త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Balakrishna | ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ – ఒక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ – మ‌రోటి డిజాస్ట‌ర్ – బాల‌కృష్ణ రేర్ రికార్డ్‌

బాల‌కృష్ణ హీరోగా న‌టించిన బంగారు బుల్లోడు, నిప్పుర‌వ్వ సినిమాలు ఒకే రోజు థియేట‌ర్ల‌లో విడ‌ద‌ల‌య్యాయి. ఈ సినిమాల్లో బంగారు బుల్లోడు హిట్ట‌వ్వ‌గా....నిప్పుర‌వ్వ ఫెయిల్యూర్‌గా నిలిచింది.

N

Entertainment | Published On Dec 30, 2025, 6.41 pm IST

Balakrishna | ఒకే రోజు  రెండు సినిమాలు రిలీజ్ –  ఒక‌టి బ్లాక్‌బ‌స్ట‌ర్ – మ‌రోటి డిజాస్ట‌ర్ – బాల‌కృష్ణ రేర్ రికార్డ్‌
Advertisement

Balakrishna | ఒక‌ప్పుడు టాలీవుడ్‌లోని అగ్ర హీరోలు ఏడాదికి రెండు, మూడు సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేవారు. కానీ ఇప్పుటి హీరోలు ట్రెండ్ మార్చేశారు. రెండు, మూడేళ్ల‌కు ఓ సినిమా చేస్తున్నారు. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌, పెరిగిన బ‌డ్జెట్‌లు, ఇమేజ్ లెక్క‌ల కార‌ణంగా అగ్ర హీరోల సినిమాలు చాలా రోజులు సెట్స్‌పైనే ఉంటున్నాయి. స్టార్ హీరోల ఒక్కో సినిమా రిలీజ్‌ల మ‌ధ్య గ్యాప్ కొన్ని సార్లు నెల‌ల‌ నుంచి ఏళ్ల వ‌ర‌కు ఉంటుంది. కానీ ఓ టాలీవుడ్ అగ్ర హీరో న‌టించిన రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. బాక్సాఫీస్ వ‌ద్ద త‌న సినిమాతో తానే పోటీప‌డ్డారు. ఆ హీరో ఎవ‌రో కాదు బాల‌కృష్ణ‌. ఆయ‌న హీరోగా న‌టించిన బంగారు బుల్లోడు, నిప్పుర‌వ్వ సినిమాలు 1993 సెప్టెంబ‌ర్ 3న థియేట‌ర్ల‌లోకి వ‌చ్చాయి. ఈ రెండు సినిమాల్లో బంగారు బుల్లోడు బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌వ‌గా...నిప్పుర‌వ్వ ప‌రాజయం పాలైంది. రిజ‌ల్ట్ సంగ‌తి ప‌క్క‌న‌పెడితే ఒకే రోజు రెండు సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన హీరోగా బాల‌కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు.

బంగారు బుల్లోడు...

బంగారు బుల్లోడు సినిమాకు ర‌విరాజా పినిశెట్టి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో ర‌వీనా టాండ‌న్‌, ర‌మ్య‌కృష్ణ హీరోయిన్లుగా న‌టించారు. స‌త్య‌మూర్తి క‌థ‌ను అందించిన ఈ సినిమాను సీనియ‌ర్ నిర్మాత వీబీ రాజేంద్ర‌ప్ర‌సాద్ నిర్మించారు. బంగారు బుల్లోడు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌గా నిలిచింది. ఈ సినిమాలోని పాట‌లు అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. స్వాతిలో ముత్య‌మంతా, గుడివాడ గుమ్మ‌రో సాంగ్స్ అప్ప‌ట్లో ఊపు ఊపేశాయి. ప‌ల్లెటూరి యువ‌కుడిగా బాల‌కృష్ణ న‌ట‌న‌, ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఆయ‌న కెమిస్ట్రీ ఈ సినిమా విజ‌యంలో కీల‌కంగా నిలిచాయి.

క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌...

బంగారు బుల్లోడుతో పాటు అదే రోజు పోటీగా రిలీజైన నిప్పుర‌వ్వ‌ మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది. బొగ్గు గ‌నుల నేప‌థ్యంలో మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా నిప్పుర‌వ్వ రూపొందింది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో జ‌రిగిన ఓ ప్ర‌మాదం కార‌ణంగా రిలీజ్ ఆల‌స్య‌మైంది. దాంతో బంగారుబుల్లోడుకు పోటీగా విడుద‌ల చేయాల్సివ‌చ్చింది. నిప్పుర‌వ్వ మూవీకి కోదండ‌రామిరెడ్డి మ్యూజిక్ అందించారు. నిప్పుర‌వ్వ మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అందించ‌డం గ‌మ‌నార్హం. ఈ సినిమాలో బాల‌కృష్ణ‌కు జోడీగా విజ‌య‌శాంతి హీరోయిన్‌గా న‌టించింది. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన 17వ సినిమా ఇది. విజ‌య‌శాంతి భ‌ర్త శ్రీనివాస ప్ర‌సాద్ ప్రొడ్యూస్ చేశారు.

 

ALSO READ Mega Victory Song | సంక్రాంతి అదిరిపోద్ది – స్టెప్పుల‌తో ఇర‌గ‌దీసిన‌ చిరు, వెంకీ – మెగా విక్ట‌రీ సాంగ్ రిలీజ్‌
Advertisement

తాజావార్తలు

Advertisement