Akhanda 2 Review | అఖండ 2 రివ్యూ – నో లాజిక్… ఓన్లీ బాలయ్య మ్యాజిక్…
బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ 2 శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సనాతన ధర్మం అనే పాయింట్ యాక్షన్ అంశాలు జోడించి రూపొందించిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Entertainment | Published On Dec 12, 2025, 8.44 am IST
అఖండ 2
Akhanda 2 Review | బాలకృష్ణ(Balakrishna), డైరెక్టర్ బోయపాటి శ్రీనులది టాలీవుడ్లో(Tollywood) సక్సెస్ఫుల్ కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన నాలుగో మూవీ అఖండ 2. అఖండకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటించారు. రిలీజ్కు ముందు అఖండ 2 వాయిదాపడటం, ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో గత కొద్ది రోజులుగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ వచ్చింది. అన్ని అడ్డంకులను దాటుకొని శుక్రవారం రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే?
అఘోరా పోరాటం...
రుద్ర సికిందర్ ఓ అఘోరా(బాలకృష్ణ). సనాతన ధర్మాన్ని కాపాడటమే అతడి లక్ష్యం. వేదాల గొప్పతనాన్ని ప్రజలకు తెలియజేస్తుంటాడు. ఇండో - చైనా బోర్డర్లో జరిగిన యుద్ధంలో చైనా ఆర్మీ జనరల్ కొడుకు మరణిస్తాడు. తన కొడుకు చావుకు కారణమైన భారత్పై చైనా ఆర్మీ జనరల్ ప్రతీకారంతో రగిలిపోతుంటాడు. ప్రతిపక్ష నేత అజిత్ ఠాకూర్ (కబీర్ సింగ్ దుహాన్) సహాయంతో బయోవార్కు ప్లాన్ చేస్తాడు. మహాకుంభమేళా జరిగే నదిలో ఓ కెమికల్ కలుపుతాడు. ఆ కెమికల్ వల్ల నదిలో స్నానం చేసిన భక్తులంతా వైరస్ బారిన పడతారు. కుంభమేళ ఘటనను అడ్డుపెట్టుకొని దేవుడులేడని ప్రజలను అజిత్ ఠాకూర్ నమ్మిస్తాడు. బయోవార్కు విరుగుడుగా ఎమ్మెల్యే బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) కూతురు యంగ్ సైంటిస్ట్ జనని (హర్షాలీ మల్హోత్రా) వ్యాక్సిన్ కనిపెడుతుంది. ఈ నిజం తెలుసుకున్న అజిత్ ఠాకూర్ జననిపై ఎటాక్ చేస్తాడు. సైంటిస్ట్ బృందంలోని అందరిని చంపేస్తాడు. కానీ జనని మాత్రం వారి బారి నుంచి తప్పించుకుంటుంది. జననిని రుద్ర సికిందర్ కాపాడుతాడు. జనని తండ్రి బాలమురళీకృష్ణకు అఘోరాకు ఉన్న సంబంధం ఏమిటి? జనని ఆపదలో ఉన్న విషయం అఘోరాకు ఎలా తెలిసింది. సనాతన ధర్మం కాపాడటం కోసం రుద్ర సికందర్ ఏం చేశాడు? దుష్టశక్తులతో అఘోరాను ఎదురించిన నేత్ర ఎవరు? మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన బాలమురళీకృష్ణ కథేమిటి? అన్నదే అఖండ 2 సినిమా...
నో లాజిక్స్...
బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటేనే లాజిక్లతో పని ఉండదు. స్టోరీ కంటే హీరోయిజం, ఎలివేషన్లు, యాక్షన్తోనే మ్యాజిక్ చేస్తూ గత సినిమాలతో ఈ కాంబో ప్రేక్షకులను మెప్పించింది. అఖండ 2 కూడా అదే ఫార్ములాలో సాగుతుంది. కంప్లీట్ అఘోరా క్యారెక్టర్ను బేస్ చేసుకొని డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ సినిమాను తెరకెక్కించారు.
మైథాలజీ ట్రెండ్...
