త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 OTT | నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి బాల‌కృష్ణ అఖండ 2 – ప్ర‌భాస్ రాజాసాబ్‌కు పోటీగా రిలీజ్‌!

Akhanda 2 OTT | బాల‌కృష్ణ అఖండ 2 మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైన నెల రోజేల్లోపే ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. ప్ర‌భాస్ రాజ్‌సాబ్‌కు పోటీగా బాల‌కృష్ణ మూవీ రిలీజ్ అవుతోంది.

N

Entertainment | Published On Dec 16, 2025, 9.40 am IST

Akhanda 2 OTT | నెల‌రోజుల్లోనే ఓటీటీలోకి బాల‌కృష్ణ అఖండ 2 – ప్ర‌భాస్ రాజాసాబ్‌కు పోటీగా రిలీజ్‌!

అఖండ 2

Advertisement

Akhanda 2 OTT |బాల‌కృష్ణ (Balakrishna) అఖండ 2 బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. అనేక అడ్డంకుల న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అఖండ 2 బాల‌కృష్ణ కెరీర్‌లోనే హ‌య్యెస్ట్ ఓపెనింగ్ రాబ‌ట్టిన టాప్ త్రీ సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. మూడు రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఎన‌భై కోట్ల‌కుపైగా గ్రాస్ , యాభై కోట్ల వ‌ర‌కు షేర్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. సోమ‌వారం నాటి క‌లెక్ష‌న్స్‌తో అఖండ 2 నైజాంతో పాటు మ‌రికొన్ని ఏరియాల‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ కానున్న‌ట్లు స‌మాచారం.
కాగా అఖండ 2 (Akhanda 2) థియేట‌ర్ల‌లో రిలీజైన నెల‌రోజుల్లోపే ఓటీటీలోకి రానున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ ద‌క్కించుకుంది. జ‌న‌వ‌రి 9న నెట్‌ఫ్లిక్స్‌లో (Netflix) అఖండ 2 రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తెలుగుతో పాటు త‌మిళం, హిందీ, మ‌ల‌యాలం, క‌న్న భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌.
థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు వారాల గ్యాప్ త‌ర్వాత ఓటీటీలో రిలీజ్ చేసేలా మేక‌ర్స్‌తో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం కుదుర్చుకుంద‌ట‌. ఫైనాన్షియ‌ల్ ఈష్యూస్ వ‌ల్ల డిసెంబ‌ర్ 5న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాప‌డింది. పోస్ట్‌పోన్‌తో సంబంధం లేకుండా నెట్‌ఫ్లిక్స్ మాత్రం ముందుగానే అనుకున్న డేట్‌కు అఖండ‌ను ఓటీటీలోకి తీసుకురాబోతుంద‌ట‌.

ప్రభాస్ తో పోటీ...
జ‌న‌వ‌రి 9న ప్ర‌భాస్ రాజాసాబ్‌తో పాటు ద‌ళ‌ప‌తి విజ‌య్ జ‌న‌నాయ‌గ‌న్ రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల‌కు పోటీగా బాల‌కృష్ణ అఖండ 2 ఓటీటీలో రిలీజ్ కావ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.
అఖండ 2 మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. శివ‌త‌త్వం, స‌నాత‌న ధ‌ర్మం అంశాల‌కు బ‌యోవార్ అనే పాయింట్‌ను జోడించి ఈ సినిమా రూపొందింది. రుద్ర సికంద‌ర్ అనే అఘోరాగా, బాల‌ముర‌ళీకృష్ణ అనే ఎమ్మెల్యేగా రెండు పాత్ర‌ల్లో బాల‌కృష్ణ క‌నిపించాడు. అఘోరా పాత్ర‌లో ఆయ‌న మ్యాన‌రిజ‌మ్స్‌, డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. అఖండ 2 మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. 14 రీల్స్ ప్ల‌స్ ప‌తాకంపై రామ్ ఆచంట‌, గోపీచంద్ ఆచంట ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement