త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kayadu Lohar | క‌య‌దు లోహ‌ర్ రొమాంటిక్ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – ప్రేమించిన అమ్మాయి ర‌క్త‌పిశాచి అని తెలిస్తే!

క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ రొమాంటిక్ హార‌ర్ మూవీ ఇమ్మోర్ట‌ల్ ఓటీటీ రిలీజ్‌డేట్ క‌న్ఫామ్ అయ్యింది. అక్టోబ‌ర్ 30 నుంచి సోనీలివ్ ఓటీటీలో త‌మిళంతో పాటు తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమాలో నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్ హీరోగా న‌టించాడు.

N

News | Published On Oct 23, 2026, 7.48 pm IST

Kayadu Lohar | క‌య‌దు లోహ‌ర్ రొమాంటిక్ హార‌ర్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది – ప్రేమించిన అమ్మాయి ర‌క్త‌పిశాచి అని తెలిస్తే!
Advertisement

Kayadu Lohar |  నేష‌న‌ల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాష్ కుమార్ హీరోగా న‌టించిన ఇమ్మోర్ట‌ల్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. రొమాంటిక్ హార‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌రియ‌ప్ప‌న్ చిన్నా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఐదు భాష‌ల్లో...

వెరైటీ రొమాంటిక్ హార‌ర్ మూవీగా ఆడియెన్స్‌ను మెప్పించిన ఇమ్మోర్ట‌ల్ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 30 నుంచి సోనీలివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. త‌మిళంతో తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రిలీజ్ అవుతోంది.

ప్ర‌మోష‌న్స్‌కు దూరం...

ఐదు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఇమ్మోర్ట‌ల్ మూవీ ప‌ది కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. క‌య‌దు లోహ‌ర్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు కాన్సెప్ట్ కొత్త‌గా ఉందంటూ టాక్ రావ‌డంతో నిర్మాత‌ల‌కు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌కు క‌య‌దు లోహ‌ర్ దూరంగా ఉండ‌టం వివాదానికి దారితీసింది. ఆమెపై ద‌ర్శ‌క‌నిర్మాత‌లు బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇమ్మోర్ట‌ల్ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ అందించారు.

ర‌క్త‌పిశాచి...

మ్యాగీ (జీ.వీ. ప్రకాశ్ కుమార్) హైద‌రాబాద్‌లోని ఓ ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తుంటాడు. తక్కువ అద్దెకు ఓ రూమ్‌ కోసం వెతుకుతున్న అతడికి సింధు (కయాదు లోహర్) పరిచయమవుతుంది. రెంట్ షేరింగ్‌లో త‌న ఫ్లాట్‌లో ఉండొచ్చ‌ని అంటుంది. త‌క్కువ టైమ్‌లోనే సింధుతో ప్రేమ‌లో ప‌డ‌తాడు మ్యాగీ. ఆమెకు త‌న ప్రేమ‌ను వ్య‌క్తం చేయాల‌ని అనుకునే లోపే ప్రియురాలి గురించి అత‌డికి ఓ షాకింగ్ నిజం తెలుస్తుంది. సింధు మ‌నిషి రూపంలో ఉన్న ర‌క్త పిశాచి, త‌న‌ను బ‌లి ఇవ్వ‌డానికే ప్రేమ‌లోకి దించింద‌ని గ్ర‌హిస్తాడు. వెయ్యేళ్ల క్రితం పుట్టి మ‌నుషుల‌తో పాటు జంతువుల ర‌క్తం తాగే సింధు రూపంలో ఉంద‌ని తెలుస్తుకుంటాడు? ఆ ర‌క్త‌పిశాచి బారి నుంచి మ్యాగీ ఎలా ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డ్డాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement