అప్పుడు కొడుకు మూవీ – ఇప్పుడు కూతురు సినిమా – బాలకృష్ణ ఫ్యామిలీని వెంటాడుతున్న బ్యాడ్‌లక్
Entertainment | Published On Dec 7, 2025, 3.22 pm IST
బాలకృష్ణ
అఖండ 2 వాయిదా టాలీవుడ్‌ను కుదిపేస్తుంది. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలతో పాటు అభిమానుల్లో అఖండ 2 పోస్ట్‌పోన్ హాట్ టాపిక్‌గా మారింది. ఆర్థికపరమైన సమస్యల వల్ల చివరి నిమిషంలో బాలకృష్ణ లాంటి టాప్ హీరో సినిమా వాయిదాపడటం టాలీవుడ్ సినీ చరిత్రలోనే ఇదే ఫస్ట్ టైమ్ అని ఫ్యాన్స్ చెబుతున్నారు. బాలకృష్ణ యాభై ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా ఎప్పుడు జరగలేదని అంటున్నారు.
అఖండ 2 రిలీజ్ ఎప్పుడన్నది ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే బాలకృష్ణ కొడుకుతో పాటు కూతురు సినిమా వరుసగా ఇబ్బందుల్లో పడటం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. హనుమాన్ ఫేమ్ ఫ్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఈ ఏడాది ఆరంభంలో మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీని అనౌన్స్‌చేశారు. సూపర్ హీరో బ్యాక్‌డ్రాప్‌లో సోషియో ఫాంటసీగా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు వెల్లడించారు. మోక్షజ్ఞతేజ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ఓపెనింగ్ ఈవెంట్ వరకు వచ్చిన మోక్షజ్ఞ తేజ డెబ్యూ మూవీ ఆ తర్వాత ఆగిపోయింది. కారణాలేమిటన్నది ఇటు బాలకృష్ణ ఫ్యామిలీతో పాటు అటు డైరెక్టర్ ప్రశాంత్ కూడా ఇప్పటివరకు రివీల్ చేయలేదు. మోక్షజ్ఞతేజ ఫస్ట్ మూవీ ఆగిపోవడంతో అభిమానులు చాలా డిసపాయింట్ అయ్యారు.
తాజాగా బాలకృష్ణ చిన్న కూతురు నందమూరి తేజస్విని అఖండ 2తో ఫస్ట్ టైమ్ ప్రజెంటర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమా ప్రొడక్షన్‌లో తేజస్విని యాక్టివ్‌గా పాల్గొన్నది. అఖండ 2తోనే తొలిసారి బాలకృష్ణ పాన్ ఇండియన్ లీగ్‌లోకి అడుగుపెట్టడానికి రెడీ అయ్యారు. ఈ సినిమా షూటింగ్ కోసమే కాకుండా ప్రమోషన్స్ విషయంలో చాలా కష్టపడ్డారు. కర్ణాటక, చెన్నై, యూపీ, ముంబాయితో పాటు చాలా రాష్ట్రాలు తిరిగి సినిమాను ప్రమోట్ చేశారు. కానీ చివరి నిమిషంలో అఖండ 2 వాయిదాపడటంతో బాలకృష్ణ కష్టం మొత్తం వృథాగా మారిపోయింది. బాలకృష్ణ కూతురు తొలిసారి ప్రజెంటర్‌గా వ్యవహరిస్తున్న సినిమాకు రిలీజ్ కష్టాలు ఎదురవ్వడం అభిమానులకు మింగుడు పడటం లేదు. కొడుకు మూవీ ఆగిపోవడం, కూతురు సినిమా వాయిదాపడటంతో బ్యాడ్‌లక్ అని అంటున్నారు
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