ప్రస్తుతం మైథాలజీ కథలు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. భక్తి ఎమోషన్కు ఇండో చైనా బోర్డర్ గొడవలను మిక్స్ చేస్తూ అఖండ 2 సాగుతుంది. అఖండ కు కొనసాగింపుగానే ఈ సినిమా మొదలవుతుంది. బోయపాటితో చేసిన ప్రతి సినిమాలో బాలకృష్ణ డ్యూయల్ రోల్లో కనిపించారు. ఇందులోనూ అదే సెంటిమెంట్ను రిపీట్ చేశారు. అఘోరా చైనాతో యుద్ధం చేస్తుంటే.. మురళీకృష్ణ.డ్రగ్స్ దందాను అంతం చేసేందుకు పాటుపడుతుంటాడు.హీరోలిద్దరిని పరిచయం చేసే సీన్లు ఫక్తు బోయపాటి మార్కు యాక్షన్ సీన్లతోనే సాగుతాయి. వాటిలో ఎలివేషన్లు ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నారు. ఆడియెన్స్కు మంచి జోష్ తెప్పించేలా ఫైట్స్ డిజైన్ చేసుకున్నారు. ఆ తర్వాత చైనా, టిబెట్ గొడవలు, బయోవార్ కుట్రలతో కథను నడిపించారు. జననిని చంపడానికి అజిత్ ఠాకూర్ ప్రయత్నించడం, ఆమెను కాపాడటం కోసం అఘోరా ఎంట్రీతో ఇంటర్వెల్ అదిరిపోతుంది. ఫస్ట్ హాఫ్లో కాస్త సాగతీతగా అనిపించినా సెకండాఫ్ మాత్రం బాలకృష్ణ రుద్రతాండవం చేశారు. శివతత్వం, హైందరసనాతన ధర్మం గొప్పతనాన్ని గురించి బాలకృష్ణ చెప్పే సీన్లు బాగున్నాయి. కొన్ని చోట్ల అవసరం లేకపోయినా డైలాగ్స్ చెప్పించడం క్లాస్ ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.
ఫ్యాన్స్ కోసమే...
బాలకృష్ణను ఫ్యాన్స్ ఎలా చూడాలని అనుకుంటారు? ఆయన సినిమా నుంచి ఏం కోరుకుంటారో అనే లెక్కలు వేసుకొని అందుకు తగ్గట్లే సెకండాఫ్ను డిజైన్ చేశాడు. లాజిక్లు కోరుకుంటే ఈ సినిమా చూడలేం. త్రిశూలం హెలికాప్టర్, మిషన్గన్ను బాలయ్య తిప్పేయడం, వందలాది మంది ఆర్మీ సైన్యాన్ని బాలయ్య ఒంటిచేత్తో ఏరేయడం...లాంటి సీన్లు ఈ సినిమాలో చాలానే కనిపిస్తాయి.
సింహా, లెజెండ్, అఖండ సినిమాల్లో యాక్షన్తో పాటు ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. అఖండ 2లో మాత్రం బోయపాటి శ్రీను ఎక్కువగా యాక్షన్ సీన్లపైనే దృష్టిపెట్టారు. కథలో చాలా అంశాలు టచ్ చేయడంతో దేనికి సరిగ్గా స్కోప్ ఇవ్వని ఫీలింగ్ కలుగుతుంది. బాలమురళీకృష్ణ ట్రాక్, హీరోయిన్లతో అతడి డ్యూయెట్ బలవంతంగా కథలో ఇరికించిన ఫీలింగ్ కలుగుతుంది.
తమన్ మ్యూజిక్...
అఘోరా పాత్రలో బాలకృష్ణ జీవించాడు. ఈ పాత్రలో ఆయన ఆహార్యం, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. బాలమురళీకృష్ణ క్యారెక్టర్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్లో సాగింది. హీరోయిన్ సంయుక్త మీనన్కు కథలో ఎలాంటి ప్రాధాన్యం లేదు. సడెన్గా ఆమె పాత్ర మధ్యలోనే కనిపించకుండాపో్తుంది. హర్షాలీ మల్హోత్రా సెట్ కాలేదు. ఈ సారి తమన్ మ్యూజిక్ కూడా తేలిపోయింది. బీజీఎమ్ ఎఫెక్టివ్గా లేదు. గ్రాఫిక్స్ నాసిరకంగా ఉన్నాయి.
అఖండ 2 బాలకృష్ణ ఫ్యాన్స్ను మాత్రమే మెప్పించే యాక్షన్ మూవీ. కథ, కథనాల గురించి ఆలోచించకుండా బాలకృష్ణ మ్యాజిక్ను ఎంజాయ్ చేయాలనుకునే వారిని ఆకట్టుకుంటుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



