Yellamma Update | దేవిశ్రీ ప్రసాద్ హీరోగా తెలంగాణ సినిమా
బలగం సినిమా తో చక్కటి కుటుంబ ఉద్వేగాన్ని సినీ పరిశ్రమకు పరిచయం చేసిన తెలంగాణ దర్శకుడు వేణు ఎల్దండి అదే కోవలో మరో చిత్రాన్ని రూపొందించనున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం కూడా తెలంగాణ నేపథ్యంలోనే సాగనున్నది. మూడేళ్లుగా అనేక అవాంతరాల మధ్య కొట్టుమిట్టాడుతున్న ఈ సినిమా భవితవ్యం.. ఇప్పుడే తుదిరూపుకు చేరుకున్నది
Entertainment | Published On Jan 13, 2026, 8.10 pm IST
సంక్షిప్త సారాంశం
ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవిశ్రీప్రసాద్‌ఫై ఈ గ్లింప్స్ షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదంటూ ఇటీవల రివాల్వర్ రీటా ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేష్ తెలిపింది.
Yellamma Update | బలగం ఫేమ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఎల్లమ్మ మూవీపై ఎట్టకేలకు అప్‌డేట్ వచ్చింది. సంక్రాంతికి ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్‌చేయబోతున్నట్లు డైరెక్టర్ వేణు ప్రకటించారు. బలగం మూవీతోనే వేణు దర్శకుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. బలగం తర్వాత ఎల్లమ్మ పేరుతో ఓ సినిమా చేయబోతున్నట్లు వేణు వెల్లడించారు. ఈ సినిమాను అనౌన్స్‌చేసి మూడేళ్లు దాటినా సెట్స్‌పైకి మాత్రం రాలేదు. తొలుత ఎల్లమ్మ మూవీలో నాని, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. బిజీ షెడ్యూల్స్ కారణంగా నాని తప్పుకోవడంతో హీరోగా నితిన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ వరుస డిజాస్టర్లతో నితిన్‌తో ఎల్లమ్మ వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత చాలా మంది హీరోల చేతులు మారింది ఈ స్క్రిప్ట్. గత మూడేళ్లుగా నానుతూనే ఉంది.
సంక్రాంతికి గ్లింప్స్...
ఫైనల్‌గా ఈ సంక్రాంతికి మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. జనవరి 15న గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా వేణు ఎల్దండి ప్రకటించారు. బలగం సినిమాను ఎంతగానో ఆదరించారు. ఆశీర్వందించారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను ఈ సినిమాతో అభిమానులు నాకు ఇచ్చారు. నా రెండో సినిమా కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే చేయబోతున్నా. త్వరలో షూటింగ్ మొదలుకాబోతుంది. ఈ సినిమా వివరాలను గ్లింప్స్ ద్వారా వెల్లడిస్తాం. సంక్రాంతికి గ్లింప్స్ రిలీజ్ చేయనున్నాం అని వేణు తెలిపారు.
దేవిశ్రీప్రసాద్ హీరో ...
ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. ఇటీవలే హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో దేవిశ్రీప్రసాద్‌ఫై ఈ గ్లింప్స్ షూటింగ్ జరిగినట్లు సమాచారం. ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఎల్లమ్మ సినిమా తాను చేయడం లేదంటూ ఇటీవల రివాల్వర్ రీటా ప్రెస్‌మీట్‌లో కీర్తి సురేష్ తెలిపింది. ఆమె ప్లేస్‌లో ఎవరిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారన్నది గ్లింప్స్‌తోనే క్లారిటీ రాబోతుంది. ఎల్లమ్మలో ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న 61వ మూవీ ఇది.
సంబంధిత వార్తలు

Tollywood | పర్సెంటేజీ వివాదానికి శుభం కార్డు – పెద్దికి లైన్ క్లియర్ – దిల్‌రాజు కామెంట్స్
మే 15, 2026

Vidya Balan | ఐశ్వర్య రాజేశ్ పాత్రలో విద్యాబలన్..! ఇది మన తెలుగు సినిమానే..!
మే 13, 2026

Yellamma Movie | ఎల్లమ్మకు జోడీ దొరికిందా? – టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన సినిమాలో సీతారామం బ్యూటీ
మే 7, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



