారు.

కాలేజీ ఫెస్ట్‌...

సామ్ కుట్టి ఓ ఇంజినీరింగ్ స్టూడెంట్‌. త‌న కాలేజీలోనే అరోహ‌న్ పేరుతో జ‌రిగే ఫెస్ట్‌ను మేనేజ్‌మెంట్ బ్యాన్ చేస్తుంది. ఆ ఫెస్ట్‌ను ఎలాగైనా తిరిగి ప్రారంభించాల‌ని సామ్‌కుట్టీ ప్లాన్ చేస్తాడు. ఈ ఫెస్ట్‌కు మ‌ల‌యాళ హీరోతో పాటు మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ను గెస్ట్‌గా తీసుకురావాల‌ని అనుకుంటాడు. ఆ గెస్ట్‌ల‌ను శ్రీకుట్ట‌న్ కిడ్నాప్ చేస్తాడు. ఫెస్ట్ జ‌ర‌గ‌కుండా చేస్తాన‌ని సామ్‌కుట్టీతో ఛాలెంజ్ చేస్తాడు. సామ్‌కుట్టీ, శ్రీకుట్ట‌న్ మ‌ధ్య గొడ‌వ‌ల‌కు కార‌ణ‌మేమిటి? కాలేజీలో ఫెస్ట్‌ను సామ్ నిర్వ‌హించాడా? లేదా? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement

తాజావార్తలు

Advertisement