Kavya Kalyanram | బలగం హీరోయిన్‌తో కీరవాణి కొడుకు పెళ్లి – అఫీషియల్‌గా క్లారిటీ ఇచ్చేశారా?
బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీరవాణి కొడుకు మ్యూజిక్ డైరెక్టర్ కాళభైరవతో ఏడడుగులు వేయబోతున్నట్లు చెబుతోన్నారు. సోమవారం జరిగిన ఓ బుక్ లాంఛ్ ఈవెంట్‌కు వీరిద్దరు జంటగా హాజరుకావడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Entertainment | Published On Mar 24, 2026, 12.08 pm IST
Kavya Kalyanram | టాలీవుడ్‌లో ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఇటీవలే మూడుముళ్లతో ఒక్కటయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్..ప్రియురాలు నయనికతో ఏడడుగులు వేశాడు. త్వరలోనే మరో టాలీవుడ్ జంట పెళ్లి బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కీరవాణి కుమారుడు, మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ..బలగం హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ పెళ్లిచేసుకోనున్నట్లు వార్తలొస్తున్నాయి. గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట త్వరలో పెళ్లి కబురు వినిపించనున్నారని అంటున్నారు.
బుక్ లాంఛ్ ఈవెంట్....
సోమవారం జరిగిన ఓ బుక్ లాంఛ్ ఈవెంట్‌కు కావ్య కళ్యాణ్‌రామ్‌తో కలిసి అటెండ్ అయ్యాడు కాలభైరవ. ఈ ఈవెంట్‌కు వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. వేడుకలో కాలభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ చాలా క్లోజ్‌గా కనిపించారు. పక్కపక్కనే కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకున్నారు. ఈ బుక్ లాంఛ్ వేడుక ద్వారా తమ ప్రేమ, పెళ్లిపై అఫీషియల్‌గా కాళభైరవ, కావ్య కళ్యాణ్ హింట్ ఇచ్చారని నెటిజన్లు చెబుతోన్నారు.
ఉస్తాద్ మూవీతో...
కాళభైరవ సోదరుడు శ్రీసింహా హీరోగా నటించిన ఉస్తాద్ మూవీలో కావ్య కళ్యాణ్‌రామ్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు కాళభైరవ మ్యూజిక్ అందించారు. ఉస్తాద్ షూటింగ్‌లోనే కాళభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారిందట. గత రెండేళ్లుగా వీరి సీక్రెట్ లవ్‌స్టోరీ సాగుతుందట. కాళభైరవ, కావ్య కళ్యాణ్ రామ్ ప్రేమాయణం గురించి ఇరు కుటుంబసభ్యులకు తెలుసునని సమాచారం. వీరి పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్ వినిపిస్తోంది.
చైల్డ్ ఆర్టిస్ట్‌గా....
చైల్డ్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది కావ్య కళ్యాణ్ రామ్. ఠాగూర్, గంగోత్రి, అడవిరాముడు, బాలు, విజయేంద్రవర్మతో పాటు పలు సినిమాలు చేసింది. మసూద మూవీతో హీరోయిన్‌గా మారిన కావ్య కళ్యాణ్ రామ్ బలగంతో మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఉస్తాద్ తర్వాత సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం వాట్సప్ నరేష్ పేరుతో ఓ మూవీ చేస్తోంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



