త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dimple Hayathi | హీరోయిన్లను కాదు.. వ్యవస్థను ప్రశ్నించాలి: డింపుల్ హయతి

Dimple Hayathi | టాలీవుడ్‌లో హీరోయిన్ల పాత్ర‌ల‌పై డింపుల్ హయతి కీలక వ్యాఖ్యలు చేసింది. పాత్ర‌ల విష‌యంలో హీరోయిన్ల‌నే టార్గెట్ చేయ‌డం స‌రైన విధానం కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అసలు బాధ్యత అలాంటి పాత్రలను రూపొందించే రచయితలు, దర్శకులు, నిర్మాతలపైనే ఉంటుందని స్ప‌ష్టం చేసింది.

P

Entertainment | Published On Jun 7, 2026, 5.02 pm IST

Dimple Hayathi | హీరోయిన్లను కాదు.. వ్యవస్థను ప్రశ్నించాలి: డింపుల్ హయతి
Advertisement

Dimple Hayathi | టాలీవుడ్‌లో హీరోయిన్ల పాత్ర‌ల‌పై డింపుల్ హయతి కీలక వ్యాఖ్యలు చేసింది. పాత్ర‌ల విష‌యంలో హీరోయిన్ల‌నే టార్గెట్ చేయ‌డం స‌రైన విధానం కాద‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అసలు బాధ్యత అలాంటి పాత్రలను రూపొందించే రచయితలు, దర్శకులు, నిర్మాతలపైనే ఉంటుందని స్ప‌ష్టం చేసింది. ప్రస్తుతం ‘పెద్ది’ చిత్రంలో జాన్వీ కపూర్ పాత్రపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్న వేళ డింపుల్ చేసిన వ్యాఖ్యలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను చెప్పింది.

“హీరోయిన్ల కోసం రాస్తున్న పాత్రల గురించి ఇప్పుడు చర్చ జరగడం సంతోషకరం. అయితే, ఏదైనా పాత్ర ప్రేక్షకులను మెప్పించకపోతే వెంటనే ఆ నటిని విమర్శించడం సరైంది కాదు. ఎందుకంటే ఏ రకమైన పాత్రలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని భావిస్తారో, వాటినే మేకర్స్ తెరపైకి తీసుకొస్తారు” అని డింపుల్ పేర్కొంది. న‌టీన‌టులుగా తమకు వచ్చిన అవకాశాలను మాత్రమే వినియోగించుకోగలమని, పెద్ద ప్రాజెక్టుల్లో భాగమై ఎక్కువ మంది ప్రేక్షకులకు చేరువ కావాలనే ఉద్దేశంతో పనిచేస్తామని తెలిపింది. ఒక పాత్రలో లోపాలు ఉంటే దానికి కారణం నటి కాదని, ఆ పాత్రను త‌యారు చేసిన రచయితలు, దాన్ని తెరపై ఆవిష్కరించిన దర్శకులేనని వ్యాఖ్యానించింది.

మహిళా పాత్రలను తరచూ ఒకే తరహా మూసలో చూపించడం వల్ల తమ ప్రతిభను పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం దక్కడం లేదని డింపుల్ ఆవేదన వ్యక్తం చేసింది. మరోవైపు హీరో సెంట్ర‌లైజ్డ్ కథల్లో మాత్రం న‌టుల‌కు విస్తృత స్థాయిలో స్వేచ్ఛ ల‌భిస్తోంద‌ని చెప్పింది. తెర వెనుక జరిగే నిర్ణయాలు ప్రేక్షకులకు కనిపించవని, ఒక పాత్ర రూపుదిద్దుకోవడం అనేది ఒక్కరి నిర్ణయం కాదని ఆమె పేర్కొంది. అయితే మంచి కథలు, బలమైన పాత్రలు, మెరుగైన సినీ అనుభవాలను ప్రేక్షకులు, నటీనటులు అందరూ అర్హులేనని చెప్పింది. అలాంటి మార్పు కోసం ఇండ‌స్ట్రీ మొత్తం కలిసి ముందుకు రావాల్సిన అవసరం ఉందని డింపుల్ పిలుపునిచ్చింది.

 

Advertisement
Advertisement