Bandla Ganesh | ఆస్తి వేలం కేసులో బండ్ల గణేష్‌కు షాకిచ్చిన హైకోర్టు
హైదరాబాద్‌లోని ఆస్తి వేలం కేసులో బండ్ల గణేష్‌కు వ్యతిరేకంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై బండ్ల గణేష్ రియాక్ట్ అయ్యారు. అక్రమంగా తన ఆస్తిని బ్యాంకు అధికారులు విక్రయించారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
Entertainment | Published On Jul 4, 2026, 10.30 am IST
Bandla Ganesh | టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు హైకోర్టు షాకిచ్చింది. హైదరాబాద్‌లోని బండ్ల గణేష్‌కు చెందిన ఆస్తి వేలం చట్టబద్ధంగానే జరిగిందంటూ తీర్పు ఇచ్చింది. శ్రీ పరమేశ్వర ఫౌల్ట్రీ ఫామ్ కోసం బండ్ల గణేష్‌తో పాటు ఆయన సోదరుడు కలిసి యూనియన్ బ్యాంకు నుంచి రుణాలు తీసుకున్నారు. ఈ రుణాల కోసం హైదరాబాద్ షేక్‌పేట్‌లోని 500 గజాల నివాస భవానాన్ని తాకట్టుగా పెట్టారట. ఈ అప్పులను సకాలంలో చెల్లించకపోవడంతో 2019 సర్ఫేసీ యాక్ట్ కింద బ్యాంకు ....నివాస భవానాన్ని స్వాధీనం చేసుకున్న బ్యాంకు వేలం వేసింది. ఈ వేలంలో ఆస్తిని 8.51 కోట్లకు విక్రయించింది.
ట్రిబ్యూనల్...
అయితే ఈ వేలాన్ని రద్దు చేయాలంటూ బండ్ల గణేష్ డీఆర్ ట్రిబ్యూనల్‌ను ఆశ్రయించారు. అతడి పిటిషన్‌ను స్వీకరించిన ట్రిబ్యూనల్ వేలాన్ని రద్దు చేసింది. వేలం ద్వారా వచ్చిన డబ్బును యజమానులకే ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పుపై బ్యాంకు వర్గాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బ్యాంకు పిటిషన్‌పై విచారణను చేపట్టిన హైకోర్టు ట్రిబ్యూనల్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టిపడేసింది. బ్యాంకు చేపట్టిన వేలం ప్రక్రియ చట్ట ప్రకారమే జరిగిందని అన్నది.
సుప్రీంకోర్టును ఆశ్రయిస్తా...
హైకోర్టు తీర్పుపై బండ్ల గణేష్ స్పందించారు.మార్కెట్ విలువ కంటే చాలా తక్కువ ధరకే అక్రమంగా బ్యాంకు అధికారులు తన ఆస్తిని విక్రయించారని బండ్ల గణేష్ అన్నారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. న్యాయవ్యవస్థపై తనకు నమ్మకం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.
తాజావార్తలు
- ●ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు
- ●Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు
- ●Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి
- ●Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..
- ●Laptop | ఆఫీస్ పనికోసం ఎంట్రీ లెవల్ ల్యాప్‌టాప్ కొనాలని చూస్తున్నారా.. ఈ 5 మోడల్స్‌పై లుక్కేయండి..
- ●Kashi Vishwanath temple | కాశీ విశ్వనాథ్ ఆలయం వద్ద కాల్పుల కలకలం.. ముగ్గురికి గాయాలు

ITI Admissions | ఐటీఐ అడ్మిషన్లు.. జూలై 10 వరకు దరఖాస్తు గడువు పొడిగింపు

Trisha | తల్లి బర్త్‌డేను సెలబ్రేట్ చేసిన త్రిష - 70 ఏళ్లు అంటే నమ్మలేకపోతున్నామంటూ నెటిజన్ల కామెంట్లు

Jupally Krishna Rao | నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు దక్కిన గౌరవం: మంత్రి జూపల్లి

Gold And Silver Prices Today | స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. పెట్టుబడిదారులకు మంచి సమయం..






