Akhanda 2 | అఖండ 2 కొత్త రిలీజ్ డేట్ ఇదేనా? – ఇండస్ట్రీ టాక్ ఏంటంటే?
Akhanda 2 | అఖండ 2 (Akhanda 2) రిలీజ్ డేట్‌కు (Release Date) సంబంధించిన సస్పెన్స్‌కు నేటితో తెరపడనున్నట్లు టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ 12న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Dec 8, 2025, 2.34 pm IST
అఖండ 2
Akhanda 2 | బాలకృష్ణ (Balakrishna) అఖండ 2 (Akhanda 2) రిలీజ్ ఎప్పుడన్నది ఇటు ఇండస్ట్రీ వర్గాలతో పాటు అటు అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల చివరి నిమిషంలో వాయిదాపడింది. పాత అప్పుల విషయంలో నిర్మాతలపై బాలీవుడ్ ప్రొడక్షన్ హౌజ్ ఈరోస్ ఇంటర్నేషనల్ కోర్టును ఆశ్రయించడంతో అఖండ 2 వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఈ రిలీజ్‌కు సంబంధించిన అడ్డంకులను తొలగించేందుకు గత రెండు రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. దిల్‌రాజు, సురేష్‌బాబుతో పాటు పలువురు ఇండస్ట్రీ పెద్దలు రంగంలోకి దిగారు. సమస్యలన్నీ సోమవారం సాయంత్రం లోగా క్లియర్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా అఖండ 2 డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తొలుత డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారట. ఈ పోస్ట్‌పోన్ కారణంగా ఏర్పడిన నెగెటివ్ టాక్ నుంచి బయటపడటమే కాకుండా మరోసారి ప్రమోషన్స్ చేయడానికి టైమ్ దొరుకుతుందని భావించారట. కానీ డిస్ట్రిబ్యూటర్ల మాత్రం డిసెంబర్ 12నే రిలీజ్ చేయాలని పట్టుపడుతున్నట్లు టాక్. ఆడియెన్స్ నుంచి కూడా ఈ వారమే రిలీజ్ చేస్తే మంచిదనే టాక్ వినిపిస్తుంది.
సోమవారం నిర్మాతలతో డిస్ట్రిబ్యూటర్లు, ఇండస్ట్రీ పెద్దలు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిసెంబర్ 12నే అఖండ 2ను రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడితో ప్రొడ్యూసర్లు కూడా దిగి వచ్చారని అంటున్నారు. సోమవారం సాయంత్రం లేదా మంగళవారం రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా అనౌన్స్‌చేస్తారని అంటున్నారు. ఇప్పటికే ఓవర్‌సీస్ ఆన్‌లైన్ బుకింగ్స్ యాప్‌లలో 12వ తేదీకి సంబంధించిన అఖండ 2 టికెట్స్ కనిపిస్తున్నాయి.
అఖండ 2 డిసెంబర్ 12న వస్తే ఆ రోజు రావాల్సిన సినిమాల పరిస్థితి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
ఈ శుక్రవారం థియేటర్లలోకి ఎడెనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మోగ్లీ, సైక్ సిద్ధార్థ, ఈషా, అన్నగారు వస్తారు, ఘంటసాలతో పాటు మరికొన్ని సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వాటన్నింటిపై అఖండ 2 ఎఫెక్ట్ గట్టిగానే పడే అవకాశం కనిపిస్తోంది.
అఖండ 2 మూవీకి బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వం వహించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న నాలుగో మూవీ ఇది. గతంలో వీరిద్దరు కలిసి చేసిన సింహా, లెజెండ్, అఖండ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. అఖండ 2లో సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఆది పినిశెట్టి విలన్ పాత్ర పోషించారు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



