Balakrishna | నారా లోకేష్ క్లాప్‌తో మొదలైన బాలకృష్ణ కొత్త సినిమా – స్పెషల్ అట్రాక్షన్‌గా నందమూరి తేజస్విని
బాలకృష్ణ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియన్ మూవీ గురువారం అమరావతిలో ప్రారంభమైంది. ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుకలో ఏపీ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. నందమూరి బాలకృష్ణ కూతురు తేజస్విని ఈ లాంఛింగ్ ఈవెంట్‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
Entertainment | Published On Jun 25, 2026, 11.30 am IST
Balakrishna | సినిమాల స్పీడులో యంగ్ హీరోలతో పోటీపడుతున్నారు బాలకృష్ణ. డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేస్తోన్న సినిమా షూటింగ్ పూర్తికాకముందే మరో కొత్త ప్రాజెక్ట్‌ను సెట్స్‌పైకి తీసుకొచ్చారు. బాలకృష్ణ హీరోగా కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మూవీ గురువారం అమరావతిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సినిమా ఓపెనింగ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా ఏపీ మంత్రి, బాలకృష్ణ అల్లుడు నారా లోకేష్ హాజరయ్యారు. మామ పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కూతురు నందమూరి తేజస్విని కెమెరా స్విఛాన్ చేశారు.
ఆగస్ట్ నుంచి....
బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్లుగా పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా డైరెక్టర్ కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నారు. ఆగస్ట్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతుంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 112వ సినిమా ఇది. యువసుధ, ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలోనే నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను వెల్లడించనున్నారు.
కాజల్ అగర్వాల్ హీరోయిన్...
ప్రస్తుతం గోపీచంద్ మలినేని సినిమాతో బాలకృష్ణ బిజీగా ఉన్నారు. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్‌తో దేవర 2 చేయాల్సింది డైరెక్టర్ కొరటాల శివ. కానీ ప్రశాంత్ నీల్‌తో ఎన్టీఆర్ చేస్తోన్న డ్రాగన్ షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ గ్యాప్‌లో బాలకృష్ణ సినిమాను కమిటయ్యారు.

ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..
- ●Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు
- ●GTA 6 | గేమర్లకు గుడ్ న్యూస్.. జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, ధరలు ఇవే!
- ●India Bound Ships | ఎల్పీజీ, ఎల్ఎన్జీ, ఎరువులతో.. హర్మూజ్‌ను దాటి భారత్‌వైపు వస్తున్న 30 భారీ నౌకలు
- ●Priyadarshi | ప్రియదర్శి ఇడుపుకాయితం గ్రాండ్‌గా లాంఛ్ - టైటిల్ రివీల్ చేసిన లోకేష్ కనగరాజ్

Emergency | ఎన్సీఈఆర్టీ చరిత్రాత్మక నిర్ణయం.. 9వ తరగతి బుక్‌లో ఎమర్జెన్సీపై పాఠం

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.27వేలు తగ్గిన బంగారం ధర.. ఈక్విటీల వైపు ప్రజల మొగ్గు..

Vegetable Prices | వంటింట్లో ధరల మంట.. సామాన్యులకు చుక్కలుచూపిస్తున్న కూరగాయలు, కోడి గుడ్లు

GTA 6 | గేమర్లకు గుడ్ న్యూస్.. జీటీఏ 6 ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, ధరలు ఇవే!






