KTR | అవును.. మీకు హిట్లరే స్ఫూర్తి.. ముమ్మాటికీ నిజమే
KTR | ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు, జర్మనీ నియంత హిట్లర్ రేవంత్‌రెడ్డికి ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని సీఎం బహిరంగంగా ఒప్పుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
- అందుకే రాష్ట్రంలో ఇంత అరాచకం చేస్తున్నరు
- ప్రజలకెప్పుడో తెలుసు.. ఇప్పుడు మీ నోటితోనే ఒప్పుకున్నారు
- మాకు అంబేద్కర్, గాంధీ, జయశంకర్ సార్ ఆదర్శం
- మరి మీ వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా?
- హైడ్రా ఒక హంతక ముఠా
- సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్
KTR | త్రినేత్ర.న్యూస్: ప్రపంచంలోనే అత్యంత క్రూరుడు, జర్మనీ నియంత హిట్లర్ రేవంత్‌రెడ్డికి ఆదర్శం కాబట్టే రాష్ట్రంలో ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రేవంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆదివారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. రాష్ట్రంలో అక్రమ నిర్మాణాల కూల్చివేతల కోసం ఏర్పాటు చేసిన 'హైడ్రా' (HYDRAA) సంస్థకు, దాని పనితీరుకు హిట్లర్ చర్యలే స్ఫూర్తి అని సీఎం బహిరంగంగా ఒప్పుకోవడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
మీరు నియంతలను పూజిస్తరు..
రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన 'హైడ్రా' ఒక హంతక ముఠా లాంటిది. మాకు అంబేద్కర్, మహాత్మా గాంధీ, జయశంకర్ ఆదర్శం. రేవంత్ రెడ్డి నిరంకుశ, ఫాసిస్ట్ మనస్తత్వం ఇప్పుడు దేశం మొత్తానికి అర్థమైంది. మా పాలన రాజ్యాంగ స్ఫూర్తితో సాగింది, హిట్లర్ లాంటి నియంతృత్వ చర్యలతో కాదు. మీకు స్ఫూర్తి హిట్లర్.. ముమ్మాటికి నిజమే. రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన 'హైడ్రా' ఒక అస్సాసినేషన్ ఏజెన్సీ (హంతక ముఠా) లాంటిది. మీరు నియంతలను పూజిస్తారు. పేదల ఇళ్ల కూల్చివేతలను గొప్పగా చెప్పుకుంటూ మురిసిపోతారు. తెలంగాణ ప్రజలకు మీ నియంత నైజం ముందే తెలుసు. ఇప్పుడు మీ నోటితోనే మీ ఫాసిస్ట్ ఆలోచనలను దేశం మొత్తానికి స్పష్టం చేసినందుకు ధన్యవాదాలు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ విమర్శించారు.
మీ అంత తెలివైనవాళ్లం కాదు..
కాంగ్రెస్ ప్రభుత్వ హింసాత్మక, కూల్చివేతల ధోరణి సరికాదు. బీఆర్‌ఎస్ పార్టీ ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి ఉంది. మీలాంటి హిట్లర్ ఆలోచనలు చేసేంత తెలివైనవాళ్లం మేం కాదు. అందుకే మా పదేళ్ల పరిపాలనను మేం డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్ఫూర్తితో, మహాత్మా గాంధీ చూపిన అహింసా మార్గంలో, తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ కన్న కలల ఆశయాల ప్రాతిపదికన నడిపించాం" అని కేటీఆర్ గర్వంగా ప్రకటించారు.
ప్రజలు తిరగబడే రోజులు దగ్గరే ఉన్నయ్..
పేదలు, మధ్య తరగతి ప్రజల ఇళ్లను కూల్చడమే రేవంత్‌రెడ్డి పని. ఈ నియంతృత్వ పోకడలపై తెలంగాణ సమాజం తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ప్రజాస్వామ్య దేశంలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, ప్రపంచంలోనే అత్యంత క్రూరుడైన నియంత హిట్లర్‌ను ఆదర్శంగా తీసుకుంటున్నానని ప్రకటించడాన్ని కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? అని కేటీఆర్ ప్రశ్నించారు.
తాజావార్తలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!
- ●KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
- ●Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..
- ●Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే - జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
- ●IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘన్‌పై భారత్ ఆధిపత్యం.. అరంగేట్రంలో అలరించిన మానవ్

HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!

KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న

Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..





