Akhanda 2 | అఖండ 2 హిందీ కలెక్షన్స్ – ప్రమోషన్ ఖర్చులు కూడా రాలేదుగా – ఎపిక్ డిజాస్టర్
బాలకృష్ణ అఖండ 2 హిందీలో ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో కేవలం 75 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
Entertainment | Published On Dec 23, 2025, 6.08 pm IST
బాలకృష్ణ
Akhanda 2 | అఖండ 2తో ఫస్ట్ టైమ్ పాన్ ఇండియన్ లీగ్‌లోకి అడుగుపెట్టిన నందమూరి హీరో బాలకృష్ణ (Balakrishna) ఊహించని షాక్ తగిలింది. తెలుగులో కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపించిన ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ మిగిలిన భాషల్లో పూర్తిగా తేలిపోయింది. ప్రస్తుతం డివోషనల్ సినిమాల ట్రెండ్ బాగా నడుస్తోంది. భాషా భేదాలతో సంబంధం లేకుండా భక్తి కథలతో తెరకెక్కిన సినిమాలు అన్ని ఇండస్ట్రీలలో భారీగా వసూళ్లను రాబడుతున్నాయి. అఖండ 2తో భక్తి సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేశారు. శివతత్వం, సనాతన ధర్మం అంశాలకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతారని భావించారు. కానీ మేకర్స్ ప్రయత్నం పూర్తిగా బెడిసికొట్టింది. మిగిలిన భాషల్లో కనీసం ప్రమోషన్ ఖర్చులను కూడా అఖండ 2 రాబట్టలేకపోయింది.
పెద్ద షాక్...
ముఖ్యంగా అఖండ 2 హిందీ వెర్షన్ ఎపిక్ డిజాస్టర్‌గా నిలిచింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో బాలకృష్ణ మూవీ కేవలం 75 లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి మేకర్స్‌తో పాటు డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద షాకిచ్చింది. అఖండ 2 హిందీ ప్రమోషన్స్ కోసం బాలకృష్ణ చాలానే కష్టపడ్డారు. యూపీ సీఏం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు ప్రముఖులను కలిశారు. ముంబైలో ఓ పెద్ద ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. హిందీ మీడియాకు బాలకృష్ణతో కలిసి బోయపాటి స్పెషల్ ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఇవేవీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేకపోయాయి. కనీసం ప్రింట్, ప్రమోషన్ ఖర్చులు కూడా గిట్టుబాటు కాలేదని సమాచారం. అంతే కాకుండా నార్త్ ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకొని కథలో కొన్ని మార్పులు కూడా చేశారు డైరెక్టర్ బోయపాటి శ్రీను. స్పెషల్‌గా ఎలివేషన్ సీన్లను యాడ్ చేశారు. అవి తెలుగు వెర్షన్‌కు మైనస్‌గా మారాయి. దాంతో సినిమా పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా మారిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కేవలం తెలుగులోనే ఈ సినిమాను రిలీజ్ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదని అంటున్నారు.
లాభాల్లోకి అడుగుపెట్టాలంటే...
వరల్డ్ వైడ్‌గా పదకొండు రోజుల్లో అఖండ 2 మూవీ 112 కోట్ల వరకు గ్రాస్, 65 కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టింది. లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకో నలభై కోట్లకుపైనే ఈ సినిమా కలెక్షన్స్ రాబట్టాల్సివుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే అవతార్ 3తో పోటీ కారణంగా అఖండ 2 కు థియేటర్లు తగ్గాయి. మరోవైపు ఈ వారం ఏడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ సినిమాల ఎఫెక్ట్ అఖండ 2పై గట్టిగానే పడనున్నట్లు తెలుస్తోంది.
సోమవారం రోజు ఈ సినిమా అతి కష్టంగా 50 లక్షల షేర్ కలెక్షన్స్ రాబట్టింది. రోజురోజుకు కలెక్షన్స్ తగ్గుతున్న నేపథ్యంలో అఖండ 2 ను తీసేసి ఈ వారం రిలీజయ్యే కొత్త సినిమాలకు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు కేటాయించే అవకాశం కనిపిస్తోంది. అఖండ 2 నిర్మాతలకు గట్టిగానే నష్టాలను మిగిల్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖండ 2 మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. అఖండ కు సీక్వెల్‌గా డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | నయన్ పోయే…కాజల్ వచ్చే – బాలకృష్ణ సినిమాలో ట్విస్ట్
మే 2, 2026

Kajal Aggarwal | నయనతార కాదు.. బాలకృష్ణ-గోపీచంద్ మూవీలో హీరోయిన్‌గా కాజల్ ఫిక్స్..!
ఏప్రిల్ 21, 2026

Tollywood | చిరు, వెంకీ , నాగ్, బాలయ్య కలిసి నటించిన ఒకే ఒక తెలుగు సినిమా ఏదో తెలుసా!
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



