Akhanda 2 | అఖండ 2కు తొలగిన అడ్డంకులు – కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ – ఒక రోజు ఆలస్యంగా మోగ్లీ!
Akhanda 2 | అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఫిక్సయ్యింది. డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 11న ప్రీమియర్స్ ఉంటాయని మేకర్స్ ప్రకటించారు.
Entertainment | Published On Dec 10, 2025, 12.45 pm IST
అఖండ 2
అఖండ 2 రిలీజ్ డేట్ ఎప్పుడనే సస్పెన్స్‌కు తెరపడింది. అనుకున్నట్లుగానే డిసెంబర్ 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఓ పోస్టర్ ద్వారా కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. డిసెంబర్ 11న ప్రీమియర్స్ ఉంటాయని వెల్లడించారు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అఖండ 2 టికెట్ రేట్ల పెంపుతో పాటు ప్రీమియర్స్‌కు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. రిలీజ్ డేట్ వాయిదాపడటంతో మరోసారి ఈ అనుమతుల కోసం నిర్మాతలు అప్లై చేశారట. ఈ రోజు రివైజ్ జీవోలు రానున్నట్లు చెబుతున్నారు. గురువారం సాయంత్రం ప్రీమియర్స్‌తో అఖండ 2 తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
కలిసొచ్చిన వాయిదా...
వాయిదా కూడా అఖండ 2 కలిసివచ్చిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. గత నాలుగైదు రోజులుగా సోషల్ మీడియాలో పాటు ఇండస్ట్రీలో అఖండ 2 సినిమా గురించిన డిస్కషన్స్ ఎక్కువగా జరిగాయి. ఈ పబ్లిసిటీతో సినిమాపై ఉన్న బజ్ మరింత పెరిగిందని అంటున్నారు. ఇప్పటికే ఓవర్‌సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. డిసెంబర్ 5తో పోలిస్తే ఈ సారి బుకింగ్స్ జోరు పెరిగింది.
కాగా డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ చివరి నిమిషంలో వాయిదాపడటం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. వన్ నేనొక్కడినే, ఆగడు సినిమాల కోసం తీసుకున్న పాత అప్పులకు సంబంధించి అఖండ 2 నిర్మాతలపై బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టుకు వెళ్లింది. ఈ లీగల్ ఇష్యూ కారణంగా అఖండ 2 రిలీజ్ కాలేదు. బాలకృష్ణ కెరీర్‌లో రిలీజ్ ముగింట సినిమా పోస్ట్‌పోన్ కావడం ఇదే మొదటిసారి కావడంతో ఫ్యాన్స్ డిసపాయింట్ అయ్యారు. కాగా అడ్డంకులు తొలగి సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో ఖుషి అవుతున్నారు.
అఖండ 2 ఎఫెక్ట్ డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సిన చిన్న, మిడ్ రేంజ్ సినిమాలపై గట్టిగానే పడింది. సడెన్‌గా అఖండ 2 రేసులోకి రావడంతో సైక్ సిద్ధార్థ టీమ్ తమ సినిమాను జనవరి 1కి పోస్ట్‌పోన్ చేసుకుంది. డిసెంబర్ 12 రిలీజ్ కావాల్సిన మోగ్లీ ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13న థియేటర్లలోకి రాబోతుంది. మోగ్లీ కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
సంబంధిత వార్తలు

Kajal Aggarwal | నయన్ పోయే…కాజల్ వచ్చే – బాలకృష్ణ సినిమాలో ట్విస్ట్
మే 2, 2026

Kajal Aggarwal | లాయర్‌గా కాజల్ అగర్వాల్ – మూడు భాషల్లో ఇండియా స్టోరీ రిలీజ్
ఏప్రిల్ 27, 2026

Kajal Aggarwal | నయనతార కాదు.. బాలకృష్ణ-గోపీచంద్ మూవీలో హీరోయిన్గా కాజల్ ఫిక్స్..!
ఏప్రిల్ 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



