Balakrishna Daughter | హీరోయిన్‌గా బాలకృష్ణ కూతురు – ఊహించని రోల్‌తో ఎంట్రీ
నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ బాటలోనే చాలా మంది వారసులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. కానీ ఫస్ట్ టైమ్ ఓ వారసురాలు టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు సమాచారం. బాలకృష్ణ చిన్నకూతురు తేజస్విని నటిగా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయబోతుంది.
Entertainment | Published On Jul 31, 2026, 2.34 pm IST
Balakrishna Daughter | తెలుగు సినీ పరిశ్రమలో వారసులతో పోలిస్తే వారసురాళ్లు చాలా తక్కువే కనిపిస్తారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోలుగా కొనసాగుతోన్న వారందరూ వారసత్వంతోనే ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. వారసురాళ్లు మాత్రం ఎవరూ హీరోయిన్లుగా సక్సెస్ కాలేదు. ఇప్పుడిప్పుడే ఈ ట్రెండ్ మారుతోంది. తమ ఇంటి అమ్మాయిలను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి స్టార్స్ రెడీ అంటున్నారు.
మెసేజ్ ఓరియెంటెడ్...
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు బాలకృష్ణ కూతురు తేజస్విని నటిగా అరంగేట్రం చేయబోతుంది. హీరోయిన్‌గా ఓ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ కథతో ఈ సినిమా ఉండబోతున్నట్లు చెబుతున్నారు. స్పోర్ట్స్ డ్రామా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ఓ పవర్‌ఫుల్ రోల్‌ను తేజస్విని కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. కథతో పాటు తన పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ నచ్చి ఈ సినిమాలో నటించడానికి తేజస్విని అంగీకరించినట్లు సమాచారం. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాలో కొత్త నటీనటులు లీడ్ రోల్స్ చేయబోతున్నరని సమాచారం.
అఖండ 2 ప్రజెంటర్...
తెరముందు కాకుండా తెర వెనుక పనిచేసిన అనుభవం తేజస్విని చాలానే ఉంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రొడక్షన్ పనులన్నీ తేజస్వినినే చూసుకుంది. బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ 2 సినిమాకు ప్రజెంటర్‌గా వ్యవహరించింది. అనుభవంతోనే త్వరలో ఓన్ ప్రొడక్షన్ హౌస్‌ను లాంఛ్ చేసే ఆలోచనలో తేజస్విని ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఫిదా సినిమాలోని సారంగదరియా పాటకు తేజస్విని డ్యాన్స్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.
మోక్షజ్ఞ కంటే ముందే...
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో ఓ సినిమాను అనౌన్స్‌చేశారు. కానీ స్క్రిప్ట్ విషయంలో బాలకృష్ణతో పాటు మోక్షజ్ఞ సంతృప్తిగా లేకపోవడంతో ఓపెనింగ్ ఈవెంట్‌కు ముందు ఈ సినిమా ఆగిపోయింది. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కోసం ప్రస్తుతం కథలతో పాటు దర్శకుడి కోసం బాలకృష్ణ అన్వేషణ సాగిస్తోన్నారు. . మోక్షజ్ఞ కంటే ముందుగానే తేజస్విని తెలుగు తెరకు పరిచయం కాబోతుండటం ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ramayana | రామాయణలో హీరోయిన్‌గా ఫస్ట్ ఛాయిస్ సాయిపల్లవి కాదు – సీత పాత్రను మిస్ చేసుకున్న కేజీఎఫ్ బ్యూటీ
జులై 30, 2026

Tollywood | మణిరత్నం, రామ్‌గోపాల్ వర్మ కలిసి కథను అందించిన ఒకే ఒక తెలుగు మూవీ ఏదో తెలుసా?
జులై 30, 2026

Chiranjeevi | షూటింగ్ పూర్తయిన రెండేళ్ల తర్వాత థియేటర్లలోకి చిరంజీవి విశ్వంభర – త్రిష సీన్లు కట్?
జులై 30, 2026
తాజావార్తలు
- ●Godavari Fierce Flood | గోదావరి ఉగ్రరూపం.. ఇసుక పాయల్లో చిక్కుకున్న 38 మంది
- ●Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి
- ●Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు
- ●OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..
- ●Delhi Police | మా నాన్న యూనిఫామ్ రక్తంతో తడిసిపోయింది.. మాకూ న్యాయం చేయండి.. మీడియా ముందుకొచ్చిన గాయపడ్డ పోలీసు కుటుంబాలు
- ●Income Tax | రూ.50వేలకు పైగా విలువైన వస్తువును లేదా డబ్బును గిఫ్ట్‌గా అందుకున్నారా.. ఇలా చేస్తే పన్ను ఉండదు..

Godavari Fierce Flood | గోదావరి ఉగ్రరూపం.. ఇసుక పాయల్లో చిక్కుకున్న 38 మంది

Xi Jinping | భారత పర్యటనకు చైనా అధ్యక్షుడు.. గల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారి

Cyber Cheeting | ఎక్కువ లాభాలోస్తాయని ఆశ చూపారు.. అప్పనంగా రూ.33 లక్షలు కాజేశారు

OnePlus N6x | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో వచ్చిన వన్‌ప్లస్ ఎన్6ఎక్స్ ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్లు అదిరాయి..



