త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

అఖండ 2 రిలీజ్‌పై కొన‌సాగుతున్నస‌స్పెన్స్ -డిసెంబ‌ర్‌లో వ‌స్తుందా? 2026కు షిప్ట‌య్యిందా?

N

Entertainment | Published On Dec 6, 2025, 2.31 pm IST

అఖండ 2 రిలీజ్‌పై కొన‌సాగుతున్నస‌స్పెన్స్ -డిసెంబ‌ర్‌లో వ‌స్తుందా? 2026కు షిప్ట‌య్యిందా?

అఖండ 2

Advertisement

అఖండ 2 రిలీజ్ ఎప్పుడ‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల‌తో పాటు అభిమానుల్లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. డిసెంబ‌ర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియ‌ల్ ఈష్యూస్ వ‌ల్ల చివ‌రి నిమిషంలో వాయిదాప‌డింది. వ‌న్ నేనొక్క‌డినే, ఆగ‌డు సినిమాల‌కు సంబంధించిన పాత అప్పుల విష‌యంలో 14 రీల్స్ నిర్మాత‌ల‌పై బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్ కేసు పెట్టింది. ఈ కోర్టు కేసు కార‌ణంగా అఖండ 2 రిలీజ్ వాయిదాప‌డింది.
అఖండ 2 రిలీజ్‌కు ఏర్ప‌డిన అడ్డంకుల‌ను ప‌రిష్క‌రించేందుకు గురువారం రాత్రి నుంచే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. దిల్‌రాజు, సురేష్‌బాబు లాంటి పెద్ద‌లు రంగంలోకి దిగిన‌ట్లు స‌మాచారం. ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్‌కు నిర్మాత‌ల‌కు మ‌ధ్య స‌యోధ్య కుదుర్చే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రిపారు. దిల్‌రాజు కొంత డ‌బ్బు స‌ర్ధుబాటు చేసిన‌ట్లు స‌మాచారం. రిలీజ్‌కు సంబంధించిన క్లియ‌రెన్స్‌లు దాదాపు వ‌చ్చాయ‌ట‌. లీగ‌ల్ ఇష్యూస్ కావ‌డంతో పూర్తిస్థాయిలో ప‌రిష్కారం కావ‌డానికి మ‌రికొంత టైమ్ ప‌ట్ట‌నుంద‌ని చెబుతున్నారు. మ‌రోవైపు స‌డెన్ పోస్ట్‌పోన్‌తో నిర్మాత‌ల‌పై డిస్ట్రిబ్యూట‌ర్లు ఆగ్ర‌హంతో ఉన్న‌ట్లు స‌మాచారం. ఈ పోస్ట్‌పోన్ వ‌ల్ల ఏర్ప‌డిన న‌ష్టాల‌ను భ‌ర్తీ చేయాలంటూ ప్రొడ్యూస‌ర్ల‌పై ఒత్తిడిని తీసుకొస్తున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. డిస్ట్రిబ్యూట‌ర్ల‌తో టాలీవుడ్ పెద్ద‌లు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రిష్కార‌మైన త‌ర్వాతే అఖండ 2 కొత్త రిలీజ్ డేట్‌ను ప్ర‌క‌టించే అవ‌కాశం క‌నిపిస్తోంది. డిసెంబ‌ర్ 12 లేదా డిసెంబ‌ర్ 25ల‌లో ఓ డేట్‌ను ఫైన‌ల్ చేస్తార‌ని అంటున్నారు. అఖండ 2 వ‌స్తే అదే డేట్‌కు రావాల్సిన చిన్న సినిమాల ప‌రిస్థితి ఏమిట‌న్న‌ది కూడా టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. డిసెంబ‌ర్ 12న ఆరు వ‌ర‌కు చిన్న సినిమాలు రిలీజ్ అవుతోన్నాయి. క్రిస్మ‌స్ బ‌రిలో శంబాల‌తో పాటు మ‌రికొన్ని కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ థియేట‌ర్ల‌లోకి రానున్నాయి. అఖండ 2 రిలీజైతే ఈ సినిమాల‌కు థియేట‌ర్లు దొర‌క‌డం క‌ష్ట‌మ‌వుతుంది. మ‌రోవైపు బుక్‌మై షోతో పాటు మ‌రికొన్ని ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో అఖండ 2....2026లో రిలీజ్ కాబోతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఈ మూవీ డిసెంబ‌ర్‌లో రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని మ‌రికొంద‌రు చెబుతున్నారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తే మంచిద‌నే చ‌ర్చ కూడా న‌డుస్తుంది. ఇప్ప‌టికే సంక్రాంతి బ‌రిలో ఏడు సినిమాలు ఉన్నాయి. అఖండ 2 కూడా రేసులో నిలిస్తే అన్ని సినిమాల‌కు న‌ష్టం త‌ప్ప‌ద‌ని అంటున్నారు. అఖండ 2 రిలీజ్ డేట్ పుకార్ల‌కు పుల్‌స్టాప్ ప‌డేదెప్పుడూ అన్న‌ది ఇంట్రెస్టింగ్‌గా మారింది. మ‌రో ఒక‌టి రెండు రోజుల్లో విడుద‌ల తేదీపై క్లారిటీ రానున్న‌ట్లు స‌మాచారం.

Advertisement

తాజావార్తలు

Advertisement