KTR | సింగపూర్ ఎన్నారై ప్రతినిధులతో కేటీఆర్ ప్రత్యేక సమావేశం
KTR | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
KTR | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల కోసం మలేషియా వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ ఎన్నారై గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాలా ఆధ్వర్యంలో ఈ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ సమావేశంలో సింగపూర్‌లో జరుగుతున్న అభివృద్ధి, పట్టణ ప్రణాళిక, ప్రజా రవాణా, పారిశుద్ధ్యం, టెక్నాలజీ వినియోగం వంటి అనేక అంశాలపై కేటీఆర్ ప్రతినిధులతో విస్తృతంగా చర్చించారు. అలాగే గతంలో కేసీఆర్ సింగపూర్, మలేషియా పర్యటనల సందర్భంగా అక్కడి అభివృద్ధి నమూనాలను అధ్యయనం చేసిన విషయాలను గుర్తు చేసుకున్నారు.
సింగపూర్, మలేషియా దేశాల్లో అమలవుతున్న అభివృద్ధి విధానాలలో తెలంగాణలో అనుసరించదగిన అంశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అంతర్జాతీయ ప్రమాణాల అభివృద్ధి నమూనాలను తీసుకురావాల్సిన అవసరాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.

ఈ సందర్భంగా సింగపూర్ ఎన్నారై ప్రతినిధులు సింగపూర్‌లో కూడా తెలంగాణ సభ నిర్వహించాలని కేటీఆర్ గారిని కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో వివిధ తెలంగాణ, తెలుగు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా తెలుగు సమాజం సభ్యులు, తెలంగాణ కల్చరల్ సొసైటీ సభ్యులు, బీఆర్‌ఎస్ ఎన్నారై సభ్యులు, సింగపూర్ వాసవి సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యేకంగా బస్సుల్లో మలేషియాకు చేరుకుని ఈ సమావేశంలో పాల్గొనడం విశేషం.
సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, మంచిరెడ్డి ప్రశాంత్, బీఆర్‌ఎస్ సింగపూర్ సభ్యులు రంజిత్ రావు, పెద్ది శేఖర్, రజినీకాంత్, కిరణ్ షెర్ల, టీసీఎస్‌ఎస్ సభ్యులు నల్లా భాస్కర్, రాజు, వీఏఎం సభ్యులు కైల నాగరాజు, రమణ, ఎస్‌టీఎస్ సభ్యులు కోటి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, బైరి రవి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!
- ●KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న
- ●Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..
- ●Nithya Menen | టాలీవుడ్ ఒక్కటే కాదు .. అన్ని ఇండస్ట్రీలు ఇంతే - జాన్వీ కపూర్ పెద్ది వివాదంపై నిత్యా మీనన్ కామెంట్స్
- ●IND Vs AFG | ముల్లాన్‌పూర్ టెస్టులో ఆఫ్ఘన్‌పై భారత్ ఆధిపత్యం.. అరంగేట్రంలో అలరించిన మానవ్

HYDRAA | హైడ్రా ప్రజావాణికి విరామం.. మళ్లీ ఎప్పుడంటే

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి సభలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేకు అవమానం..!

KTR | నరరూప రాక్షసుడు.. నీకు రోల్ మోడలా? : రేవంత్‌కు కేటీఆర్ సూటి ప్రశ్న

Vande Bharat | హిందూపురంలో ఆవులను ఢీకొట్టిన వందే భారత్.. తప్పిన ప్రమాదం..





