Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ – అధ్యక్ష పదవికి పోటీ
తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సికల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ నిలవబోతున్నాడు. ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశాడు. సెప్టెంబర్ 6న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరుగనున్నాయి.
Entertainment | Published On Aug 25, 2026, 2.54 pm IST
Bandla Ganesh | ఇటీవలే కూతురు పెళ్లితో బండ్ల గణేష్ పేరు తెలుగు రాష్ట్రాల్లో తెగ వినిపించింది. బండ్ల గణేష్ కూతురు జనని పెళ్లి వేడుకకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగవైభవంగా కూతురు పెళ్లి జరిపించాడు బండ్ల గణేష్.
ప్రెసిడెంట్‌గా...
తాజాగా బండ్ల గణేష్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. త్వరలో జరుగనున్న తెలుగు ఫిల్మ్‌ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో అతడు నిలవబోతున్నాడు. అధ్యక్ష పదవికి బండ్ల గణేష్ నామినేషన్ వేశాడు. ఈ నిర్మాతల మండలి ఎన్నికల్లో బండ్ల గణేష్‌కు ప్రత్యర్థిగా మరో సీనియర్ ప్రొడ్యూసర్ సీ కళ్యాణ్ పోటీచేయబోతున్నాడు. అధ్యక్ష పదవికి బండ్ల గణేష్‌తో పాటు సీ కళ్యాణ్ నామినేషన్లు వేశారు. ఈ ఎన్నికల్లో బండ్ల గణేష్‌ను దిల్ రాజు సారథ్యంలోని యాక్టివ్ తెలుగు ప్రొడ్యూసర్ గిల్డ్ సపోర్ట్ చేస్తున్నట్లు సమాచారం. వైస్ ప్రెసెడెంట్ పదవి కోసం మోహన్ వడ్లపట్ల, కేఎల్ దామోదర ప్రసాద్, జీవితా రాజశేఖర్‌తో పాటు భరత్ చౌదరి నామినేషన్లు వేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ఆగస్ట్ 28ని తుది గడువుగా నిర్ణయించారు. సెప్టెంబర్ 6న ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికలు జరుగనున్నాయి.
పదేళ్లు దాటిపోయింది....
నిర్మాతగా బండ్ల గణేష్ సినిమా చేసి పదేళ్లు దాటిపోయింది. 2015లో వచ్చిన ఎన్టీఆర్ టెంపర్ తర్వాత సినిమా నిర్మాణానికి దూరమయ్యారు. యాక్టివ్ ప్రొడ్యూసర్‌గా లేని బండ్ల గణేష్.... నిర్మాతల మండలి ఎన్నికల్లో పోటీ చేయబోతుండటం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కమెడియన్ కమ్ ప్రొడ్యూసర్....
కమెడియన్‌గా బండ్ల గణేష్ కెరీర్ ప్రారంభమైంది. వినోదం, ఆహ్వానం, సింధూరం, చూడాలని ఉంది, సమరసింహారెడ్డి, శిమమణితో పాటు తెలుగులో వందకుపైగా సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు. రవితేజ ఆంజేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. పవన్ కళ్యాణ్ తీన్‌మార్, గబ్బర్‌సింగ్, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో, రామ్‌చరణ్ గోవిందుడు అందరివాడేలే సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు బండ్ల గణేష్.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు
- ●MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న
- ●Bengaluru Teenage Suicide Attempt | ఇన్‌స్టా ప్రేమ.. పెళ్లికి నో చెప్పిన పేరెంట్స్: ఐదంతస్తుల భవనమెక్కిన 15 ఏళ్ల బాలుడు, ఆ తర్వాత ఏం జరిగిందంటే?
- ●Toxic | యశ్ టాక్సిక్ టికెట్ ధరల పెంపు - జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం - కానీ ఓ కండీషన్

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు

Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి

TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

MP Chamala Kirankumar Reddy | గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌కు అనుమతిచ్చి రేవంత్‌కు ఎందుకివ్వలే: ఎంపీ చామల ప్రశ్న






